‘ వావ్...! ’ షార్ట్ ఫిల్మ్ రివ్యూ - -సాయి సోమయాజులు

wow short flim review

షార్ట్ ఫిల్మ్స్ అనగానే ఎక్కువగా మనం చూసేది లవ్ స్టోరీస్, కామెడీస్. చాలా అరుదుగా మనం ఓ కొత్త బ్యాక్‍డ్రాప్‍తో వచ్చే మంచి తెలుగు షార్ట్ ఫిల్మ్స్ ని చూస్తూ ఉంటాము. అలాంటి ఓ సినిమానే ఈ ‘వావ్...!’. ఒక ఆఫీస్‍లో జరిగే ఈ కథ, సమాజానికి చాలా మంచి సందేశాన్ని అందిస్తుంది. ‘క్రియేటివ్ టీమ్ ఫిల్మ్స్’ బ్యానర్‍లో విడుదలైన ఈ లఘుచిత్ర సమీక్ష... మీ కోసం-

కథ:

DEC 31st. వైజాగ్‍లోని ఓ కంపేని బాస్, ఆ ఆఫీస్‍లోని అన్ని డిపార్ట్మెంట్స్ ని తమ-తమ టార్గెట్లను డెడ్‍లైన్‍కి ముందు కంప్లీట్‍ చెయమని ప్రెజరైజ్ చేస్తూ ఉంటాడు. న్యూ ఇయర్, అంటే, రాత్రి పన్నెండు అయ్యే లోపల ఆ ఆఫీస్‍లోని ఎంప్లాయిస్ టార్గెట్‍ని ఎలా ఫినిష్ చేస్తారన్నదే ఈ కథ!

ప్లస్ పాయింట్స్ :

చాలా తక్కువ సార్లు మనం ఓ షార్ట్ ఫిల్మ్ కి ఇంట్రెస్టింగ్ ప్రెమిస్ ఉండడం చూస్తూ ఉంటాము. ‘వావ్!’ కథ మొత్తం ఓ ఆఫీస్ బాక్‍డ్రాప్‍లో సాగడం వల్ల చాలా కొత్త లుక్ వస్తుంది. కథ కూడా చాలా బాగా రాశారు. పాత్రలు కూడా చాలా బాగా డిజైన్ చేసారు. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అతి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫ్లర్టీ సీన్స్ ను బాగా ఎలివేట్ చేసి మంచి ఫన్ మూడ్‍ను జెనరేట్ చేస్తుంది. ఈ సినిమా ద్వారా అందించిన సందేశం చాలా ముఖ్యమైనది.

మైనస్ పాయుంట్స్ :

కొన్ని పాత్రలు, నటన వీక్‍గా కనిపిస్తాయి. డైలాగ్ డెలివరీ ఇంకా బాగుండొచ్చు. న్యూ ఇయర్ కౌంట్‍డౌన్ కోసం వాడిన స్టాక్ ఫూటేజ్ వాటర్మార్క్డ్ అవ్వడంతో కొంచెం అమెచ్యుర్ లుక్ వస్తుంది. కథ చాలా బాగున్నపటికి కథనం చాలా స్లోగా సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలోని ఓ సీన్‍లో అన్ని పాత్రలు ఒకటి రియలైజ్ అవుతారు, కాని, దానియొక్క మోటివేషన్‍ను జస్టిఫై చెయ్యనందువల్ల చాలా ర్యాండమ్‍గా అనిపిస్తుంది.  అలానే, ‘అసలు డెడ్‍లైన్ వరకు ప్రాజెక్ట్ ఎందుకనొచ్చింది? ఎంప్లాయిల ఆలస్యం వల్లా? లేదా ఆ ప్రాజెక్ట్ కి దొరకడమే తక్కువ టైం స్పాన్‍ దొరికిందా?’ అన్న విషయాన్ని కూడా జస్టిఫై చెయ్యలేదు. ఇరవై నిమిషాల నిడివి అతి పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ‘వావ్..!’ అన్న టైటిల్ యాప్ట్ గా అనిపించదు.

సాంకేతికంగా :

డబ్బింగ్ పట్ల ఇంకొంచెం శ్రద్ద వహించుండొచ్చు. ఎడిటింగ్ కొంచెం వీక్ అనే చెప్పుకోవాలి.. ఇదే సినిమా ఓ పది నిమిషాలలో ముగించుంటే వేరే లెవెల్‍లో ఉండేది. లైటింగ్.. టోన్.. చాలా షాట్స్ లో మిస్‍మ్యాచ్ అవుతుంది. కెమెరా వర్క్ చాలా సాదాగా ఉంటుంది. డైరెక్షన్ యావరేజ్‍గా ఉన్నప్పటికి, ఓ మంచి సినిమా తీయలన్న హానెస్టీ కనబడుతూ ఉంటుంది.

మొత్తంగా :

‘వావ్!’ అనిపించే కథ కోసం ఓ సారి చూసేయండి.

అంకెలలో-

3.5/5

LINK-
https://www.youtube.com/watch?v=ejMtaCtTSNM&feature=youtu.be

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు