'కెలైడొస్కోప్':దేశ విదేశ ప్రసిద్ధ రచనల పరిచయం పుస్తకం'ప్రస్తుతం వస్తున్న నవలలు, కధా సంకలనానికి భిన్న మైనది. కారణం ఈ పుస్తకం లో ఉన్న 96 కధలు రచయిత్రి రాసినట్లు "కొన్ని రచనలు-అవార్డులు, ప్రైజులు గెలుచుకున్నవి,మరికొన్ని ప్రైజులకోసం షార్ట్/లాంగ్ లిస్ట్ అయినవి.మిగిలిన వి కేవలం కాలక్షేపం కోసం మాత్రమే చదివే వయినా,ఎక్కువ జనాదరణ పొందినవి."ఆ కారణంగా భారతీయాంగ్ల నవలల పరిచయం మాత్రమే కాకుండా ఇతర దేశాలలో వెలువడిన ఇతరభాషల ఇంగ్లీష్ అనువాదాలు, యూరోపియన్/అరబిక్/ఉర్దూ భాషాంతరీకరణలు తెలుగులో చదవే సదావాకాశం, ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా సరశమైన,వ్యవాహారిక తెలుగు లో. అంతేకాకుండా రచయత్రి తనకు ఈ రచనలు పరిచయం చేసిన భిన్నమైన సంస్కృతులు,ఆచార వ్యవహారాలు, జీవన శైలులు మనకు బాగా విడమరిచి చెప్పారు. ఈ పుస్తకానికి ఇచ్చిన టైటిల్ ఎంతో అర్థవంతగా ఉంది. ఇంగ్లీష్ పుస్తకాలు కొనుగోలు చేయలేని పక్షంలో ఇటువంటి అనువాద సాహిత్యం తెలుగు సాహిత్య ప్రియులు తప్పని సరిగా కొనుగోలు చేయవచ్చును.