బ్రహ్మ లిఖితం..! - రాము కోలా.దెందుకూరు.

Brahma likhitam

"లక్ష్మీదేవి నడయాడుతున్నట్లే ఉంటుంది! నా చిట్టితల్లి నట్టింట తిరుగాడుతుంటే" అని మురిసిపోయే వారు నాన్నగారు! నా అల్లరితో ఇల్లు ఎప్పుడూ కళ కళ లాడుతూ ఉండేది. పదవ తరగతి జిల్లా ఫస్ట్ వచ్చినప్పుడు ,నాన్న కన్నుల్లో ఆనందం నేటికీ నాకు గుర్తుంది. నన్ను దగ్గరకు తీసుకుని ఆనందభాష్పాలతో నన్ను తడిపిన క్షణం, నాన్నా నాకు చంటి పిల్లాడిలా కనిపించాడు .. "ఏంటి నాన్నా అంటే!" "తల్లిదండ్రులు వలన బిడ్డకు గుర్తింపు రావడం సహజం" కానీ ! "బిడ్డల వలన తల్లిదండ్రులకు ఓ గుర్తింపు రావడం అనేది ఎంతటి అదృష్టమో చెప్పలేము !రా తల్లీ. కొందరికే అటువంటి అదృష్టం కలుగుతుంది." "నీవలన నాకు ఆలోటు తీరింది." అని మురిసిపోయిన నాన్నల్లో అమ్మలోని మాతృత్వం కనిపించింది. అమ్మ చనిపోయినా!నా కోసం మరో పెళ్ళి చేసుకోలేదు నాన్నా ,ఎందరు చెప్పినా, వినలేదు కూడా.నేను ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందో అని . నేను డిగ్రీ పూర్తిచేశాను,ఒక మంచి సంబంధం చూసి నాకు పెళ్ళి చేయాలి అనే నాన్న కోరికను ఆ దేవుడు తథాస్తు,అన్నాడేమో? మా బంధుత్వం లోనే చక్కటి సంబంధం కుదిర్చి,ఎటువంటి లోటు లేకుండా,అడిగినదానికి రెండింతలు,ముట్టచెప్పి పెళ్ళి జరిపించేలా చేసాడు.. అప్పగింతలు రోజు నాన్న ,తన సర్వం కోల్పోయినట్లే మిగిలిపోయాడు. పుట్టింటిని వదిలి మెట్టినింటికి వెళ్ళిన నాకు, ఎంతో అల్లారు ముద్దుగా పెరిగి నాకు బయట ప్రపంచం తొలిసారిగా,కొత్తగా,వింతగా కనిపించింది. మనిషి మాటకు,ప్రవర్తనకు ఉండే వ్యత్యాసం తెలిసివచ్చింది. మాంగల్యం అనే బంధం నా కాళ్ళకు ,నా ఆశలకు,నా కోరికలకు, సంకెళ్లు వేసింది. నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉండకూడదు , మెట్టినింటి వారి ఆంక్షలు తలవంచుకు నడుచుకో వాలసిందే.. సమాజం దృష్టిలో నేను అదృష్ట వంతురాలిని, కారు,బంగ్లా,కానీ పంజరంలో చిలుక లాంటిదని ఎందరికి తెలుసు.. కనీసం "భోజనం చేసావా "అని అడిగే సమయం లేనట్లుగా మసలుకునే భర్త, కోడలు అంటే ఇంటి పనిమనిషి తో సమానం అనుకునే అత్తగారు, పుట్టింట్లో జరిగినట్లు జరగాలంటే ఎలా కుదురుతుంది.అనే ఆడపడుచు. తలవంచుకుని చేసుకుపోతున్నా తప్పు వెతికే మరిదిగారు, ప్రతిక్షణం నిఘా నీడలో సాగిపోయే జీవితం. మనసారా నవ్వుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుందో.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు