" అశోక సామ్రాట్ కి జై " - నల్లబాటి రాఘవేంద్రరావు

Ashoka samraat ki jai

మౌర్య సామ్రాజ్యాన్ని సామ్రాట్ అశోక్ పరిపా లించిన 37 సంవత్సరాలలో రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం చాలా కొత్త కొత్త మార్పులు జరిగాయి. ప్రత్యేకమైన ఆర్థిక సంస్కరణల ఏర్పాట్లు జరి గాయి, ప్రజారోగ్య అభివృద్ధి దృష్ట్యా ప్రత్యేక మందిరాల స్థాపనలు జరిగాయి. ఇంకా కుటుంబంసమస్యల పరిష్కారం కోసం, అలాగే ఆస్తి తగాదాల పరిష్కారం కోసం ప్రత్యేకమైన వీధి తీర్పు మందిరాలు లాంటివి కూడా వెలిసాయి. దానితోపాటు ప్రజల జీవన విధానాలు.. పూర్తిగా మారాయి. ఒక రోజు ఏమి జరిగింది అంటే.... ఒక దొంగ తాను మామూలు మనిషిగా మారిపోవాలని పూర్తిగా నిశ్చయించు కొని.. ..సరాసరి రాజసభకు వచ్చేశాడు. " మహారాజా నేను ఇంతకాలం దొంగతనాలు చేస్తూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాను. అయితే ... తమ పరిపాలనలో ప్రజల స్థితిగతులు బాగోగులు చూసిన తర్వాత నాకు ప్రజాజీవనంలో కలిసిపోవాలని మామూలు మనిషిగా బ్రతికి నా భార్యబిడ్డలను పోషించు కోవాలి అని.... మనస్ఫూర్తిగా అనిపించింది. తప్పో ఒప్పో ఇన్నాళ్ళు నేను చేసిన తప్పి దాలను పెద్దమనసుతో మన్నించి నాకు... మామూలు జీవన విధానం తో బ్రతికే అవకాశం కల్పించవలసినదిగా ..మహారాజుల వారికి శిరస్సు వంచి కోరుకుంటున్నాను. " అంటూ సవినయంగా విన్నవించుకున్నాడు. రాజుగారు చాలా ఆనందపడ్డాడు. మనిషిలో మానసిక పరివర్తనకు మించిన శిక్ష ఉండదని.. తద్వారా ఆ దొంగను క్షమించి విడిచి పెట్ట వచ్చునని నిశ్చయించుకొని.. ఇలా అడిగాడు. " నీ పేరు.." " మహారాజా నా పేరు... రామదత్తుడు. " సరే .. నీకొక పరీక్ష పెడతాను.. ఆ పరీక్షలో నెగ్గితే నువ్వు కోరినట్టే చేస్తాను.." అంటూ ఒక చిన్న కడియాన్ని.. అతనికి అందిస్తూ " ఈ క్షణం నుండి దొంగతనాలు మానేసి 30 రోజుల తర్వాత ఇదే కడియం పట్టుకొని నా దగ్గరికి రా " అంటూ.. ఆజ్ఞాపించాడు. రామదత్తుడు మహదానందంగా ఆ కడియాన్ని పట్టుకుని వెనుదిరిగాడు. ఒక సత్రంలో భార్యా బిడ్డలతో తల దాచు కుంటూ చిన్న పని చేసుకుంటూ జీవనం కొన సాగించాడు. . కాలం... కాల గర్భంలో 20 రోజులు గడిచిపో యింది. రాజ ఆస్థానానికి వెళ్లి రాజుగారిని కలిసే సమయం దగ్గర పడుతోంది....ఉన్నట్టుండి రామదత్తుడికి ఒక అనుమానం వచ్చింది..... 'తను నివసించే సత్రంలో చాలా మంది జనం ఉండేవారు. ఈ 20 రోజులలో తాను సత్రంలో లేనప్పుడు..తను రాజుగారు ఇవ్వగా భద్రంగా పాత బట్టల సంచిలో దాచిన ఆ కడియాన్ని ఎవరైనా తస్కరించారా??... 'అన్న అనుమానం కలిగింది. వెంటనే మూట విప్పి చూశాడు. కడియం తను పెట్టిన చోట భద్రంగా ఉంది... 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చాడు. మరో వారం గడిచింది... రామ దత్తుడికి మరో అనుమానం కలిగింది. " ఏమో తను లేనప్పుడు ఎవరైనా ఆ కడి యాన్ని తీసేసుకుని అదే స్థానంలో నకిలీ కడియం పెట్టారేమో... ఎందుకైనా మంచిది... ఒకసారి స్వర్ణకారుడు దగ్గర పరిశీలన చేసి చూస్తే తెలిసిపోతుంది కదా అనుకొని పక్కనే ఉన్న వీరాచారి గారికి చూపించాడు. చారి గారు నిశితంగా దానిని గీటు పెట్టి పరిశీ లించి.. " అబ్బే.. అబ్బే...ఇది బంగారపు ది కాదు. నకిలీది.. ఇత్తడి కడియం... అంటూ తేల్చి చెప్పేశాడు. రామదత్తుడి గుండెలో.. బండరాయి పడినట్టు అయ్యింది.. గాబరా పడిపోయాడు కంగారు.. పడిపోయాడు.. " అమ్మో ఇక రెండు రోజులే సమయం.. ఈ నకిలీ దాని స్థానంలో అసలు సిసలైన బంగారు కడియం ఎలా పెట్టాలి"..అంటూ ఆలో చించాడు.. "ఏముంది కడియం చిన్నదే కనుక పెద్ద రేటు ఉండకపోవచ్చు.. ఈ నెల రోజులలో తను కూడబెట్టిన డబ్బుతో దానిని సులభంగా కోనవచ్చు" అని మనసులో నిర్ణయించుకున్న రామ దత్తుడు నకిలీ ఇత్తడి కడియాన్ని చేతపట్టుకొని.. తనకు తెలిసిన వారి దగ్గర కూడా కొంత డబ్బు తీసుకుని,తన దగ్గర డబ్బు కూడా పోగుపెట్టి పరుగు పరుగున అంగడికి వెళ్లి.... అదే మాదిరి అసలు సిసలు బంగారు కడియాన్ని కొని తన దగ్గరి నకిలీ ఇత్తడి కడియాన్ని గిరాటు పెట్టాడు. "హమ్మయ్య" అని ఊపిరి పీల్చుకుని.. ఆ రెండవరోజు రాజు గారి ఆస్థానానికి వెళ్ళాడు. రాజుగారు రామదత్తుడుని.. పిలిపించి అతని దగ్గర కడియం తీసుకొని .. అటు ఇటు తిప్పి చూసి కృష్ణచారి గారి చేత..పరిశీలింప చేయించి అది బంగారు ది అని తెలుసుకున్నాడు. రాజుగారు వెంటనే కోపంతో పైకి లేచి.. "మూర్ఖుడా నువ్వు మామూలు మనిషిగా మారా వేమో కానీ నిజాయితీ మనిషిగా మాత్రం లేవు. నేను నీకు నకిలీ ఇత్తడి కడియం ఇచ్చాను. కానీ నేను ఇచ్చినది మార్చి నువ్వు బంగారపు కడియం తెచ్చావు. ఇది రాజద్రోహం.. మా రాజ్యంలో.. కష్టపడే వారితో పాటు.. నిజాయితీ.. స్వచ్ఛత మనస్సు కలిగిన వారు మాత్రమే ఉండవలసి ఉన్నది. కానీ నువ్వు అందుకు విరుద్ధంగా.. అను మానపుబీజం తో.... భయాందోళనలకు లోనయి నేనిచ్చిన కడియం మార్చేసావు. దొంగతనాలు.. దోపిడీలు చేస్తూ బ్రతికిన ఏమాత్రం తప్పులేదు కానీ..... ప్రతి నిమిషం ఇలా... ఇలా... భయాందోళనతో .... భీతితో... అనుమానంతో తన నిజాయితీ మీద తనకే నమ్మకంలేని అసహ్యం బ్రతుకు బ్రతకడం చాలా పెద్ద నేరం....!!!! ఒక దొంగ కన్నా నీలాంటి నిబ్బరమైన మనసు లేని వ్యక్తుల వల్లే ఈ రాజ్యానికి ప్రమాదం... ఎక్కువ.అందుచేత నిన్ను పూర్తిగా క్షమించ లేను. నీకు వేసే శిక్ష ఏమిటంటే ఒక సంవత్సరం నువ్వు రాజ్యం బయట ఉన్న మానసికశిక్షణ రాజప్రాంగ ణాల్లో ..అక్కడివారు శిక్షణలో గడపవలసి ఉంది. తదుపరి మాత్రమే నీకు రాజ్య ప్రవే శము. అంత దనుక నీ భార్యా బిడ్డల బాధ్యత మేం తీసుకుంటాం." అంటూ రాజుగారు హుకుం జారీ చేశారు. సభలో అంతా గ్రహిస్తున్న మామూలు ప్రజానీక మంతా ముక్కున వేలు వేసుకున్నారు. రామ దత్తుడి తికమక ఆలోచనకు అతడిని నిందిం చారు. వెంటనే రామదత్తుడు ని అక్కడి భటులు మానసికశిక్షణ రాజప్రాంగణానికి పంపించే శారు. మౌర్య సామ్రాజ్యంలో ఆర్థిక సంస్కరణల తో పాటు మానసిక స్థితిగతుల మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేదట. అందుకు తగిన శిక్షణ ఆలయాలు కూడా ఉండేవి. చివరలో....రాజుగారు శత్రువులతో యుద్ధం చేసిన తర్వాత ఒకనాటి రాత్రి ఆ యుద్ధ భూమిలో శత్రువుల శవాలను తిరిగి తిరిగి చూసి... మనసు వికలమై,హృదయం ద్రవించి, కళ్ళు చమర్చి... భవిష్యత్తు లో ఇక తను యుద్ధం చేయకూడదని నిర్ణయించుకోవడానికి కూడా... ఇలాంటి సంఘటనలు.... దోహద పడ్డాయి. ఇలాంటి "మానసిక శిక్షణ రాజ ప్రాంగణాలు"... అనుభవం కూడా నేర్పాయి. అందుకనే అశోకుడు .. 'సామ్రాట్'...అయ్యాడు. " అశోక సామ్రాట్ కి జై "

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు