కుసుమస్తబకము - రాము కోలా.దెఃదుకూరు

Kusuma stabakamu

పరుగులుకే పరుగులు నేర్పినట్టి నా పాదాలు నేడు వీల్ చైర్ కు మాత్రమే పరిమితం అవుతాయని ఎప్పుడూ అనుకోలేదు నేను.! ఆనాటి నేస్తాలు నేడు పలకరింపుల విషయంలో నల్లపూసలే. ప్రకృతిలోని అందాలను ఆస్వాదిస్తూ నాకు నేను ధైర్యం చెప్పుకుంటూపోతూనే ఉన్నా! , సంతోషంగా జీవిస్తున్నా ఆకాశంలోని ఇంద్రధనుస్సు ,. నింగి నుండి నేల జారే చినుకు ,మట్టిలోని పరిమళం ఆస్వాదించడం ఇష్టం. దూరంగా కనిపించే కొండలను చూస్తూ రోజులు గడిపేస్తున్నా! ఇష్టమైన వాటిని కొన్ని దూరం చేస్తాడు భగవంతుడు అంటారు. అది నిజమేనేమో? అని పిస్తుంది నాకు. నా అనారోగ్యం విషయంలో కారణం! నిండా ఇరువై సంవత్సరాలు కూడా నిండని నాకు నిమోనియా..అని డాక్టర్ తేల్చి చెప్పడంతో. నా సరదాలు.ఎన్నో నన్ను ఒంటరిని చేసి దూరంగా వెళ్ళిపోయాయి... మా అవసరం ఇక నీకు లేదంటూ!!. "ఆకాశం ఉరిమిందంటే ఎంత సంభరమో నాకు." చినుకుల్లో పరుగెత్తుకెళ్ళి అయ్యంగార్ బేకరిలో ఐస్ క్రీమ్ కొనుక్కోవడం , ఒక పక్క వర్షపు చినుకులు పడుతుంటే ఐస్ క్రీమ్ తింటుంటే ఆ సరదానే వేరబ్బా..!.అని ప్రేండ్స్ తో చెప్పుకోవడం చిన్నతనం సరదాలు. నింగి నుండి జారే వడగళ్ళు ఎంతిష్టమో.. అవి కరిగేలోగా. నోటిలో వేసుకోవడం బహు సరదా నాకు.అదో అల్లరి ఆమ్మతో అమ్మ వారిస్తున్నా.. హిమ తుంపర్లలో స్నానమాడి, ఉదయభానుని సున్నిత కిరణాల స్పర్శకు మెరిసే గరిక సోయగం తిలకించడం ఎంత ఆనందమో...నాకు. వాగుల్లో నీటి ప్రవాహంలో కాగితం పడవలు వదులుతూ, వాటి పై దేవుడు.. నా పేర్లు వ్రాసి.. నా పడవ ముందు వెళుతూంటే దేవుడు ఓడిపొయాడని కేరింతలతో మురిసిపోయేదాన్ని. అందుకే జీవితంలో, ఆ ధైవమే నాతో ఆడి గెలిచాడేమో.. అందుకే ఇలా ఎనిమిది నెలలుగా జీవితం వీల్ ఛైర్ కు పరిమితమై పోయింది. గోడపై బల్లి పరుగులతో చేసే సాహసం.. తప్పించుకునేందుకు పరుగులు చేసే ప్రయత్నం అవే నాకు కాలక్షేపం నేడు. రిలీఫ్ కోసం కిటికీ పక్కకు చేరాను . ఆకాశం నల్లని చీర చుట్టుకుంది అనేలా ఉంది. చల్లటి గాలి, తోడుగా చిన్న చిన్న చినుకులు, తన విధినిర్వహణ పూర్తి చేసుకుని, పడమట దిక్కున వాలిపోతున్న భానుని కిరణాలతో.. ఎంత మనోహారంగా ఉందో దృశ్యం. .. ఏ కవికైనా, మనసు స్పందించి. అక్షరంతో భావాలు పలికించడానికి....ఈ రమణీయ దృశ్యాలు చాలు. కిటికి లోనుండి, చూస్తున్న నేను ఒక్కసారిగా బామ్మగారు.. అంటూ, నా గది దద్దరిల్లేలా అరిచాను... దూరంగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్న బామ్మకు వినిపించాలని. నా గొంతులోని మాట బయటకు వినిపించదని తెలియని క్షణం.. "బామ్మ.." అంటూ ఆరచిన అరువు నాకే ప్రతి ధ్వనించింది. చిరు జల్లులో నడవ లేక నడుస్తుంది. బామ్మగారు.. వంగి పోయిన నడుముతో, చేతిలో సంచితో, జారిపోతున్న పవిటను సరి చేసుకుంటూ. రోడ్డుకు ఒక పక్కగా నడుస్తుంది. వయో భారం కనిపిస్తున్నా! అనుభవాలతో పరిపూర్ణత సాధించుకున్నట్లు, కనిపిస్తుంది . నా అరుపులకు కారణం! రోడ్డుకు కాస్త పక్కగా కేబుల్ కోసం త్రోవ్విన గుంటలు. అవి నీటితో నిండి పోవడం ఉదయంనుండి చూస్తున్నాను... అందుకే ఆ దారిలో ఎక్కడ గుంట ఉంది. మున్సిపల్ వర్కర్స్ కంటే నేనే బాగా చెప్పగలను. మంచి ఎక్స్ ఫర్ట్ అయిపోయాను అందుకే. రాత్రి కురిసిన వర్షం గుంటను నింపేసింది. ఆవిషయం బామ్మకు తెలియదు కదా. అటుగానే వెళ్తుంది. జరగరానిది జరిగితే.. తను చూస్తూ ఏమీ చేయలేక పోయాననే బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఆమెకు తెలపడం ఎలా! నేనుగా దిగి వెళ్లి చెప్పలేను. ఇక్కడ నుండి అరచినా తనకు వినిపిస్తుందని గ్యారెంటీ లేదు. ఎలా.. !ఏం చేయాలి. ఏదురుగా జరగబోతున్న ప్రమాదం ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. దగ్గరలో ఏవరైనా ఉంటే. వారికైనా చెప్పవచ్చు అనుకుంటుండగానే.స్కూల్ నుండి పిల్లలు బయటకు వస్తూ కనిపిస్తున్నారు. ఎవ్వరైనా నా వైపు చూస్తే బాగు అని దైవాన్ని తలచుకోవడం మాత్రం చేస్తే ఎలా. తనని అటుగా వెళ్ళ కుండా ఆపగలగాలి.. ఎలా.. అంటూ ఆలో చిస్తున్నే ఉన్నా... నా టేబుల్ పైన గాజు ప్లవర్స్ వాజ్ "నేను నీకు హెల్పు చేయనా "అన్నట్లుగా చూస్తూంది. వెంటనే, ఆలోచన నా మదిలో, ఒక పేపర్ తీసుకుని. చకచకా రాసాను ! మీకు ఎదురుగా గుంట ఉందని. నా ఎర్ర చూన్నీ కూడా ఫ్లవర్ వాజ్ లో ఉంచేసాను.. తిరిగి కాయితం పై వ్రాసాను. ఎదురుగా గుంట ఉంది.. అది తెలియచేస్తూ ఎవరైనా ఈ చున్నీ అక్కడ కట్టగలరు.. అని రాసి ఒక ప్లాసిక్ కవర్ లో ఉంచి చున్నీ కి పిన్ చేసాను. ఇక ఉపేక్షించే సమయం లేదని పించింది. గ్లాజ్ ఫ్లవర్ వాజ్ బామ్మ కు కాస్త దగ్గరలో పడేలా నా శక్తి నంతా కూడా దీసుకుని విసరడం. అది బళ్ళున పగిలి పోవడం. ముందుకు సాగే బామ్మ గారు ఆగి పోవడం అన్నీ క్షణాల్లో జరిగి పోయాయ్ క్రింద పడిన గాజు ఫ్లవర్ వాజ్ శకలాలు ఓపికగా తీసి పక్కన వేస్తుంది బామ్మ గారు..మరొకరికి అవి ప్రమాదం కాకూడదను కుందేమో. చివరగా నా చున్నీ తన చేతిలో.. ఆత్రంగా చూస్తున్నా.. తను ఏం చేస్తుంది.. వదలి వెళ్లి పోతుందా, లేక నేను వ్రాసిన అక్షరాలు చదువుతుందా! నాకెందుకులే అని ముందుకు సాగుతుందా.. ఆలోచనలో నేనుండగానే... పక్కనే ఉన్న కాస్త పెద్ద రాళ్లు ఎంతో శ్రమతో జరిపి వాటికి అడ్డంగా నా ఎర్ర చున్నీ కట్టేసింది.. ముందు ప్రమాదం పొంచి వుంది జాగ్రత్త !అనేలా. దారిన పోయే వారు కాస్త దూరంగా జరిగి వెళుతున్నారు.. బామ్మ శ్రమకు తలవంచి నమస్కరిస్తుంటే.. నా ఆధరంపై చిరునవ్వులు.. బామ్మ తలపైకెత్తి చూస్తుంది నన్ను దీవిస్తూ.. మనసులో బామ్మగారికి సమర్పించుకున్నా కుసుమస్తబకము.(పుష్పగుచ్చం) ("ఎదుటి వారికి చిన్న సాయమైనా చేయాలనే బామ్మ" నా కథకు స్ఫూర్తి) శుభం..

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు