పుస్తక సమీక్ష - -సిరాశ్రీ

book review
పుస్తకం: శ్రీమద్రామాయణ విజ్ఞాన దీపిక
కూర్పు: డా|| శ్రీమతి ఏ ఎస్ వీ మహాలక్ష్మమ్మ
వెల: రూ 40/-
ప్రతులకు: 0883-2418350

మనకందరికీ "రామాయణం" గురించి కొద్దో గొప్పో తెలుసు. కొంతమంది తమకు చాలా తెలుసనే అభిప్రాయంలో కూడా ఉంటారు. మనం విన్న కథల వల్లనైతే గానీ, బాపూ గారి సంపూర్ణ రామాయణం వల్లనైతే కానీ, రామానంద్ సాగర్ సీరియల్ కారణంగా గాని మనం అలా భావించడంలో తప్పులేదు. సరదాగా ఒక ప్రశ్న. సీత తల్లి ఎవరు? వెంటనే భూదేవి అంటాం. అంటే జనకుని భార్య భూదేవా? కాదు కదా. జనకుని భార్య, సీతను పెంచిన తల్లి ఒకరు ఉంది కదా. ఆమె పేరు? చాలా మందికి తట్టదు. భాగవతంలో కృష్ణుడి కన్న తల్లైన దేవకికి, పెంచిన తల్లి యశోదకు ఉన్న ప్రాముఖ్యం రామాయణంలో సీతను పెంచిన తల్లికి ఎందుకు లేదు? దానికి కారణం మన నాటకాల్లోనూ, తద్వారా సినిమాల్లోనూ పెద్దగా ప్రస్తావించకపోవడం. అలాగే విభీషణుడి భార్య, సముద్రం దాటేటప్పుడు వాడిన యోజనములు అనే కొలతలో యోజనం అంటే ఇప్పటి లెక్కలో ఎన్ని మైళ్లు వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుందా! 

రామాయణం గురించి ఇలాంటి తెలియని, తెలుసుకోవలసిన విషయాలు అనేకం ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఆ ప్రయత్నాన్ని చేసి సఫలం అయ్యారు డా|| శ్రీమతి ఏ ఎస్ వీ మహాలక్ష్మమ్మ. "శ్రీమద్రామాయణ విజ్ఞాన దీపిక" పేరుతో వీరు వేసిన 88 పేజీల పుస్తకం పిల్లలు, పెద్దలు చదవవలసిందే.

మొత్తం 1043 ప్రశ్న జవాబులున్న ఈ పుస్తకాన్ని రామాయణం పై ప్రవచనాలు చెప్పగలిగే ఒక పురాణవేత్తకు చూపిస్తే ఆయన ఇందులో కొత్తగా కనీసం 300 విషయాలు తెలుసుకున్నానన్నారు. అంటే మహాలక్ష్మమ్మగారు చేసిన కృషి మనకు అర్థమవుతుంది.

మరో విశేషం ఏమిటంటే ఇందులో ప్రశ్నలన్నీ కాండలవారీగా విభజించి పెట్టారు. అది ధారణకి ఎంతగానో ఉపకరిస్తుంది. 
ఇంతకన్నా ఈ క్విజ్ పుస్తకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రామాయణం గురించి తెలుసుకునేకొద్దీ తెలుసుకునేందుకు ఇంకా మిగిలే ఉంటుంది. అయితే ఈ 1043 ప్రశ్న జవాబులు మీకు కంఠోపాఠమైతే మీకు చాలా చాలా తెలిసినట్టే అనుకోవచ్చు.

-సిరాశ్రీ

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు