చిత్రం: అర్జునా.. ఫాల్గుణా...
నటీనటులు: కిరణ్ రెడ్డి, దీపక్, ప్రవీణ్ యండమూరి, అర్జున్, అర్షద్
సినిమాటోగ్రఫీ: కట్టా సంజయ్, శ్వేత యలమర్తి, రంజిత్
ఎడిటింగ్: చోటు చెర్రి
సంగీతం; జై
నిర్మాత: కార్తీక్ శబరీష్
రచన మరియు దర్శకత్వం: గిరీష్
కథ: C.Iఅయిన మౌనం ప్రసాద్ తన ప్రమోషన్స్ కోసం అర్జున్ అనే వ్యక్తిని నియమించుకుని దొంగతనం మరియు రౌడీయిజం చేసేవారిని పట్టుకోమని చెప్పి వాళ్ళని నేనే పట్టుకున్నను అని చెప్పు పబ్లిసిటీ చేసుకుంటాడు. అర్జున్ కి డబ్బు మరియు తన పరపతిని వాడుకోమని చెబుతాడు. ఇలా జరుగుతున్న తరుణంలో C.I. కి మాదక ద్రవ్యాలు అందించే వారిని పట్టుకోమని ఆర్డర్స్ వస్తాయి. ఆ కేసుని కూడా అర్జున్ కి అప్పజెప్పి , ఒక సమాచారాన్ని అందిస్తాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకుందామనేసరికి గోవర్ధన్ వచ్చి ఆ మాదక ద్రవ్యాలను అందించే వ్యక్తిని పట్టుకోవడానికి వస్తాడు. అసలు గోవర్ధన్ ఎవరు? తనకీ ఆ కేసుకు సంబంధమేమిటీ, ఆ తరువాత అర్జున్, గోవర్ధన్ ని ఎదిరించి ఆ కేసును సాధించాడా...! అసలు అర్జున్ మరియు ప్రవీణ్ యండమూరి , వాళ్ళ జీవితాలకు, వీళ్ళకు వున్న సంబంధం ఏమిటీ... తెలుసుకోవాలంటే మీరు కూడా వెంటనే యూట్యూబ్ లో అర్జునా..ఫాల్గునా.. అనే చిత్రాన్ని చూడండి.
విశ్లేషణ: మాదక ద్రవ్యాల వలన మనుషుల జీవితం, వచ్చే ప్రభావాలు ఎలా వుంటాయో ఒక చిన్న పాయింట్ మంచిగా చూపించారు. అలానే మన ఇంట్లో వున్న వ్యక్తుల జీవితం గురించి పట్టించుకోకుండా వాళ్ళని వదిలేస్తే వాళ్ళకి జరిగే పణామాలను మరియు దాని వల్ల వచ్చే ఇబ్బందులను చాలా చక్కగా తెరకెక్కిన్చారు. ఎవరి ఉద్యోగాన్ని వారే సరైన క్రమం లో నిర్వర్తిస్తే చక్కగా వుంటుంది తప్పా తప్పుడు మార్గాల వైపు ప్రయత్నిస్తే ఎప్పటికైనా ఇబ్బందులు మరియు తగిన శిక్ష పడుతుంది. అనే విషయాలు కూడా చెప్పకనే చెప్పాడు. ఇలా తను అనుకున్న కథ ఇక కొత్త కథనం తో తెరకెక్కించాడు.
ప్లస్ పాయింట్స్:
1.సినిమాటోగ్రఫీ
2.సంగీతం
3. లొకేషన్స్
4. ఎమోషన్ సీన్స్
5. డైలాగ్స్
మైనస్ పాయింట్స్:
1.కథ
2. సహజత్వం మిస్సవడం
3. ఫైట్స్
సాంకేతిక వర్గం: సినిమాటోగ్రఫీ చాలా చక్కగా వుంది. ఎడిటింగ్ మీద ఇంకొంచం శ్రద్ధ తీసుకొని వుంటే మంచిది. మ్యూజిక్ అంటే దీనిలో మనం చెప్పుకోవలిసింది. రీ రికార్డింగ్ సూపర్ గా ఇచ్చాడు అని చెప్పుకోవాలి. చివరగా కథ కొత్తగా లేకపోయిన దానికి ఒక మంచి కథనాన్ని జోడించి మంచిగా చెప్పాడు. కానీ ఇంకా మంచిగా తెరకెక్కిస్తే బాగుండు అన్న భావన కలిగింది. దర్శకత్వ విషయానికి వస్తే ఇంకా పరిణితి చెందాలి. మాటలు మాత్రం చాలా బాగున్నాయి.
చివరగా : "దుష్ట శిక్షణ- శిష్ట రక్షణ" అన్నట్టు ఎవ్వరైనా ఎక్కడైనా ఎప్పుడైనా అక్రమాలను అన్యాయాలకు పాల్పడితే అప్పు అక్కడ అర్జునా.. ఫాల్గుణా లు అవతరిస్తారు.