‘ సైలెంట్ మెలోడి’ షార్ట్ ఫిల్మ్ రివ్యూ - -సాయి సోమయాజులు

silent melody short flim review

ఇవాళ విడుదలవుతున్న ‘అ!’ చిత్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసిన లఘుచిత్రం- సైలెంట్ మెలోడి. ఈ మూకీ రొమాంటిక్ లఘుచిత్రం హీరో సందీప్ కిషన్ నిర్మించారు. ఈ షార్ట్ ఫిల్మ్ సమీక్ష... ప్రత్యేకంగా మన గోతెలుగు పాఠకుల కోసం-

కథ :

ఓ చెవిటి-మూగ అమ్మాయి తన ఇంటి ఎదురుగా ఉన్న ఓ అబ్బాయితో ప్రేమలో పడుతుంది. కాని, ఆ విషయం ఆ అబ్బాయికి తెలియదు. ‘ఒకవేళ తెలిస్తే ఏమవుతుంది?’ అన్న ఆసక్తికరమైన ఆలోచనతో అల్లిన కథ ఈ సైలెంట్ మెలోడి. 

ప్లస్ పాయింట్స్ :
ఓ మూకీ షార్ట్ ఫిల్మ్ తీయడానికి కావాల్సిన అతి ముఖ్యమన విషయాలు రెండు- కెమెరా, సంగీతం. ఈ లఘుచిత్రానికి బలాన్నిచ్చినవి కూడా ఆ రెండే! విశ్వేశ్వర్ కెమెరా వర్క్ సింపుల్ గా ఉన్నపటికీ చాలా ఫ్రెష్‍గా ఉంది. శ్రవన్ మ్యుజిక్ చాలా మెలోడియస్‍గా, వినసొంపుగా ఉంది. ఈ సినిమాలో నటించిన ప్రాచి చాలా అందంగా కనిపిస్తుంది, చక్కగానూ నటించింది. ముఖ్యంగా ఈ సినిమా చివర్లో గుర్తుండిపోయేలా కనిపిస్తుంది. కొన్ని సింబాలిక్ షాట్స్ చాలా నేర్పుతో చిత్రీకరించారు. ఈ సినిమా ద్వారా అందించిన మెసేజ్ విలువైనది.

మైనస్ పాయింట్స్ :
కొన్ని షాట్స్ లో లైటింగ్ ఇంకా బాగా ఏర్పాటుచెయ్యొచ్చు. అక్కడక్కడ కంటిన్యుటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది.

సాంకేతికంగా :
ప్రశాంత్ వర్మ, శ్రీనివాస కుమార్ల ఎడిటింగ్ బాగున్నపటికీ, అక్కడక్కడ ఇంకొంచం షార్ప్ గా ఉండొచ్చనిపిస్తుంది. స్క్రీన్ ప్లే చాలా బాగా రాశారు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‍గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా, నీట్ గా ఉంది.

మొత్తంగా చెప్పాలంటే::
బుల్లి తెరపై ‘ఆహా!’ అనిపించే సైలెంట్ మెలోడి.

రేటింగ్: 4/5

LINK : https://www.youtube.com/watch?v=XdOfxPS2n8o

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు