కమెడియన్ కం కేరక్టర్ ఆర్టిస్ట్ అయిన ఎల్.బి.శ్రీ రామ్ గారు యూట్యూబ్ లో తమ షార్ట్ ఫిల్మ్స్ తో ‘సెకండ్ ఇన్నింగ్స్’ ప్రారంభించిన విషయం మనకి తెలిసిందే. సమాజానికి ఉపయోగపడేలా సందేశాత్మకమైన షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఆయన షార్ట్ ఫిల్మ్స్ బ్యానర్ అయిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ క్రియేషన్స్’ / ‘ఎల్.బి.శ్రీ రామ్ హార్ట్స్’ లో విడుదలైన ‘ఏ పేరుతో పిలిచినా...’ లఘు చిత్ర సమీక్ష, మీ కోసం-
కథ:
ఓ ముసలాయన తన మనవడితో గుడికి వెళతాడు. చిన్న పిల్లాడయిన ఆ మనవడు గుడిలో తన తాత చేసే ప్రతి పనిని చూస్తూ, అమాయకంగా ప్రశ్నిస్తూ ఉంటాడు. దానికి తాతగారు ఏం బదులిస్తారన్నదే ఈ కథ!
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి ఇటీవలి కాలంలో ఎల్.బీ.శ్రీ రాం గారు తీసిన లఘు చిత్రాలలో చాలా ప్రత్యేకమైన చిత్రం అని చెప్పుకోవచ్చు. కథ పెద్దగా లేకపోయినా, పదకొండు నిమిషాల నిడివి ఉన్నప్పటికి, ఫీల్ గుడ్ సినిమాగా సాగిపోడానికి ముఖ్య కారణం- ఈ సినిమా ద్వారా మనం గుడి గురించి, హిందు సంప్రదాయం గురించి ఎన్నో అంశాలు తెలుసుకుంటాం. ‘ధ్వజ స్తంభం ఎందుకు?’, ‘గుడిలో గంట ఎందుకు కొట్టాలి?’, ‘ప్రదక్షిణలు మూడు సార్లు ఎందుకు చెయ్యాలి?’, ఇలాంటి ప్రశ్నలకి జవాబు మనకి తెలియకపోయినా, మనం గుడ్డిగా గుడికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుని, యాంత్రికంగా చేసి వచ్చేస్తూ ఉంటాం. ఈ సినిమా ద్వారా, గుడిలో మనం చేసే ప్రతి చిన్న పని వెనుక ఓ కారణం ఉంటుందని తెలుసుకుంటాం. ఎల్.బీ.శ్రీ రాం గారి నటన చాలా అద్భుతంగా ఉంది. ఎల్.బి. గారితో పోటీగా చేసాడు మాస్టర్ భార్గవ్. చిన్న పిల్లాడైనప్పటికి, సంప్రదాయం ఉట్టిపడేట్టు కనబడుతూనే, అమాయకమైన ప్రశ్నలు వేస్తూ, చాలా చక్కగా నటించాడు. చాలా షాట్స్ లో లైటింగ్ చాలా బాగా అమర్చారు. వార్మ్ టోన్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ సినిమా ద్వారా అందించిన సోషల్ మెసేజ్ చాలా విలువైనది. ఈ సినిమాల ద్వారా, హిందు సంప్రదాయం గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే అవకాశం కలుగుతుంది.
మైనస్ పాయింట్స్ :
లైటింగ్/టోన్ బాగున్నపటికీ, కొన్ని సార్లు ఒక్కసారిగా బ్రేక్ చేసినందువలన ప్రేక్షకులకు జర్క్ అనిపిస్తుంది. వెనకాల నడిచే భక్తిపూర్వమైన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ చాలా వరకు సెట్ అయినా, కొన్ని సార్లు ఇంకొంచెం ఎడిటింగ్‍లో మ్యానేజ్ చెయ్యొచ్చనిపిస్తుంది. ఓ షాట్‍లో కనపడే ముసలవ్వ కెమెరా వంకా చూస్తూ కనిపిస్తుంది. హారతి సీన్‍లో కెమెరా పక్కనుండి కూడా ఓ చెయ్యి రావడం సిల్లీగా అనిపిస్తుంది.
సాంకేతికంగా :
కొద్ది షాట్స్ ను, కొన్ని లైటింగ్ అరెంజ్‍మెంట్స్ ను లెక్కించకపోతే, కెమెరా వర్క్ నీట్‍గా ఉంటుందనే చెప్పుకోవాలి. ఎడిటింగ్‍లో కొన్ని షాట్స్ ను, సౌండ్ ను, మ్యానేజ్ చెయ్యచనిపిస్తుంది. అయినప్పటికి, పర్లేదు! సబ్‍టైటిల్స్ ద్వారా చాలా చక్కగా ఆంగ్లంలో అనువదించారు.
మొత్తంగా :
ఈ సినిమా చూస్తున్నంత సేపు, గుడి ప్రాంగణంలో ఉన్నటే అనిపించడం కచ్చితం!
అంకెలలో-
3.75 / 5
LINK-
https://www.youtube.com/watch?v=IvFDKtbfE-M