పుస్తక సమీక్ష - ..

book review

ఫేస్ బుక్ కార్టూన్లు
లెపాక్షి & రాజు
మొత్తం కార్టూన్లు 50+50
వెల రూ.120/-
ప్రతులకు:
జె.వి. పబ్లిషర్స్,
జ్యోతి వలబోజు
ఫ్లాట్ నెం. 103, జయ అపార్ట్ మెంట్, 
3-6-18,
హిమాయత్ నగర్,
హైదరాబాద్-500 029
తెలంగాణ.
ఫోన్: 8096910140
మరియు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో.

తమ అభిమాన హీరో సినిమా రాబోతోందంటే ఫాన్స్ కి పండగే. ఏ స్టార్ సినిమా రిలీజయినపుడు వాళ్ళ ఫాన్స్ హడావుడి ఉంటుంది. అదే మల్టీ స్టారర్ సినిమా అయితే మరింత సందడి. కార్టూన్ ఇష్టులకు తమ అభిమాన కార్టూనిస్ట్ అంటే హీరోనే. వారి కార్టూన్ల సంకలనం అంటే ఓ పెద్ద సినిమా రిలీజ్ లాంటిదే. ఒక కార్టూనిస్ట్ సంకలనమే అంత సంతోషాన్నిస్తే, మల్టీ స్టారర్ సినిమా లాంటి కార్టూన్ బుక్...ఇద్దరు సీనియర్ కార్టూనిస్టులు రాజు, లేపాక్షి ఒకే సబ్జెక్ట్ పై పోటీపడి గీసారా అన్నట్టున్న పుస్తకం, " ఫేస్ బుక్ కార్టూన్లు". ఎక్కడా ఒకదానితో మరొకటి కలవకుండా విస్తృతంగా చక్కగా ఉన్నాయి. ఒక్కో కార్టూన్ చూసిన కొద్దీ ఫేస్ బుక్ పై పాఠకుడికి నెగెటివ్, పాజిటివ్ అభిప్రాయాలను రేకెత్తించడం వీటి ప్రత్యేకత. కొన్ని చూసినప్పుడు సమాజం ఫేస్ బుక్ కి ఇంత అడిక్ట్ అయిపోయిందాని భయమేస్తుంది. తమని తాము విశ్లేషించుకోగలిగిన వాళ్ళయితే ఈ కార్టూన్లు చూసాక వీలైతే తమ ఫేస్ బుక్ వ్యాపకాన్ని తగ్గించుకునే ప్రయోజనమూ లేకపోలేదు. బొమ్మల స్టైల్, గీతలు, కలరింగ్ లలో రాజు, లేపాక్షి ది వేర్వేరు స్టైల్. ఈ పుస్తకం కలర్ లో ఉంటే మరింత బాగుండేదిగా అని కొంత ఆశ కలుగుతుంది. కానీ బహుశ, ఆర్థిక పరమైన పరిధుల వల్ల కాబోలు బ్లాక్ అండ్ వైట్ తో సరి పెట్టేసారు. ఈ పుస్తకం ఇచ్చే ఉత్సాహంతో తదుపరి సంకలనం కలర్ లో వేసి వెల మరింత ఎక్కువ నిర్ణయించినా కార్టూన్ ఇష్టులు తప్పక కొంటారు. ఈ పుస్తకానికి జయదేవ్ గారు, మోహన్ గారు రాసిన ముందు మాట బాగుంది. ఈ పుస్తకం అచ్చు వేసిన జేవీ పబ్లిషర్స్ జ్యోతి వలబోజు అభినందనీయులు. ఎందుకంటే, కొమ్ములు తిరిగిన పబ్లిషర్సే పుస్తకాల ముద్రణ నుంచి తప్పుకుంటున్న ఈ రోజుల్లో పబ్లిషింగ్ మొదలు పెట్టి మంచి మంచి పుస్తకాలను అచ్చు వేస్తున్నారు. జేవీ పబ్లిషర్స్ వారి నుంచి వచ్చిన మరో మంచి పుస్తకమే అవుతుంది ఇది కచ్చితంగా. ఈ పుస్తకం నుంచి మరో పెద్ద ప్రయోజనం, మార్పు ఆశించవచ్చు. లాభనష్టాలు, అమ్మకాల సంగతి అటుంచితే తమ కార్టూన్లన్నీ ఒక సంకలనంగా చూసుకోవాలనే ఆశ ప్రతి కార్టూనిస్టులోనూ ఉంటుంది. దారి తెలియకో, ఖర్చుకి వెనుకాడో ఆ ఆశ అలాగే మిగిలిపోతుంది. ఇద్దరు సీనియర్ కార్టూనిస్టులు కలిసి చేసిన మంచి ఆలోచన మరింత మంది కార్టూనిస్టులకు స్ఫూర్తినిచ్చి, ఇద్దరు ముగ్గురు చొప్పున కలిసి ఒక కార్టూన్ సంకలనంగా ప్రచురించే సరి కొత్త సంప్రదాయానికి ఈ ఫేస్ బుక్ కార్టూన్ల పుస్తకం దారి చూపింది. ఒక కార్టూనిస్టు స్థాపించిన, మరొక కార్టూనిస్టు సంపాదకత్వం వహిస్తున్న, అత్యధిక మంది కార్టూనిస్టులను ప్రోత్సహిస్తున్న గోతెలుగు.కాం ఈ కార్టూన్ల సంకలనానికి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తోంది.

మరిన్ని సమీక్షలు

పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్, సఫిల్ గూడ
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
సిక్కోలు కధలు  రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
సిక్కోలు కధలు రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు