‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన ‘గెటప్’ శ్రీను నటించిన లఘుచిత్రం- ‘7:30 AM'. పాపులర్ యూట్యూబ్ ఛానల్ అయిన ‘తెలుగువన్’ ద్వారా విడుదలైన ఈ హారర్ చిత్రం సమీక్ష, మన గోతెలుగు పాఠకులకోసం-
కథ:
ఓ బిల్డింగ్‍లో దెయ్యం ఉంటోందని, అది పొద్దున్న 7:30 తర్వత ఆ ఇంట్లో ఉన్నవాళ్లని పీడిస్తుందని, అంతకముందే ఇద్దరు ఆ ఇంట్లో ఉండలేక పారిపోయారని తెలిసినా కూడా, అవేవీ పట్టించుకోకపోవడమే కాకుండా, పొద్దున్న 7:30 కి లేచి అంతా ఒక బూటకమని నిరూపిస్తానని తన అన్నయ్యతో ఛాలెంజ్ చేస్తాడు శ్రీను. ఆ తర్వాత ఏమైందన్నదే ఈ కథ!
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ శ్రీను నటన అనే చెప్పుకోవాలి. బుల్లి తెరపై నవ్వించడమే కాదు.. ఓ సీరియస్ పాత్రలో లీనమై జనాలని మెప్పించాడు శ్రీను. సౌండ్ క్వాలిటీ, డిజైనింగ్ చాలా ప్రొఫెషనల్‍గా ఉంటుంది. ఈ సినిమాయొక్క థీమ్ చాలా కొత్తగా ఉండడంవల్ల ఆకట్టుకుంటుంది. కొన్ని హారర్ ఎఫెక్ట్స్ బావున్నాయి. ఓపెనింగ్ టైటిల్స్ చాలా బాగా చూపించారు. ‘టైం-లూప్’ కాన్సెప్ట్ ని చాలా క్రియేటివ్‍గా వాడుకున్నారు.
మైనస్ పాయుంట్స్ :
‘గెటప్’ శ్రీను అనగానే మనకి గుర్తొచ్చేది కామెడి, అందుకని, శ్రీను నటించిన చిత్రం అవ్వడం వలన కామడీని ఎక్స్పెక్ట్ చెయ్యడం సహజం. కాని, కొంచెం కూడా కామెడీ లేని ఓ సీరియస్ మూవీ కొంత మంది ఆడియన్స్ ని నిరాశ పర్చొచ్చు. దెయ్యం మేకప్ చాలా సిల్లీగా, ఆర్టిఫీషియల్‍గా అనిపిస్తుంది. హారర్ మూవీ అయినప్పటికీ, ఒక్క సెకండ్ కూడా ఈ సినిమా భయపెట్టలేకపోవడం డ్రాబ్యాక్. ఈ సినిమా కథ పొద్దున్న సమయంలో కాకుండా, రాత్రి టైంలో జరిగి ఉంటే, ఇంకొంచెం భయం-భయంగా అనిపించే ఛాన్స్ ఉంటుంది. ఫ్లాష్‍బ్యాక్ ఎపిసోడ్ ఇంకా ఎమోషనల్‍గా తీసుండచ్చు. ఓ సీన్‍లో వాడిన యానిమేటెడ్ క్లాక్ చాలా కిడ్డిష్‍గా కనిపిస్తుంది.
సాంకేతికంగా :
ఎడిటింగ్ చాలా బాగా చేశారు. ఓ రెండు మూడు సీన్స్ ను లెక్కించకపోతే, మిగతా డబ్బింగ్ అంతా చాలా బాగుంది. మేకప్ చాలా పూర్. సినిమాటోగ్రఫి, లైటింగ్ సెటప్ చాలా ప్రొఫెషనల్ లుక్‍ను తీసుకొచ్చింది. వీ.ఎఫ్.ఎక్స్ కూడా బాగా వాడారు.. ముఖ్యంగా, ఓపెనింగ్ టైటిల్స్ లో బంగ్లా యానిమేషన్ చాలా మంచి స్టార్ట్ ను ఇస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‍గా కనిపిస్తాయి. కథ మాత్రం అస్సలు కొత్తగా అనిపించదు. దర్శకత్వం యావరేజ్.
మొత్తంగా :
‘గెటప్’ శ్రీను ఉన్నాడని కామెడిని మాత్రం ఆశించకండి...జస్ట్ టైం పాస్ కోసం చూడండి!
అంకెలలో:
2.75/5
LINK-
https://www.youtube.com/watch?v=nm8l8wwFM7I