పుస్తకం: హిందీ గేయ వైభవం-1 (రఫీ)
ముద్రణ: 2006
వెల: 40/-
రచన: పి వి సత్యనారాయణ రాజు
ప్రచురణలు: హాసం
ప్రతులకు: విశాలాంధ్ర
దాదాపు దశాబ్దం క్రితం కొన్ని ఏళ్ల వరకు నేను క్రమం తప్పకుండా చదివిన పక్ష పత్రిక "హాసం". హాస్యానికి, సంగీతానికి సంబంధించిన అనేక అంశాలు ఆ పత్రిక అందించేది. కారణాంతరాల వల్ల ఆగిపోయింది. "న భూతో న భవిష్యతి" కి చక్కని ఉదాహరణ ఆ పత్రిక. అటువంటి పత్రిక అప్పటికి ముందు, ఆ తర్వాత ఉన్నట్టు నాకు తెలియదు.
ఇక విషయానికి వస్తే స్వతహాగా బహుభాషారక్తుడనైన నాకు అందులో హిందీ పాటలకు, తమిళ పాటలకు తెలుగు అర్థాలు ఇస్తూ వ్రాసే వ్యాఖ్యానాలు బాగా నచ్చేవి. ఆ క్రమంలో మహమ్మద్ రఫీ పాడిన సుప్రసిధ్ధ హిందీ గీతాలకు భాష్యాలు వ్రాసేవారు శ్రీ పి వి సత్యనారాయణ రాజు. చాన్నాళ్లు ఆ వ్యాసాలు పత్రికల్లోంచి కట్ చేసి మరీ దాచాను. కానీ కాలక్రమంలో నా అశ్రధ్ధ వల్ల అవి కనపడకుండా పోయాయి. అయితేనేం..అవన్నీ ఇలా పుస్తకంగా అందించారు "హాసం" ప్ప్రచురణల వారు. ఇందులో రఫీ పాడిన 16 సూపర్ హిట్ హిందీ గీతాలకు అర్థ తాత్పర్యాలు, ఇతర వివరణలు ఉన్నాయి. నిజానికి ఆ పాటలు విన్న చాలా మందికి, అర్థాలు తెలియవు. సందర్భాన్ని బట్టి ఒక లైను అర్థమైతే రెండో లైను ఫలానా అయి ఉంటుందేమో అని ఊహించుకోవడం తప్ప కచ్చితంగా అర్థం తెలియడం అన్నది చాలా అరుదు. అందుకు ప్రధాన కారణం హిందీ చిత్ర గీతాల్లో ఉర్దు పదాలు ఎక్కువగా ఉండడం. వాటికి అర్థాలు హిందీ మాట్లాడే వారు కూడా చాలా సందర్భాల్లో చెప్పలేరు. ఓపిక పట్టి ఉర్దు-తెలుగు నిఘంటువు కొని చూడాలనే ఆలోచన మనలో ఉండదు. ఆ కారణంగా అర్థం తెలియకపోయినా ఆ పాటలను ఆస్వాదించేస్తాం, పాడేసుకుంటాం. ఈ పుస్తకం చదివితే ఆ వెలితి కొంత తీరుతుంది.
ఉదాహరణకి "చౌదవీక చాంద్ హో.." పాట తెలియని హిందీ గీత ప్రియులు ఉండరు. మొదటి లైన్ ఓకే. రెండొ లైన్ లో "యా ఆఫ్తాబ్ హో" అంటాడు. అదేమిటొ ఈ పుస్తకంలో చదివే దాకా నాకు తెలియలేదు. "ఆఫ్తాబ్" అంటే సూర్యుడట. ఇదె పాటలో చెవికింపుగా ఉండి, అర్థం కాకుండా ఉండే ఉర్దూ పదాలు కావల్సినన్ని ఉన్నాయి. "సజ్ దే తుమ్హారె రాహ్ పె కర్తీ హై కహ్ కషా" అంటే ఏమిటి? తెలుసుకోవాలంటే ఈ పుస్తకం పేజీలు తిప్పాల్సిందే. ప్రతి పదానికి అర్థం ఇవ్వడం ఇక్కడ విశేషం.
ఇంకా షెమ్మీ కపూర్ పాట "బదన్ పె సితారె లపేటె హుయే.." అంతా అర్థమైనట్టే ఉండేది. కానీ ఆ పాట మీద ఉన్న వ్యాసం చదివాక కొన్ని పదాలకి నిజమైన అర్థాలు తెలుసుకున్నాను. అంటే ఇన్నాళ్లూ అసలర్ధం తెలీక ఏదో ఊహించుకున్నానన్నమాట.
ఇలా మొత్తం 16 పాటలు- "ఆజా తుఝ్ కో పుకారే మేరే గీత్", "ఆజ్ మౌసం బే ఇమాన్ హై బడా", "మే జిందగీ క సాథ్ నిభాతా చలా గయా" లాంటి అజరామరమైన పాటలు అర్థవంతంగా చదువుకునే అవకాశం ఈ పుస్తకం ఇచ్చింది.
హిందీ సంగీత ప్రియులు, మరీ ముఖ్యంగా రఫీ పాటల అభిమానులు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
ఇది 2006 లో అచ్చైనా, ఇప్పటి కాలానికి ఇంకా బాగా పనికొస్తుంది. ఇందులోని పాటలు కొన్ని ట్యూన్ పరంగా తెలియక పోయినా, గుర్తు రాక పోయినా హాయిగా యూట్యూబ్ లో కొట్టి చూసేయొచ్చు. నాకు తెలిసి హిందీ పరీక్షలు కట్టి వ్రాయడం వల్ల ఎంత హిందీ వస్తుందో తెలియదు కాని, ఇలా మంచి హిందీ పాటల అర్థాలు తెలుసుకుంటూ వింటుంటే మాత్రం కచ్చితంగా వస్తుంది.