‘ది బ్లాక్ హోల్’ సాదా సీదా షార్ట్ ఫిల్మ్ కాదు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యి, గ్లోబల్ షార్ట్ ఫిల్మ్స్ లోనే ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఫ్యూచర్ షార్ట్స్ పతాకంపై విడుదలైన ఈ సైలెంట్ లఘు చిత్రం ఇప్పటికే రెండు కోట్లకు పైగా యూట్యూబ్ వ్యూస్ ని తన సొంతం చేసుకుంది. ఈ చిత్ర సమీక్ష... మీ కోసం!
కథ:
ఓ లేట్ నైట్ ఎంప్లాయి తన ఆఫీస్‍లో మాల్‍ఫంక్షన్ అయిన జెరాక్స్ మెషీన్ ద్వారా ఓ బ్లాక్ హోల్ షీట్‍ని కనిపెడతాడు. ఆ బ్లాక్ హోల్ స్పెష్యాలిటి ఏంటి? దానిని అతను తన స్వార్థానికై ఎలా ఉపయోగించుకోవాలనుకున్నాడన్నదే ఈ కథ!
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ కాన్సెప్ట్. అత్యాశ మనల్ని ఎలా ముంచేయవచ్చు అని మూడు నిమిషాలలో చూపిస్తుంది ఈ కథ. ఇలాంటి ఓ డార్క్ థ్రిల్లర్స్ రావడమే అరుదంటే, అది కూడా మూడు నిమిషాల నిడివితో రావడమంటే మొత్తం టీం కి హ్యాట్స్ ఆఫ్. డైరక్షన్ చాలా పెద్ద ప్లస్. స్లీప్ డిప్రివేషన్ తో బాధ పడే ఓ ఎంప్లాయి పొరపాటున కనిపెట్టిన ఓ వింతను చాలా కన్వింన్సింగ్‍గా చూపించారు. తక్కువ నిడివి ఉండడం వల్ల, బాగా చిత్రీకరించడం మరో ప్లస్ అయ్యినందుకుగాను, ఈ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతుంది.
మైనస్ పాయుంట్స్ :
సినిమా బాగున్నప్పటికీ ఓ యాడ్ కమర్షియల్ లుక్ ఉండడంతో ఎడ్వర్‍టైజ్‍మెంట్ అనుకునే పొరబాటు కూడా ఉంది. దానికి తోడు స్నికర్స్ బ్రాండ్ ని ప్లేస్ చెయ్యడం మరింత తప్పుదోవ పట్టించే చాన్స్ కూడా ఉంది.
సాంకేతికంగా :
సాంకేతికంగా అతి పెద్ద ప్లస్ పాయింట్ లైటింగ్ అని చెప్పుకోవచ్చు. మంచి డార్క్ మూడ్ ని సెట్ చేసినందుకుగాను ఫస్ట్ క్రెడిట్ డైరెక్టర్ ఆఫ్ ఫొటొగ్రఫీకే దక్కాలి. కెమెరా వర్క్ చాలా షార్ప్ గా ఉంటుంది. ఎడిటింగ్ కూడా క్రిస్ప్ గా ఉంటుంది. సౌండ్‍ని బాగా డిజైన్ చేశారు.. దీనివల్ల మొత్తం ఓవరాల్ ఇంటెన్సిటీ బాగా పెరుగుతుంది.
మొత్తంగా :
ఈ బ్లాక్ హోల్‍లో మీకో మెసేజ్ ఉంది... చూసేయండి!
అంకెలలో:
4.5/5
LINK-
https://www.youtube.com/watch?v=P5_Msrdg3Hk