అవసరానికో అబద్ధం లఘు చిత్ర సమీక్ష - - సాయి సోమయాజులు

avasaraaniko abaddam short flim review

యూట్యూబ్‍ ద్వారా ఎంతో మంది తన ట్యాలెంట్‍ని చూపించుకుంటున్నారు. ప్రతి వారం లెక్కలేనన్ని షార్ట్ ఫిల్మ్స్ విడుదలవుతూ ఉంటుంది. అలానే, సంపత్ నంది దర్శకత్వం వహించిన ‘గౌతంనంద’ చిత్రాన్ని ఇన్స్పిరేషన్‍గా తీసుకుని తీసిన లఘు చిత్రం- ‘అవసారినికో అబద్ధం’. ఈ చిత్ర సమీక్ష మీకోసం-

కథ-
ముగ్గురు స్నేహితులు ఒకళ్ళనొకళ్ని తన స్వార్థానికి ఎలా వాడుకుంటారన్నదే ఈ కథ.

ప్లస్ పాయింట్స్-
అసలు ప్లస్ పాయింట్స్ లేని లఘు చిత్రాలు రావడం చాలా అరుదు, అలాంటి ఓ సినిమానే ఈ ‘అవసారానికో అబద్ధం’. అయినా గుడ్డి లో మెల్ల అన్నట్టుగా చెప్పుకోవాలంటే, ‘ధనం మూలం ఇదం జగత్’ ట్రాక్ మ్యూజిక్‍ని బ్యాక్‍గ్రౌండ్‍గా వాడటం బాగుంది. టైటిల్స్ డిజైనింగ్ బాగుంది. చూసుకుంటే ఈ సినిమా కాన్సెప్ట్ చాలా గొప్పది. సరిగ్గా తీసుంటే చాలా బాగా వచ్చుండేది... కాని దర్శకుడు అవకాశాన్ని సరిగ్గా వినయోగించుకోలేకపోయారు.

మైనస్ పాయింట్-
ఓపనింగ్ సీన్ ఒకతను తన రూం‍లో టోపీ వేసుకుని పడుకుని ఉంటాడు. అక్కడ నుంచి మొదలయ్యి సినిమా చివరి వరకూ లాజిక్స్ తో ఆడుకుంటుంది. అసలు ఆకట్టుకోని నటన, సింక్ కాని డబ్బింగ్.. కంటిన్యుటి ఎర్రర్స్... లాజికల్ ఎర్రర్స్.... ఒకటనా.?! మొత్తం సినిమానే ఓ మైనస్.

సాంకేతికంగా-
కెమెరావర్క్ వర్స్ట్. ఫోకస్ మాటి-మాటికి షిఫ్ట్ అవ్వడం మీ బీ.పీ. పెంచొచ్చు.. ఎడిటింగ్ కూడా చాలా దారుణం. వాయిస్ ఓవర్ చాలా అన్‍ప్రొఫెష్యనల్.

మొత్తంగా-‘అవసారినికో అబద్ధం’ అనవసరమైన సినిమా అన్నదే నిజం.

అంకెలలో-
1/5

LINK :
https://www.youtube.com/watch?v=-DU8Rrmkz3Q

 

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు