పుస్తక సమీక్ష: ప్రాచీన ప్రపంచ చరిత్ర - ....

pracheena prapancha charitra  book review
పుస్తకం: ప్రాచీన ప్రపంచ చరిత్ర
మూల రచన: కొరోవ్కిన్
అనువాదం: నిడమర్తి ఉమారాజేశ్వర రావు, రాచమల్లు రామచంద్రారెడ్డి
వెల:160/-
ప్రతులకు: విశాలాంధ్ర (040-24224458, 24224459)

నా మిత్రుల్లో చాలా మంది విదేశీ పర్యటనలపై మోజున్న వారున్నారు. ముఖ్యంగా ఐరోపా దేశలకి వెళ్లడం కాస్త ఎక్కువ మోజు. ఎందుకంటే పీసా టవర్, ఈఫిల్ టవర్, వేనీస్ నగరం లాంటి మూడు నాలుగు పేర్లు చెప్తారు. ఇక అక్కడకు వెళ్లాక అక్కడున్న గైడ్స్ చుట్టూ ఉన్న మ్యూజియంలు, పురాతన భవనాలు, కోటలు, రాజుల విగ్రహాలకు సంబంధించిన విషయాలు ఇలా ఎన్నో ఆసక్తిగా చెప్పే ప్రయత్నం చేస్తారు. వాటి గురించి ముందస్తుగా కొంత సమాచారం లేకపోతే ఆ కాసేపట్లో గైడ్స్ చెప్తున్నది బుర్రకెక్కించుకోవడం కష్టం. ఈఫిల్ టవర్, పీసా టవర్ చూడడానికి పొందే ఆత్రుత మిగతా వాటి పట్ల ఉండదు. ఎందుకంటే వాటి గురించి పెద్దగా తెలియదు కాబట్టి. ప్యారిస్ లో ఈఫిల్ టవర్ చూట్టానికని వెళ్లి, పక్కనే ఉన్న అతి అరుదైన మ్యూజియం చూపిస్తామంటే బద్దకించే టూరిస్టులు కూడా చాల మంది ఉంటారు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, సాధ్యమైనన్ని చారిత్రక విషయాలు, పురాతన విశేషాలు తెలుసుకోవడం వల్ల విదేశాలకెళ్ళినప్పుడు ఆ పర్యటనల్ని ఆశ్వాదించడంలోనూ, వెళ్లలేనప్పుడు తెలుసుకుని ఆ నాటి పరిస్థితులు ఊహించుకోవడంలోనూ ఒక సరదా ఉంటుంది. అటువంటి సరదాకి తెరలేపేదే ఈ "ప్రాచీన ప్రపంచ చరిత్ర" పుస్తకం.

ఇది ఒకరకంగా టెక్స్ట్ బుక్ లాంటిది. కోరోవ్కిన్ రాసిన మూలానికి తెలుగు అనువాదం. ప్రాచీన ఈజిప్ట్, ప్రాచీన చైనా, ప్రాచీన గ్రీసు, ప్రాచీన రోం కి సంబందించిన అనేక విశేషాలు సచిత్రంగా పొందుపరిచిన పుస్తకం ఇది. కాలక్షేపానికి ఒక న్యూస్ పేపర్ చదువుతున్నట్టుగా మొదలుపెట్టినా ఆనాటి జీవన శైలి, రాజుల వివరాలు మొదలైనివి ఎన్నో ఇందులో ఉన్నాయి.

మనోవికాసానికి అన్ని రకాల పుస్తకాలు ఎంతో కొంత చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదీ మాతృభాషలో చక్కగా అనువాదమైనప్పుడు చదవడంలో తేలిక ఉంటుంది. హిస్టరీతో మనకి పనేంటి, ఇప్పుడేమీ కాంపిటీటివ్ పరీక్షలు రాయడంలేదు కదా అనుకుంటే, సరదాగొలిపే, ఆశ్చర్యపరిచే ఎన్నో విషయాలు మనం తేలుసుకోలేకపోతున్నామనే అనుకోవాలి.

విదేశాల సంగతి తీసి పక్కన పెడితే, అసలు భారతదేశ చరిత్రగురించే ఇందులో కావాల్సినంత ఉంది. మన దేశం గురించి ఇంతుందా అని మనలో చాలా మంది ఆశ్చర్యపోవచ్చు కూడా. ఇంతకంటే చెప్తే ఈ పుస్తకానికి మార్కెటింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. చెప్పినంతవరకు వాస్తవాలు.

ఇక ఆలశ్యం చేయకుండా ఈ పుస్తకం తెప్పించుకుని చదవండి.

- సిరాశ్రీ 

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు