‘ ఆలోలం’ షార్ట్ ఫిల్మ్ రివ్యూ - సాయి సోమయాజులు

aalolam short flim review

రియలిస్టిక్ కథలని డ్రామటైజ్ చేసే షార్ట్ ఫిల్మ్స్ చాలా అరుదుగా వస్తాయి. అలాంటి ఓ నిజమైన కథని బేస్ చేసుకుని తీసిన సినిమానే ఈ- ఆలోలం. ‘డ్రింకింగ్ క్లౌడ్ ఎంటర్టైన్మెంట్’ పతాకంపై, గోతెలుగు ద్వారా విడుదలైన ఈ చిత్రం సమీక్ష, మీ కోసం-  

కథ:
కష్టపడి పనిచేసే ఓ ఇంజనీర్ ప్రొమోషన్ దక్కనప్పుడు పడే వేదన..దాని ప్రభావం తనని ప్రేమించే వాళ్ళ మీద ఎలా పడుతుంది అన్నదే ఈ కథ!

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ కథనం అనే చెప్పుకోవాలి. ఒక్క లైన్ కథని, ఇరవై నిమిషాల నిడివితో తీసినా, ఒక్క సారి కూడా బోర్ అనిపించని విధంగా రాశారు స్క్రీన్‍ప్లే. ఈ షార్ట్ ఫిల్మ్స్ లో అద్భుతమైన కెమెరా వర్క్ ను మనం అనుభూతిస్తాం, ఇది ఓ గొప్ప చిత్రరాజం అని చెప్పొచ్చు. ప్రొఫెషనల్ లైటింగ్ టెక్నిక్స్, మాస్టర్‍క్లాస్ కెమెరా వర్క్ ఈ సినిమాని మరో మెట్టు ఎక్కిస్తాయి. ఎడిటింగ్, సినిమా మొత్తానికి ఫీచర్ ఫిల్మ్ లుక్ తెప్పించడానికి ఎంతో ఉపయోగపడింది. ఇటీవల వచ్చిన లఘు చిత్రాలలో ది బెస్ట్ ఎడిటింగ్ ‘ఆలోలం’ అని చెప్పుకోవడం అతిశయోక్తి కాదు. లెజెండరి ‘బాంబే జయశ్రీ’ గారి ‘ఆలోలం’ ట్రాక్‍ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍గా పర్ఫెక్ట్. కొన్ని డైలాగ్ లూ రాశారు, మెటాఫర్‍లు చాలా బాగా చూపించారు. నటన పరంగా అందరూ అద్భుతం. ముఖ్యంగా వినయ్ అందరికంటే బాగా చేసాడు. మన మార్కులు ఎక్కువేయించుకుంటాడు. ఈ సినిమాలో చూపించిన ‘ఫ్రస్టేషన్’ బయట ఎంతోమంది ఇంజనీర్ల అనుభవమే!
ప్రొడక్షన్ వాల్యూ స్క్రీన్‍పై చాలా రిచ్‍గా కనిపిస్తుంది.

మైనస్ పాయుంట్స్ :
ఈ సినిమాలో ‘అథితి’ పాత్ర లుక్ న్యాచురల్‍గా ఉన్నపటికీ, తను ఇంకొంచెం బాగా నటించొచ్చనిపిస్తుంది. ఈ సినిమా మూడ్, లుక్, కాన్సెప్ట్, థీమ్, ఇటీవల విడుదలై సంచలనమైన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’కి చాలా దగ్గరగా ఉంటుంది.  కథనం బాగున్నప్పటికీ, కథలోని కాన్ఫ్లిక్ట్ లో డెప్త్ లేకపోవడం ఒక మైనస్ పాయింటే. అలానే, డ్రామా వాల్యూ చాలా తక్కువగా కనిపిస్తుంది, కోపాన్ని, ఫ్రస్టేషన్‍ని, దాని ప్రభావాన్నీ, ఇంకా చాలా బాగా చూపించుండొచ్చు.

సాంకేతికంగా :
ఇప్పటిదాకా వచ్చిన వాటిలో ఈ సినిమా సాంకేతికంగా చాలా ముందుంటుంది. ఇంతకు ముందే చెప్పినట్టు, ఈ సినిమాలోని కెమెరా వర్క్, ఎడిటింగ్, లైటింగ్, టాప్ క్లాస్ అనే చెప్పుకోవాలి! స్క్రీన్ ప్లే చాలా బాగా మనసుకు హత్తుకునేట్టు రాశారు. ఆర్ట్ డైరెక్షన్ ప్రతి ఫ్రేమ్‍ను చాలా రిచ్‍గా మారుస్తుంది. మేకప్, కాస్ట్యూమ్స్ అన్నీ బాగా డిజైన్ చేసారు.

మొత్తంగా :
‘ఆలోలం’, ఓ అందమైన ఫ్రస్టేటెడ్ ఇంజనీర్ కథ. చూసేయండి!

అంకెలలో-
3.75 / 5

LINK-
https://www.youtube.com/watch?v=_u4RJUM_DOA

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు