మధురం లఘు చిత్రం సమీక్ష - ప్రతాప్ రూపినేని

చిత్రం : మధురం
నటీనటులు: కాఫీకప్పు, కళ్ళజోడు, వైష్ణవి, రవితేజ, చాందినీ చౌదరి, ఫణీంద్ర, ధరణి.
చాయాగ్రహణం : ప్రవీణ్ వనమాలి, శరత్ రెడ్డి
కథ, కథనం, కూర్పు,కళ, మాటలు, దర్శకత్వం : ఫణీంద్ర వెర్సెట్టి

ఈ కథను మనం రెండు లేక మూడు భాగాలుగా విభజించి చెప్పుకోవచ్చు.
కథ 1) పూర్వకాలంలో ఇంద్రుడి పెళ్ళికి బ్రహ్మ ఒక పాత్ర బహుమతిగా ఇచ్చి, రెండు షరతులు పెడతాడు. మొదటిది ఆ బహుమతి ఎవ్వరూ తాక కూడదు. రెండవది ఆ బహుమతి విషయం ఎవ్వరికీ తెలియ కూడదు. ఈ రెండు షరతులకు ఇంద్రుడు కట్టుబడి ఉన్నాడా, లేకా ఆ బహుమానాన్ని ఇంద్రుడికి తెలీకుండా ఎవరైనా తాకారా?

కథ 2)ఒక కాఫీ షాప్ లో ఒక కాఫీ కప్పు... మన కథలో హీరో కూడా. ఆ కాఫీ కప్పు పేరు " రజనీకాంత్ " ఆ పేరు తనకి తానే పెట్టుకుంది. ఆ కాఫీ షాపుకి రోజుకి ఎంతోమంది వస్తూంటారు. అందులో కొంత మంది దగ్గరకు అప్పుడప్పుడు మన రజనీకాంత్ వెళ్తూంటాడు. ఒకరు రజనీకాంత్ ని సంతోష పెడతారు,మరి కొంత మంది బాధ పెడ్తారు. ఇలా రక రకాల పరిస్థితుల్లో ఎన్నో ప్రేమ కథలు కూడా ఉంటాయి. అలాంటి ప్రేమ కథల్లో మన రజనీకాంత్ కి నచ్చిన ప్రేమ కథ తనకి ఫ్రెండ్ అయిన కళ్ళ జోడు చెబుతుంది. ఆ ప్రేమ కథ ఏంటి? అది ఎలా మొదలైంది? ఆ ప్రేమ కథలో వారు ప్రేమని గెలుపొందారా?? లేక వారి జీవితాలను ఎలా కొనసాగించారు? అని తెలుసుకోవాలంటే మన మధురం లఘు చిత్రం చూడాల్సిందే. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. మన రజనీకాంత్ కి కూడా ఒక ప్రేమ కథ ఉంది. అది ఎవరితో? ఆ ప్రేమ కథలో రజనీకాంత్ గెలుపొందాడా చూడాలంటే కూడా మధురం ని క్లిక్ చెయ్యాల్సిందే...

కథ 3) మన కాఫీ షాప్ యజమాని ఇంతకు ముందు తన ప్రేమలో ఓడి పోతాడు. ఆ డిప్రెషన్ లో బ్రతుకుతున్న కాఫీ షాప్ యజమానికి కొత్తగా ఒక అమ్మాయి ప్రేమ లేఖల పోస్టు కార్డులు పంపిస్తూ ఉంటుంది. ఆ పోస్ట్ కార్డులు చూసి కాఫీ షాప్ యజమాని మరో సారి ప్రేమలో పడ్డాడా? లేక ఆ పోస్ట్ కార్డులు పంపిన వారిని కనుక్కొని వారికి తగిన బుద్ధి చెప్పాడా? చూడాలంటే మధురం లింక్ మీద క్లిక్ చెయ్యాల్సిందే.

విశ్లేషణ : 
ప్రేమ అనే ఒక మంచి అనుభూతిని తీసుకొని దాన్ని 4 రకాలుగా చెప్పిన తీరు ప్రశంసనీయం. ఎప్పుడో పురాణాల్లో జరిగిన తప్పుకు నేడు కలి యుగంలో వాళ్ళు కలవడం, అది కూడా చాలా కొత్తగా తెరకెక్కించారు. తరువాత విషయానికొస్తే ఒక కాఫీ కప్పుకి రోజూ జరిగే అనుభూతులు,ఆ కాఫీ కప్పుకు నచ్చిన ప్రేమ కథ ప్రెజెంట్ చెయ్యడం కూడా చాలా బాగుంది. ఆ ప్రేమ కథ చెప్తున్న సమయంలో మన కాఫీ కప్పుకు అనుకోని సంఘటన ఎదురవడం ఆ ప్రేమ కథలో అల్లుకున్న సస్పెన్స్ బాగా మెయింటైన్ చేసాడు దర్శకుడు. ఆ తరువాత వచ్చే కాఫీ షాపు యజమాని ప్రేమ కథను చాలా సస్పెన్స్ బాగా థ్రిల్ కు గురి చేస్తుంది.

ప్లస్ పాయింట్స్ : ఈ మధురం సినిమాలో అన్నీ మధురంగా ఉన్నాయే తప్ప చేదుగా ఏమీ లేవని చెప్పొచ్చు.

సాంకేతిక వర్గం: ఈ సినిమాకి ప్రవీణ్ మరియు శరత్ రెడ్డి చాలా మంచి అవుట్ పుట్ ఇచ్చారు. మిగతా డిపార్ట్ మెంట్స్ అన్నీ ఫణీంద్ర గారే చూసుకున్నారు. ఒక చక్కని కథ, దానికి తగ్గ కథనం సరిగ్గా యాప్ట్ అయిన నటీ నటులను ఎంచుకుని వారి నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు