ఓ పెళ్లి సంబంధం!? - అమ్జద్.AMJAD

O pelli sambandham

" రోజుల్లో పెళ్లీళ్ల వ్యవహారాలు వ్యాపారాలైపోయాయి!" అని వాపోయాడు ఓ వయసు మళ్లిన తండ్రి.

"పెళ్లా...! వెరీ ఈజీ...ఇలా బటన్ నొక్కితే అలా...అమ్మాయిలు బయటికొస్తారు...సెలక్షన్ చసుకోవడమే ప్రాబ్లం. ఐ.టి. రోజులు కదా. పెళ్లి వ్యవహారాలకు కొదువేమి లేదు!" అని కాలేజీ కుర్రాడొకడు వ్యాఖ్యానించాడు.

"ఓ విధంగా చెప్పాలంటే కట్న-కానుకల గొడవలు కొద్దిగా తగ్గాయనుకో...మ్యారేజి-లింక్స్...కంప్యూటర్స్...ఇంటర్నెట్ పుణ్యాన...వెబ్సైట్లలో తిరుగుతూంటే!

ఫేషన్ అప్పీల్ కొద్దిగా మెరుగ్గానే ఉన్న ఫేషన్ డిజైన్ లో డిప్లోమా పుచ్చుకున్న యువతి అభిప్రాయం అది!

"ఇలా చెప్పుకుపోతూంటే ఎన్నోఅ వ్యాఖ్యాలు, వ్యక్తిగత అభిప్రాయాలు పెళ్లీల గురించి చెప్పుకోవడం సులభమే!" అని మధ్య వయస్కురాలైన ఓ మహిళ కొంచెం కర్కష గొంతుతో అంది.

బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషనులలో లేదా ఇద్దరు-ముగ్గురు ఆడవాళ్లు ఒక చోటకు చేరితే పెళ్లీల సంబంధాల గురించి మాట్లాడుతు టైం పాస్ చేసుకునే వాళ్లు. ఇప్పుడేమో ఈ పెండ్లిల ఆఫీసులు వెలుగులోకొచ్చాక తమ తమకు కావలసిన సంబంధాల గురించి ఆరా తీయడానికొచ్చిన అమ్మలక్కలకు ఇదో తంతు అయింది.

ఈ నేపథ్యంలోనే పరంధామయ్య గారి శ్రీమతి సులేఖ గారి ఏకైక కొడుకు కోసం అమ్మాయిని వెదకడంలో తమ చెప్పులు అరిగేసుకొన్నారు కాని తమ మనసుకు, కంటికి నచ్చిన అమ్మాయి కరువైపోయింది! పరంధామయ్య గారికి నచ్చితే సులేఖ గారికి నచ్చదు. అలా వైస్ వర్సా!!

ఇలా వారి శ్రీమతి కోరే అమ్మాయి అందాల పుట్ట, గుణగణాల సంపద, వెనుక ముందు ఎవరు లేకుండా ఏకైక కూతురై ఉండాలి. అంతేగాకుండా హైదరాబాద్ పట్టణంలో ఓ చెప్పుకోదగ్గ ఇల్లు అమ్మాయి పేరుమీద కనీసం రెండొందల గజాల పై గ్రవుండ్ ప్లస్ వన్ ఉండాలి. పల్లెటూరు లేదా గ్రామానికి చెందిన అమ్మాయి అయితే గ్రాడ్యుయేషన్ పూరి చేసి ఉండాలి! ఒకవేళ పట్టణంలో మకాం మారిస్తే-బంగారం, బ్యాంక్ బాలెన్స్ గురించి వేరుగా చెప్పుకోనవసరం లేదు.

శ్రీమతి , శ్రీ పరంధామయ్య గారు తనకు కాబోయే కోడలి కోసం వెదకని చెట్టు-పుట్ట అంటూ లేదు.

ఇంక, వారి అబ్బాయి సుందర రామయ్య గురించి ముక్తసరిగా చెప్పుకోవాలంటే బి.టెక్ చెసి, ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎం.బి.ఏ అయిందనిపించి ఓ ప్రవైట్ కంపెనీలో ఎక్స్ క్యూటీవ్ ఆఫీసరుగా పనిచేస్తున్నాడు హైదరాబాద్ హైటెక్ సిటీలో.

పరంధామయ్య గారు అమ్మ-నాన్నల ఆస్తిని పూర్తీగా అమ్మేసి, పుట్టి-పెరిగిన ఊరును తిరోధనాలిచ్చి బంజారహిల్స్ లో అధునాతనంగా ఓ విల్ల కట్టించుకున్నారు. ఇంటిముందు తెల్లగా మెరసిపోతూన్న టయోటా కోర్లా కారు.

అమ్మాయిల వేటలో ప్రింట్ మీడియా నుంచి ఇంటర్నెట్ వరకు వెళ్లి...చివరికి పెళ్లి-సంబంధాలు చేసి పెట్టె కార్యాలయాల చుట్టు పచార్లు చేస్తూ, చేస్తూ...గట్టి నమ్మకస్తుడనిపించిన ఓ పెండ్లీల పేరయ్య దగ్గర అతుక్కుపోయారు పరంధామయ్య గారు శ్రీమతి తో సహా!

పెండ్లిల పేరయ్యగారి పేరు మోహన్ రావు. చూడటానికి మోహనంగానే ఉంటాడు. మాటల్లో చాతుర్యమేగాక తేనే పలుకులు కూడా! ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకునే గుణం. అనుమానం లాంటి గొడవలేమి లేకుండా...కేవలం హై ప్రొఫైల్స్ వారినే ఎంటర్టైన్ చేస్తానని వెయ్యి నోట పదహారు రూపాయలు రజిస్ట్రేషన్ ఫీజు అని లాగేశారు.

అలా వారం రోజులకోసారి, ఆ తర్వాత రెండు వారాలకోసారి మోహన్ రావు గారికి దర్శనమివ్వసాగారు పరంధామయ్యగారు కొన్నిసార్లు. మరికొన్ని సార్లు శ్రీమతి పరంధామయ్యగారు. అప్పడప్పుడు ఇద్దరు...భార్యభర్తలు.

మోహన్ రావు గారి ఆఫీసు ఉన్నది యల్.బి.నగర్ లో. బంజారహిల్స్ నుంచి రావడం, పెట్రోల్ కాల్చడం పరంధామయ్యగారికి చిన్నగా తలనొప్పిలా మొదలైంది. ఆ విషయం గురించి మోహన్ రావుతో ప్రస్తావించగా, "ఏ అందాల తారకు తగ్గకుండా, తన దగ్గరున్న స్లిమ్‌గర్ల్ కోసం పడిగాపులు పదుతూన్న హాండ్సమ్ అబ్బాయిల ఎడతెగని క్యూను ప్రక్కన పెట్టి మీకోసమే ఈ సంబంధాన్ని దాచిపెట్టాన " ననిచెప్పి టేబుల్ మీదున్న ఓ గులాబీరంగు ఫైల్ తీసి, వివిధ భంగిమలలో ఉన్న ఓ అమ్మాయి ఫోటోలను చూపించాడు. అవి బస్ట్ సైజులో ఒకటి, మరొకటి ఫుల్ సైజులో ఉంది. చివరిది నిలువెత్తున్న అద్దం ముందు నిలబడి తీయించుకున్న కలర్ ఫోటో. పరంధామయ్య దంపతులకు బాగా నచ్చింది.ఒకే చూపులో వారిద్దరు 'సై' అని అన్నారు.

ముందు ఖరారు పరచుకున్న ఒప్పందం ప్రకారం వారి దగ్గర్నుంచి ఇరవైవేల రూపాయలకు ఓ బ్యాంక్ చెక్ తీసుకున్నాడు.

రెండు రోజుల తర్వాత వచ్చే ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు పెండ్లి చూపులు ఖాయమని మోహన్ రావు చెప్పడు. తన ఫోన్ కోసం ఎదురుచూడమని మరీ చెప్పాడు...'ఫర్ రీ కంఫర్మేషన్ ' అని!

చెప్పిన ఆదివారం రాలేదు! కాని అలా కొన్ని ఆదివారాలు మాత్రం గడచి పోయాయి.

అసలు సంగతేమిటంటే...కొన్నాళ్ల క్రితం శం షాబాద్, సైబర్ సిటీ, రామోజీనగర్ శివారులలో హాట్ కేక్ లా అమ్ముడుపోయిన ప్లాట్స్ లా...తన దగ్గరున్న ఓ పెండ్లి సమబంధం...ఒకే ప్లాట్ ను ఒకరికంటే మించిన వారికి అమ్మినట్లు... ఆ అందాల తార గురించి చెప్పి...సంబధాన్ని ఖాయపరుస్తానని, అంగీకారం చేసి, అడ్వాన్స్ అనో...రజిస్ట్రేషన్ అనో చెప్పి వేలకు వేల రూపాయలు లాగుతూ...హామీలిచ్చాడు కొందరికి మోహన్ రావు. ఈ హామీల వ్యాపరంలో మోహన్ రావు లక్షలు ఆర్జించాడు. కాని ఎక్కువ రోజులవరకు జీర్ణీంచుకోలేక పోయాడు.

పెండ్లి సంబంధం తాలుకువాళ్లు ఆ అందాల తార ఎక్కడో తెగిపడిపోయిందని ఓ పుకారు లేచింది.

ఇంకేముంది! ఒకరినొకరు ఆరా తీసుకొని, అందరు కలసి పోలీసు శరణం జొచ్చారు. పోలీసు రంగంలోకి దిగింది. మోహన్ రావు వాళ్ల చేతికి చిక్కాడు. చితక బాదారు పోలీసువాళ్లు. నిజాన్ని కక్కించారు.

అందాల తార, తారమణి, తన తల్లిదండ్రులకు ఏకైక కూతురు. కోట్లాధికారి. ఆమె నాన్న మల్టీ బిజినెస్ మెన్.

కాలేజీ రోజులలో తారమణి గురించి విధ్యార్ధులలో ఎన్నో గొడవలు ప్రేమ వ్యవహారాలపై. కోట్లాటలు, పోట్లాటలు చివరికి కొందరికి రిస్ ట్రక్షన్స్!

బ్యాచలెర్-లెక్చరర్స్ కూడా నోట్లో నీళ్లు నమకుండా ఉండలేక పోయారు, ఆమెను చూస్తూన్నప్పుడల్లా క్లాసులో!

గొప్ప గొప్ప ఇంటివాళ్లు, ప్రముఖ (రాజకీయ) నాయకుల మొగ పిల్లలు తారమణిని చేజిక్కించుకోవాలని తపించి నీరుకారిపోయారు!!

ఏలాంటి ప్రయత్నం చేయకుండానే, సదరు మోహన్ రావు గారి చేతికి చిక్కి, ఆమె ఆయనకు శ్రీమతి అయింది. మోహన్ రావు ఆమెకు ఓ క్లాస్ సీనియర్. అంతే!చూపులు కలసిన వేళ శుభఘడియ కావడం వల్లనేమో లేక అదృష్టం కలసి రావడమో...జరిగి...తారమణి అయనలో ఒదిగిపోయింది. పెండ్లిపీటల మీదనే పెండ్లి జరిగింది! ఆ తర్వత ఇండియాలో ఉన్న అన్నీ హిల్ స్టేషన్స్ లలో మజా చేసి, అలసి కొండలు దిగారు.

కొన్నాళ్లు సంసారం బాగాన్వే ఈదిన, తారమణి గొప్పలు, వ్యంగ్యపూరితమైన మాటలు, భర్తపై చిన్నచూపులు వగిరా వగీరాలు మోహన్ రావు గుండెలకు ఈటెల్ల తగిలాయి. గుచ్చుకున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే తారమణి నకరాలు తారస్థాయికి చేరాయి. మోహన్ రావు ఆమెకు ఎన్నో విధాలుగా నచ్చజెప్పాడు. ఆమె ససేమిరా రాజీకి రాలేదు. చేసేదేమి లేక మోహన్ రావు సింపుల్ గా విడాకులు పుచ్చుకున్నాడు.

ఎంతగానో క్రుంగిపోయినా మోహన్ రావు ఆమెకు, ఆమె నాన్నకు ఓ గుణపాఠం చెప్పాలని అహోరాత్రులు తర్జనభర్జనలు చేసుకొని ఆడిన నాటకమే ఈ కథ అని పోలీసువాళ్లకు చెప్పాడు మోహన్ రావు.

తారమణికి మరియు వాళ్ల నాన్నకు తను పెండ్లీల పేరయ్యగా మారి వాళ్లను మూడు చెరువుల నీళ్లను ఎలా తాగించాడో వివరించాడు పోలీసోళ్లకు.

తారమణి వివిధ భంగిమలలో ఉన్న ఫోటోలను, ఒక ఫొటోతో మరో ఫోటొకు పోలికలు లేకుండా ఫోటోషాప్ సహాయమున తీర్చి దిద్ది...కట్న-కానుకల మోజులో పడినవారికి మభ్యపెట్టి...వాళ్లకు తారమణి నాన్నగారి సెల్ ఫోన్, లాండ్ ఫోన్ నెంబర్లు మరియు వాళ్ల ఈ-మైల్ అడ్రసులిచ్చి నానా హంగామా చేశాడు.

తారమణి నాన గప్ చుప్ గా, ఆమెకు పండ్లి చేసి యూ.ఎస్. కు తరలించాడు. ఆయన అల్లుడు అక్కడ ఓ కాలేజీలో కంప్యూటర్ క్లాసులు తీసుకొంటున్నాడు. కాని మోహన్ రావు తారమణికి రెండవ పెండ్లి జరిగిన విషయం తెలిసిన...తనలోని పగ, ద్వేషం ఇంకా చల్లార లేదు. అందుకే అందరికి ఒకేలా వాగ్దనం చేశాడు తారమణి (తన ఎక్స్-వైఫ్) తో పెండ్లి చేయిస్తానని. అసలు విషయం తెలియని వాళ్లు మోహన్ రావు వలలో చిక్కి డబ్బులు, సమయం వెచ్చబుచ్చుకున్నారు.

సమయ స్ఫూర్తిని ఆచరించినవాళ్లు పోలీసుల శరణు జొచ్చారు.

మోహన్ రావు ప్రేమ కథ అలా ముగింపుకొచ్చింది!?

***

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు