నోప్ (నా ఓల్డ్ పాస్‍వర్డ్ ఎలిమినేటెడ్) లఘు చిత్ర సమీక్ష- - సాయి సోమయాజులు

nope short flim review

తెలుగులో షార్ట్ ఫిల్మ్స్ అంటే ఎక్కువగా వచ్చేది హైదరాబాద్, వైజాగ్ నుంచే, ఎందుకంటే అక్కడ ఫిల్మ్ బేస్ కాని, నిర్మాతలు కాని, రిసోర్సస్ కాని చాలా ఎక్కువ. కాని నెల్లూరు లాంటి ఊరి నుంచి మంచి క్వాలిటీతో కూడిన  షార్ట్ ఫిల్మ్ తీయడానికి..సపోర్ట్ చెయ్యడానికి.. ప్రొడ్యూసర్స్ కాని, రిలీజ్ చెయ్యడానికి యూట్యూబ్ ఛానల్స్ కాని.. అందుబాటులో లేకపోవడం దురదృష్టం! అందుకే నోప్ టీం లోని అందరూ.. కొంచెం కొంచెంగా డబ్బు కూడబెట్టుకుని ఈ అఘు చిత్రాన్ని ‘4K’ రెజొల్యూషన్‍లో పూర్తి చెయ్యడం జరిగింది. ఈ చిత్ర సమీక్ష, మీ కోసం-

కథ-

అభినవ్-ఆరాధ్య ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. వృత్తిలో భాగంగా అభినవ్ కొంతకాలం కోసం మలేషియా‍కి షిఫ్ట్ అవ్వాల్సొస్తుంది. వెళ్ళే ముందు ఆరాధ్య అభినవ్‍కి, ఒక ల్యాప్‍టాప్‍లో వాళ్ళ లవ్ మెమోరీస్ అన్నీ స్టోర్ చేసి గిఫ్ట్ గా ఇస్తుంది. మలేషియా వెళ్ళాక ఆరాధ్య, అభినవ్ కాంటెక్ట్ నుంచి దూరమౌతుంది. కాని ప్రతి సంవత్సరం అతని బర్త్ డే కి విష్ చేస్తూ ఉంటుంది. అభినవ్ తిరిగి ఇండియా‍కి వచ్చాక కూడా ఆరాధ్య గురించి ఆలోచిస్తూ బాధ పడుతూ ఉంటాడు. ఇలా ఉండగా ఒక రోజు ఆరాధ్య అభినవ్ కాంటెక్ట్ లోకి వచ్చి తనని కలవ్వొచ్చని చెబుతుంది. అక్కడికి వెళ్ళిన అభినవ్‍కి ఆరాధ్యకి పెళ్ళైపోయిందని తెలిసి గుండె పగిలిపోతుంది.  అసలు ఆరాధ్య పెళ్ళి ఎందుకు చేసుకుంది? ఇప్పుడు అభినవ్ పరిస్థితి ఏమిటి? ఇవి తెలుసుకోవాలంటే మీరు ‘నోప్’ చూడాల్సింది.

సాంకేతికంగా-

ముందుగా ఈ చిత్రం, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆరోగ్యానికి హానికరం అనే డిస్క్లైమర్‍తో మొదలవుతుంది. అయితే ఫీచర్ ఫిల్మ్స్ లో పెద్ద పెద్ద స్టార్స్ ఆ డిస్క్లైమర్‍కి ఆ సినిమా‍లో తాము వహించిన పాత్రకి తగట్టుగా క్రియేటివ్‍గా చెప్పడం మనం చాలా సార్లు చూశాం. కాని ఈ చిత్రంలో ‘అమ్మేవాడు ఉంటే, కొనేవాడు కొంటూనే ఉంటాడు’ అన్న వాయిసోవర్ సెల్ఫ్-అవేర్నెస్‍ని ఎంతవరకు పెంచుతుందని ఆలోచించాలి. కథ విషయానికొస్తే, కొత్త కథ కాకపోయినప్పటికి, కొన్ని అందమైన మూమెంట్స్ తో, కొన్ని అర్ధవంతమైన డైలాగ్స్ తో, చక్కని స్క్రీన్‍ప్లే తో చూడడానికి ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మంది వాళ్ళు ప్రేమించిన వాళ్ళ పేరుని ల్యాప్‍టాప్ పాస్‍వర్డ్, సోషల్ మీడియా పాస్‍వర్డ్ గా పెడుతూ ఉంటారు. దీన్ని బేస్ చేసుకుని చిత్రం తియ్యడం ఓ కొత్త ఆలోచన. నటీ-నటులు బాగా నటించినప్పటికీ, వాళ్ళ ఫిజిక్, స్క్రీన్ ప్రెజెన్స్, వాళ్ళు పోషించే పాత్రలకి సూట్ కానట్టు అనిపిస్తుంది. రెండో హీరోయిన్‍గా నటించిన అమ్మాయికి స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ, తను పోషించిన పాత్రకి కరక్ట్ గా సెట్ అయ్యింది. ఆరాధ్యతో అభినవ్ ఎమోషనల్ గా మాట్లాడేటప్పుడు ’పేరెంట్సా’ అన్న ఒక్క చోట తప్ప మొత్తం డబ్బింగ్ ప్రొఫెషనల్‍గా చేశారు. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అనే చెప్పుకోవాలి. ఈ చిత్రంలో వచ్చే ఒక పెద్ద సంభాషణ ఉన్న సీన్ కి మాత్రం సింఫనీ స్టైల్ మ్యూజిక్ అక్కడక్కడ మ్యాచ్ కానట్టు అనిపిస్తుంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. ముఖ్యంగా, అభినవ్.. రాత్రి ట్యాటూ వేయించుకున్న సీన్‍లోని ఫ్రేమ్, బాల్కనీ-బీచ్‍లోని సిల్యొట్ షాట్స్ బాగా ఆకట్టుకుంటాయి. అలానే టెక్నీషియన్స్ అందరూ అరుదుగా ఉపయోగించే ‘జూం టెక్నిక్‍్’ ని ఈ చిత్రంలో అవసరమైన చోట్ల వాడడం ప్రశంసనీయం. ఎడిటింగ్ బాగుంది. లవ్ ఫెయిల్యూర్, లవ్ ఫెయిల్యూర్ తర్వాత కూడా లవ్ పొందడం, కులం-మతం వల్ల పెద్దలు ఒప్పుకోకుండా బలవంతంగా పెళ్ళి చేసుకోవడం, ఇలాంటి వాటి మీద మనం ఇంతకముందే చాలా చిత్రాలు చూశాం. కాని ఈ చిత్రం మొత్తంలో లవ్‍లో ఫెఫెయిల్యూర్ అయిన క్యారెక్టర్స్ చాలా‍నే ఉన్నప్పటికీ, ఏ పాత్ర కూడా దానికి ఎదురు తిరిగే సిచువేషన్ చూడము. ‘నువ్వు ప్రేమించే వాళ్ళు నీ జీవితంలో ఉండకపోవచ్చు కాని, నీ జీవితంలోకి వచ్చేవాళ్ళను ప్రేమించాలి’ అన్న సందేశాన్ని ఈ చిత్రం అందిస్తుంది.

మొత్తంగా-

అరగంట నిడివి ఉన్నప్పటికీ బోర్ కొట్టించకుండా ఒక లవ్-స్టోరి‍ని అందంగా తీయగలిగారు ఫెరోజ్ షైక్. చూసేయండి!

అంఖెలలో-

3/5   

లింక్:

https://www.youtube.com/watch?v=er9sCNLBNUI

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు