"పదేపదే చెపుతున్నాను అనుకోవద్దు? " "నువ్వు ఎంత జాగ్రత్తతో ఉంటే అంత మంచిది.!" నా మట్టుకు నేను లొడలొడా వాగడమే కానీ? నీ నుండి స్పందనే రాదేం?" రమణమ్మ కూతురు వైపు గుర్రుగా చూస్తూ! కాస్త గద్దిస్తున్నట్లుగా అనడంతో, స్టౌ మీది పాలగిన్నె దించి పక్కన పెడుతూ, "అలాగే!గుర్తుంచుకుంటాను!" "అయినా నువ్వు ఊహించుకునే అంత ఇదేమీ లేదు!ఏదైనా ఉంటే నీకు చెప్పకుండా దాస్తూ ఉంటానా?" "అనవసరంగా ఏదేదో ఊహించుకుని,నువ్వు భయపడి నాన్నను భయపెట్టకు" "ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే తప్పకుండా చెపుతాను కదా?" "నువ్వు మనసులో ఏదీ పెట్టుకోకుండా.,ఉంటే మంచిది.నేను బాగానే ఉన్నానని నాన్నకు చెప్పు." తల వంచుకుని పని చేసుకుంటూ, తల్లికి వినపడీ వినపడనట్లుగా చెపుతూ! తన పని తాను చెసుకు పోతుంది రమణమ్మ కూతురు మానస. "అత్తవారింట్లో ఇబ్బందులు ఏమీ లేవు" అని చెప్పే ప్రయత్నం చేస్తుంది మానస. "పాలేవో?నీళ్ళేవో తెలుసుకోలేని పిచ్చిదానివి?" "అప్పుడే నిన్ను తన బుట్టలో వేసుకునే వేసుకుందా." "ఇక నా మాటలు నీకు నచ్చవులే? ఆడబిడ్డ అంటే! అర్దమొగుడు అంటారు." ఎలా నెట్టుకు వస్తావో జాగ్రత!".చెప్పి చీర కొంగుతో కన్నుల్లో నీళ్ళు ఒత్తుకుంది మానస తల్లిగారు రమణమ్మ. "ఏదైనా!మనం చూసే విధానం లోనే ఉంటుందమ్మా!" "ఆడబిడ్డ అంటే? అర్ధభాగం అనేది మంచికోసం చెప్పిన మాటే అని ఎందుకు అనుకోరు,?" "భర్త దగ్గర లేని సమయంలో! వదిన ఆలనా పాలనా తానే చూసుకుంటుంది కనుక ,అలా అని ఉంటారు పాతకాలంలో." "నేడు ఆడపడుచు అంటే,చెల్లిగానో,బిడ్డగానో వదినకు తోడుగా నిలిచే మరో అమ్మలా తోడు అనుకోవాలి,లేదా అలా ఉండేలా మలచుకోవాలి. ఆడబిడ్డ అంటే ?ఇంటి కోడలిపై పెత్తనం చెలాయించే మరో అత్తరూపమే!అనే అభిప్రాయం మనసులో తొలిగిస్తే,మెట్టినింట అడుగిడిన కొత్త కోడలికి,మంచి స్నేహితురాలు దొరికినట్లే. ఇదే నేడు ప్రతి ఆడపిల్ల తల్లి తెలుసుకోవలసిన విషయం. "నా ఆడబిడ్డ బంగారం!.నా పనిలో ఎంతో సహకరిస్తుంది,మా వారిని ఒప్పించి తనతో సమానంగా , డిగ్రీ పరిక్షలకు ఫీజు కట్టించింది,సాయంత్రం పూట నాకు కామర్స్ లెక్కలు కూడా చెపుతుంది. అంత మంచిది,నీలాగే.. పాతకాలంలోలా నేడు ఆడబిడ్డ ఇంటి కోడలి కాళ్ళకు వేసే సంకెళ్లు వంటిది కాదు, ఇంటికి కోడలికి మంచి స్నేహితురాలు కూడా.! "అమ్మా నువ్వు ఇక నిచ్చింతగా ఉండవచ్చు సరేనా?" చెపుతున్న కూతురు వైపు చిరునవ్వుల్తో చూసింది రమణమ్మ.. తన బిడ్డకు ఆడబిడ్డ పోరు లేదని ,అత్తవారింట తనకు మంచి ఆదరణ లభిస్తోంది అని తెలిసి , గుండెలు నిండుగా గాలి పీల్చుకుంది రమణమ్మ. శుభం.