చిత్రం: గాంధారి
నటీనటులు: బేబి కృష్ణ, రమా దేవి, రాధాకృష్ణ, రోజా భారతి, రాజశేఖర్ అనిగి, రమణి, ప్రవల్లిక రెడ్డి, హేమంత్
సంగీతం: జాన్ కందుల
డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సురేష్ జి. శెట్టి
నిర్మాత: రాధ కృష్ణ
దర్శకత్వం: రవీంద్ర పుల్లె
కథ: ఆడవవాళ్ళు తన జీవితం లో పుట్టినప్పటి నుంచి మొదలు చనిపోయే వరకు వాళ్ళ బాధకు మరియు ఏడవడానికి కారణం ఏదో విధంగా మగవారే కారణం అంటూ ఏ వయసులో వాళ్ళు ఏం కష్టపడ్డారో వాటిని ఎంత సమర్ధవంతం గా ఎదిరించారో (లేక) కాంప్రమైజ్ అయ్యారో తెలుసుకోవాలంటే గాంధారి లింక్ మీద క్లిక్ చేయండి.
విశ్లేషణ : గాంధారి అని టైటిల్ గురించి చెప్పుకోవాలి మొదట మనము. మహాభారతం లో కౌరవులను 100 మందికి జన్మనిచ్చిన తల్లి. ఆమె పేరును టైటిల్ గా పెట్టి అంత మంది మగవారికి జన్మనిచ్చింది ఒక ఆడది అని చెప్పకనే చెప్పారు. అలాంటి ఆడవాళ్ళు కళ్ళ నుండి నీరు చిందించడానికి కారణం చిన్నప్పుడు తనతో పాటు పెరిగే వ్యక్తి , ఒక వయసు వచ్చాక . తన గురించి అన్నీ తెలిసిన వ్యక్తి, పెళ్ళయ్యాక జీవిత భాగస్వామి తరువాత తన గురించి ఆలోచించవలిసిన వ్యక్తి ఎలా ప్రవర్తించారో చాలా బాగా వర్ణించారు.
ఇకపోతే ఇందులో నటించిన నటీనటులు అందరికీ తెలిసిన సీనియర్ ఆర్టిస్ట్ తెర మీద కనిపించింది. చాలా తక్కువ సమయం అయిన బాగా నటించారు.
సాంకేతిక వర్గం : మన దర్శకుడు తన అనుకున్న ఒక లైన్ ను చాలా బాగా తెరకెక్కించాడు. చాలా సింపుల్ గా అందరికీ అర్ధమయ్యే విధంగా చూడటానికి విజువల్స్ చాలా చక్కగా బాగున్నాయి. ఇంకా సంగీతం సీన్ బట్టి చాలా బాగుంది. వినటానికి ఒక పాట బాగుంది. ఎడిటింగ్ చాలా బాగుంది.
చివరగా: గాంధారి నేటి సమాజం లో ఆడవాళ్ళ మనోవేదన
.