ప్రేమికుడు లఘుచిత్ర సమీక్ష - -సాయి సోమయాజులు

premikudu short flim review

కమెడియన్ కం కేరక్టర్ ఆర్టిస్ట్ అయిన ఎల్.బి.శ్రీ రామ్ గారు యూట్యూబ్ లో తమ షార్ట్ ఫిల్మ్స్ తో ‘సెకండ్ ఇన్నింగ్స్’ ప్రారంభించారు. సమాజానికి ఉపయోగపడేలా సందేశాత్మకమైన షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఆయన షార్ట్ ఫిల్మ్స్ బ్యానర్ అయిన ‘ఎల్.బి.శ్రీ రామ్ హార్ట్స్’ లో విడుదలైన ‘ప్రేమికుడు’ లఘు చిత్ర సమీక్ష, మీ కోసం-

కథ :

ఓ ప్రేమికుల జంట వ్యాలంటైన్స్ డే న పార్క్ లో గొడవపడతారు. అదే పార్క్ లోని మరో వృద్ధ ప్రేమికుల జంట, వీళ్ళని ఎలా కలుపుతారు అన్నదే ఈ ‘ప్రేమికుడు’ చిత్రం.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలోని సందేశం చాలా ఉదాత్తమైంది. ఎల్.బి.శ్రీ రామ్ గారి నటన గురించి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. ఈ మొత్తం సినిమాలో అతి పెద్ద ప్లస్ పాయింట్ ఎల్.బి.శ్రీ రామ్ గారే! మ్యూజిక్ పర్లేదు. హిందూ వివాహ వ్యవస్థ గురించి చెప్పే మాటలు చిత్రంలో బెస్ట్ పార్ట్ అని చెప్పచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఎల్.బి.శ్రీ రామ్ గారు తప్ప మిగతా నటీ నటులందరూ బలహీనంగా కనిపిస్తారు. నటీ నటుల స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా పూర్ గా ఉంటుంది. ఈ సినిమాలో ‘సోడాబుడ్డి’ పాత్ర అనవసరమైనది. డైలాగ్స్ వీక్ గా రాశారు. డబ్బింగ్ మ్యాచ్ కాలేదు. షాట్స్ కూడా చాలా ప్లేయిన్‍గా తీసారు. ‘కంటిన్యూటి’ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకా చాలా షార్ప్ గా ఉండాల్సింది. ఆర్ట్ డైరెక్షన్ పెద్ద మైనస్. హాస్పటల్ సెట్ స్పష్టంగా ఇంట్లో వేసినట్టుగా కనపడిపోతూ ఉంటుంది. కథ బాగున్నప్పటికీ, మణి రత్నం తీసిన ‘ఓ.కె. బంగారం’ కథకి చాలా దగ్గరగా ఉంటుంది. సబ్‍టైటిల్స్ లో గ్రామర్ మిస్టేక్స్ చాలానే ఉన్నాయి.

సాంకేతికంగా :

కథ కొత్తగా లేనప్పుడు సాంకేతికత చాలా ధృడం గా ఉండాలి, కాని ఈ సినిమాలోని ఎడిటింగ్, ఆర్ట్, సౌండ్ మిక్సింగ్, డబ్బింగ్, కెమెరా, మ్యూజిక్.... అన్నీ అంతంత మాత్రమేనని చెప్పుకోవచ్చు.

మొత్తంగా :

ఎల్.బీ.శ్రీ రామ్ గారిని ప్రేమించేవారు మాత్రమే ఈ ‘ప్రేమికుడి’ని ప్రేమిస్తారు. మిగతా వారు ఓసారి చూడొచ్చు!

అంకెల్లో :
3/5

LINK :
https://www.youtube.com/watch?v=K46EZk1ddzE

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు