‘ ముబారక్ ’ షార్ట్ ఫిల్మ్ రివ్యూ - -సాయి సోమయాజులు

mubharak short  flim review

ముస్లిమ్ సోదరుల రంజాన్ నెల నిన్నటితో ప్రపంచవ్యాప్తంగా ముగిసిందన్న విషయం మనందరికీ తెలిసిందే! అయితే, ఈ సీజన్‍కి సంబందించి విడుదలైన లేటెస్ట్ షార్ట్ ఫిల్మ్ ‘ముబారక్’. ఈ చిత్ర సమీక్ష మీ కోసం-

కథ:
ఒక కాలనీలో ఉండే ఒక ముస్లిం బ్యాచలర్ రంజాన్ నెలలో తిండికి ఇబ్బంది పడుతూ ఉండగా, అదే కాలనీలోని తన స్నేహితుడైన ఒక హిందు తనకి ఎలా సహాయం చేసాడన్నదే ఈ కథ...

ప్లస్ పాయింట్స్:
ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుంటే అన్నిటికంటే ముందుగా అభినందించాల్సింది ఈ సినిమా ద్వారా అందరికీ అందించిన సందేశం అనే చెప్పుకోవచ్చు. హిందూ ముస్లిమ్స్ అందరూ ఐకమత్యంగా కలిసి ఉండాలని చూపించిన విధానం చాలా చక్కగా, అందంగా ఉంటుంది. ఐదు నిమిషాల నిడివి ఉండడం వలన ఈ సినిమా చెప్పాలనుకున్న పాయింట్ స్ట్రేయిట్‍గా టైం వేస్ట్ చెయ్యకుండ చెప్పేస్తుంది. ఈ మూవీ లుక్ చాలా సింపుల్‍గా ఉన్నప్పటికీ రిచ్‍గా కనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్:
డైలాగ్స్ ఇంకొంచెం టచ్చింగ్‍గా ఉంటే బాగుండేది. సినిమా చిన్నదైనప్పటికీ, కథలో ముందు ఏం జరగబోతోందో ఊహించేయొచ్చు. పర్ఫార్మెన్స్ కొంచెం వీక్ అనే చెప్పుకోవాలి. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ మంచి పేట్రియాటిక్ టచ్ ఉన్నది వాడి ఉండాల్సింది.  

సాంకేతికంగా:
కెమెరా వర్క్ చాలా నీట్‍గా ఉంది. ఎడిటింగ్ పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్లేదు అనిపిస్తుంది. ఫారూక్ రాయ్ డైరెక్షన్ పర్లేదు.

మొత్తంగా:
ముబారాక్ టీంకి ముబారక్!

అంకెలలో:
3/5

Link: https://youtu.be/2iHO4Qi7OE8

మరిన్ని సమీక్షలు

పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్, సఫిల్ గూడ
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
సిక్కోలు కధలు  రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
సిక్కోలు కధలు రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు