గ్లూడ్ లఘు చిత్ర సమీక్ష - -సాయి సోమయాజులు

GLUED short flim review

డిస్నీ ప్రొడక్షన్ మంచి సినిమాలతో కొన్ని దశాబ్దాలుగా పిల్లల్ని అలరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. చాలా సార్లు వాళ్లు ఎంచుకునే సబ్జెక్ట్స్, పిల్లల్ని మాత్రమే కాకుండా, కుటుంబం మొత్తాన్ని మెప్పిస్తాయి. అలాంటి డిస్నీ ప్రెజెంట్ చేసిన షార్ట్ ఫిల్మ్- గ్లూడ్. బెజాలెల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్ లోని నలుగురు ఫైనల్ ఇయర్ యానిమేషన్ విద్యార్థులు తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ సమీక్ష... కేవలం మీ కోసం-

 

కథ :

వీడియో గేమ్స్ కి అడిక్ట్ అయిన ఓ పిల్లాడి తల్లి, తన కొడుకు ఇరవై నాలుగు గంటలు ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడకుండా, బయటకి వెళ్లి ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఫిజికల్ గేమ్స్ ఆడాలని కోరుకుంటుంది. ఆమె ప్రయత్నం ఫలించిందో, లేదో తెలియాలంటే, మీరు తప్పక ‘గ్లూడ్’ చూడాల్సిందే!

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా యానిమేటడ్ మూవీ అవడంతో ముందు మనం పిల్లల సినిమాగా ఊహిస్తాం. కాని, ఈ సినిమా పిల్లల్ని ఎంతగా అయితే అలరిస్తుందో, పెద్దల్ని కూడా అంతే అలరిస్తుందని చెప్పొచ్చు. 3డి యానిమేషన్ చాలా అద్భుతంగా చేశారు. షాట్స్ ని చాలా సినిమాటిక్ గా డిజైన్ చేశారు. మీరు గనక ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్, స్టోరీ బోర్డింగ్, కలర్ స్క్రిప్ట్, 3D స్ట్రక్చర్స్ గురించి మరింత తెలుసుకోవాలంటే, గ్లూడ్ అఫీషియల్ బ్లాగ్‍స్పాట్- ‘http://gluedmovie.blogspot.in/’ కి లాగ్ ఇన్ అయ్యి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సినిమా కథను ఈ కాలం పిల్లలు, తల్లిదండ్రులు బాగా అనుభూతిస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మెయిన్ థీమ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా, గ్లూడ్ సెటైరికల్‍గా అందించే సందేశంలో చాలా అర్థం ఉంది.

 

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో కనబడే పిల్లాడి తల్లి క్యారెక్టర్‍ని ఇంకొంచెం బాగా డెవలప్ చేసి ఉండచ్చు.

 

సాంకేతికంగా :

గయ్, డానియల్, అలాన్ మరియూ సివన్ దర్శకత్వ ప్రతిభ బాగుంది. అస్సాఫ్ ష్లామి మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్. యానిమేషన్ చాలా బాగా డెజైన్ చేశారు. సౌండ్ కూడా చాలా యాప్ట్ గా ఉంటుంది.

 

మొత్తంగా :

మీరు కచ్చితంగా ‘గ్లూ’ అవుతారు!

 

అంకెలలో :

4.0/5

https://www.youtube.com/watch?v=rW2g5cwxrqQ

 

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు