ఇటీవలకాలంలో ‘మాస్ మహారాజ’ రవితేజ నిర్మించిన షార్ట్ ఫిల్మ్- రియాక్ట్. సైలంట్ షార్ట్ ఫిల్మ్ అయిన ఈ సినిమాను పాపులర్ యూట్యూబ్ ఛానల్ అయిన ‘ఐడ్రీమ్ మీడియా’ ద్వారా విడుదలయి మంచి స్పందనను నమోదు చేసుకుంది. ఈ షార్ట్ ఫిల్మ్ సమీక్ష... మీ కోసం-
కథ :
ఈ కథ హైదరాబాదులో రాత్రివేళ ఓ లోకల్ బస్‍లో జరుగుతుంది. ఖాళీగా ఉన్న బస్సులో ఓ అమ్మయి, ఓ అన్న-చెల్లి, తండ్రి-కూతుళ్లు ఎక్కుతారు. తరువాతి స్టాపులో ఓ కుర్రవాళ్ళ గుంపు ఆ బస్సులోకి ఎక్కి ఆ అమ్మయిని ఏడిపించడం మొదలు పెడతారు. భయపడుతున్న ఆ అమ్మాయికి సాయం చెయ్యడానికి ఆ బస్‍లోని వారెవ్వరూ ముందుకురారు. ‘ఆ తరువాత ఏమవుతుంది?’ అన్నది తెలుసుకోవాలంటే ‘రియాక్ట్’ చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ షార్ట్ ఫిల్మ్ సమాజానికి అందించాలనుకున్న సందేశం చాలా విలువైంది. దానిని ఎక్కడా అనవసరంగా సాగదీయకుండా బాగా చూపించారు. ‘స్త్రీ రక్షణ మనందరి బాధ్యత’ అని చక్కగా దృశ్యీకరించారు. నటన పరంగా అందరూ బాగా చేశారు. ‘హీరో’ శ్రీ విష్ణు నటన చాలా బాగుంది. కెమెరా వర్క్ చాలా నీట్‍గా ఉంది. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అతి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సినిమాలోని చివరి షాట్ కు చూపించిన సింబాలిజం చాలా బాగుంది.
మైనస్ పాయుంట్స్ :
కొన్ని సీన్లు ఇంకొంచెం కన్విన్సింగా ఉండొచ్చనిపిస్తుంది. అలానే, మొత్తానికి సందేశం చెప్పినా, ఇంకొంచెం స్ట్రాంగ్‍గా ఉంటే ఇంకాస్త ఇంపాక్ట్ ఫుల్‍గా ఉండేదేమో.
సాంకేతికంగా :
చీకటిలో అందమైన షాట్స్ తియ్యడం ఛాలెంజింగ్ విషయం. కాని అప్పుడే కెమరా వర్క్ చాలా చక్కగా, అందంగా ఉంటుంది. యోగేశ్వర శర్మ మ్యూజిక్ చాలా డెప్త్ కలిగి ఉంది. ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉంది.
మొత్తంగా :
ఈ సినిమా చూసిన వారు కచ్చితంగా ‘రియక్ట్’ అవుతారు!
Link: https://www.youtube.com/watch?v=tSq8ZRJdRcI
రేటింగ్ :
3.5/5