నాకు వంద కారణాలున్నాయి లఘుచిత్రం - శీను

naku 100 karanalunnaayi short flim

 చిత్రం పేరు : నాకు వంద కారణాలున్నాయి
నటీనటులు: శేషు కేసన్, శ్రీనివాస్ శీను, అచ్యుత్ మంతిన
ఎడిటింగ్: ప్రశంకర్ 
సంగీతం: సబు వర్గేష్
కథ - మాటలు - దర్శకత్వం : శేషు కేషన్

కథ: జీవితం లో తనకు వచ్చిన కష్టాలను ఎదుర్కోలేక , ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్న ఒక యువకుడి కథే ఈ లఘు చిత్రం.

జీవన్ తన జీవితం లో వచ్చిన కష్టాలను ఎదుర్కోలేక చావు ఒక్కటి తన సమస్య? పరిష్కారం అని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతాడు. ఎవరు లేని ఒక కొండ మీదకి వెళ్ళి అక్కడి నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు... ఇంతలో ఆ కొండ మీదకి ఒక వ్యక్తి రావడంతో అతనితో మాట్లాడటం మొదలుపెడతాడు. అలా వాళ్ళిద్దరి సంభాషణ జీవన్ లో తనకే తెలియకుండా తను చేస్తున్న తప్పేంటో తెలిసొచ్చేలా చేస్తుంది.

తన తప్పును తెలుసుకున్న జీవన్ ఆ అపరిచితుడిపై స్నేహ పూర్వకంగా చెయ్యి వేస్తాడు. కానీ ఆ అపరిచిత వ్యక్తి ఆత్మహత్య అని గ్రహించి అక్కడి నుండి దూరంగా పారిపోతాడు. ఈ లోపు అటుగా వస్తున్న ఇంకొక వ్యక్తి జీవన్ ను చూసి ఎందుకలా వున్నావ్ అని ప్రశ్నిస్తే .. జీవన్ జరిగిందంతా ఆ మూడో వ్యక్తికి చెప్తాడు.. ఆ  మూడో వ్యక్తి చెప్పిన మాటలకు జీవన్ పశ్చాత్తాపానికి గురవుతాడు.. అసలు ఆ మూడో వ్యక్తి ఏం చెప్పాడు . మారిపోయిన జీవన్ ఎందుకు పశ్చాత్తాప పడ్డాడు.. ఇవి లఘు చిత్రం చూసి ,మీరే తెలుసుకోండి..

నటీనటుల నటన: ఆత్మహత్య చేసుకునే కుర్రాడిగా, తర్వాత పశ్చాత్తాప పడి భాధపడే పాత్రలో శేషు తన పాత్రకు న్యాయం చేసాడు..
శ్రీనివాస్ శీను, అచ్యుత్ లు వారి వారి పాత్రలకి న్యాయం చేసారు.

* సినిమాటోగ్రఫీ బాగుంది.

*సంగీతం పర్వాలేదనిపించింది.

దర్శకత్వం: కథ, మాటలు, దర్శకత్వం, నటన ఇలా ఇన్ని బాధ్యతలు నిర్వర్తించడం అంత సులువేమీ కాదు. కాని శేషు కేసన్ అన్ని విభాగాల్లోనూ న్యాయం చేశాడు... మొదటి లఘు చిత్రం కాబట్టి కొన్ని కొన్ని చిన్న తప్పులు జరగడం సహజమే అనుకోండి. 

చివరగా: ఒక (రెండు, మూడు) నిముషాలు    ఓపిక పడితే హాయిగా నవ్విస్తూ చక్కని సందేశాన్నిచ్చే మంచి లఘు చిత్రం 
నాకు 100 కారణాలున్నాయి.

మరిన్ని సమీక్షలు

పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్, సఫిల్ గూడ
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
సిక్కోలు కధలు  రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
సిక్కోలు కధలు రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు