కర్మనుసారం - సుధీర్ ధమ్మా

Karmanusaram

మనం చేసిన కొన్ని కొన్ని తప్పులకి తిరిగి ఏ రూపం లో శిక్ష అనుభవించాల్సి వస్తోంది మనకే తెలియదు అది వచ్చినపుడు మనం తప్పు తెలుసుకొన్న ప్రయోజనం ఉండదు ఇదే నా జీవితం లో జరిగింది. నా పేరు వినయ్ నేనీ hyderabad లో ఒక construction కంపెనీ లో సివిల్ ఇంజనీర్ గా పని చేస్తున్న నాతో పాటు ప్రియ అన్న అమ్మాయి కూడా సైట్ ఇంజినీర్ గా వర్క్ చేస్తుంది ప్రియ గురించి చెప్పాలి అంటే తను చాలా అందం గా ఉంటుంది తన అందాన్ని ఎల పోల్చాలి అంటే తను ఒక్కోసారి office కి leave పెడితే మా office లో బెంగ పెట్టుకొనే మగాళ్లు చాలా మందే ఉన్నారు కానీ అదేంటో నాకు తెలియదు అతి కొద్ది సమయం లోనే ప్రియ నాకు చాలా దగ్గర అయింది మా స్నేహం ప్రేమ అని తెలుసుకోవడానికి మాకు ఎంతో సమయం పట్టలేదు తనకి పెళ్లి సంబంధాలు చూడటం start చేసారు ని గురించి మా ఇంటిలో చెప్పనా అని నన్ను చాలా సార్లు అడిగింది ప్రియ , కానీ నేను ఆ మాట ధటెసే వాడిని ఎందుకంటే మా ఇంటిలో ఒప్పుకొంటారు లేదో అన్న భయం. చాలా మంది చేసే తప్పు ఏంటి అంటే ప్రేమించేటప్పుడు మన ఆలోచాలనలు ప్రేమ వరకు నే ఆగిపోతాయి పెళ్లి గురించి ఆలోచిస్తేయ్ ఎక్కడ ఉన్నా ప్రేమకి ఇబంధులు వస్తాయి అని , కానీ ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది ప్రియ నాతో నేను మా ఇంటిలో ఒప్పిస్తా నువ్వు మీ ఇంటిలో మన ప్రేమ గురించి చెప్పి ఒప్పించు అని అన్నది నేను భయపడుతూనే మా నాన్నకు నా ప్రేమ విషయం చెప్పాను కానీ మా నాన్న వెంటనే ఆ అమ్మాయి caste ఏంటి అని అడిగారు తను మన caste కాదు నాన్న కానీ వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ అని చెప్పాను అయిన మా నాన్న ఒప్పుకోలేదు నన్ను కాకుండా ఆ అమ్మాయి ని నువ్వు పెళ్లి చేసుకొంటే నా శవాన్ని చూస్తావ్ అని అన్నారు జరిగిందంతా ప్రియ కి చెప్పుధం అని తరవాత రోజు ఆఫీస్ కి వెళ్ళాను ప్రియ చాలా ఆనందం గా మా ఇంటిలో ఒప్పుకున్నారు అని అన్నది కానీ మా ఇంటిలో ఒప్పుకోలేదు ప్రియ మా ఇంటిలో వాళ్ళని కాదు అని పెళ్లి చేసుకొంటే చనిపోతాను అని అంటున్నారు అని చెప్పేసా దానికి ప్రియా ఒక అమ్మాయి తన జీవితం మొత్తం ఒక అబ్బాయి తో ఊహించుకొని సడన్ గా తను తన జీవితం లో ఉండడు అంటే దాన్ని ఎలా తీసుకోవాలో నాకు అర్ధం కావడం లేదు అని నన్ను పట్టుకొని చాలా ఏడిచింది మా ఇంటికి వాళ్ళ parents ని తీసుకొని వచ్చి మాట్లాడతాను అని అన్నది ఈ మాటకి నేను ఒకవేళ నువ్వు అలా చేస్తే మా parents మీ ఫ్యామిలీ ని అవమానించి పంపడం తప్ప జరిగే ప్రయోజనం ఏమి ఉండదు అంత కుల పిచ్చి మా నాన్నకు ప్రియ అని నేను అన్న ప్రియ కి ఇంకా ఇందులో చేసేది ఏమి లేదు అని అర్ధం అయింది ఈ విషయం జరిగిన తరవాత ప్రియని నేను కావాలనే దూరం పెట్టడం start చేశా కొన్ని రోజులకు తనకీ అర్ధం అయిపోయి ఆఫీస్ కూడా మారిపోయింది . ప్రియ నాకు దూరం ఐ చాలా రోజులు గడిచి పోయాయి కొన్ని రోజులకి , నాకు మా caste లోనే మా పేరెంట్స్ ఒక సంబంధం తెచ్చి fix చేశారు తన పేరు స్వాతి . స్వాతి , ప్రియ అంత అందం గా లేకపోయినా నాకు తగినది అని నాకు అనిపించింది మా ఇద్దరి engagement చాలా గ్రాండ్ గా జరిగింది మెల్ల మెల్లగా స్వాతి నాకు చాలా దగ్గర అయిపోయింది ప్రియ ని నేను పూర్తిగా మర్చిపోయా నా పెళ్లి కూడా దగ్గర పడింది మన జీవితం లో మనం అంత బాగానే ఉంది అనుకొన్నపుడే ఏదొక సమస్య వస్తుంది అది ఎందుకంటే మనం చేసిన పాపాలు సంతోషం లో మనం మర్చిపోయిన ఆ దేవుడు మర్చిపోడు సరిగ్గా నా పెళ్లి రేపు అనగా మా ఫ్రెండ్స్ నన్ను bachlore పార్టీ ఇవ్వమని అన్నారు ఇంక నేను చేసేది ఏమి లేక సిటీ బయట మా ఫ్రెండ్ కి ఒక గెస్ట్ హౌస్ ఉంటే నేను నా bachlore పార్టీ అక్కడ arrange చేసాను ఆ రోజు నా ఫ్రెండ్స్ బ్రతిమలాడటం వల్ల నేను వాళ్ళతో పాటు డ్రింక్ చేశా రేపు మార్నింగ్ స్టార్ట్ ఐతే మళ్ళీ లేట్ అవుతుంది అని నైట్ 12 ఐన నేను నా కార్ తీసుకొని ఇంటికి స్టార్ట్ ఐపోయాను మందు తాగడం వల్ల కొంచం మత్తుగా ఉంది అయిన పరవాలేదు అనుకోని డ్రైవ్ చేస్తున్న ఆ farm హౌస్ రోడ్ లోంచి highway ఏక్కను నేను ఎంత speed వెళ్తున్నానో నాకు అర్ధం కావడం లేదు రేపు నాకు స్వాతి కి పెళ్లి అని చాలా ఆనందం గా ఉన్నాను తన ఫేస్ ఏ నా కళ్ళ ముందు కనపడుతుంది అలా కొంచం దూరం వెళ్ళాక ఒకేసారి నా కార్ కి ఏదో గట్టిగా తగిలి నట్టు పెద్ద సౌండ్ వచ్చింది నేను కొంచెం ముందుకి వెళ్లి కార్ ఆపి బయటకి దిగి కంగారుగా వెనక్కి పరిగేట్టుకొంటు వచ్చాను వచ్చి చూస్తే ఒక 35 ,38 వయసులో ఉన్న ఒక అతను రక్తపు మడుగులో పడి ఉన్నాడు తనని పట్టుకొని ఎంతో సేపు లెవమని గట్టిగా లేపాను కానీ అతను లేవలేదు నాకు అర్ధం అయిపోయింది తన ప్రాణం పోయింది అని నాకు ఇంకా ఎక్కడ లేని కంగారు మొదలైయ్యింది ఏమి చెయ్యాలో అర్ధం కావడం లేదు పోలీస్ లకి ఫోన్ చేసి జరిగింది అంత చేపదం అని అనుకొన్న బట్ తెల్ల వారితే నా పెళ్లి ఇది చేసింది నేను అని తెలిస్తే చాలా పెద్ద problem అవుతుంది అసలే స్వాతి కి నేను డ్రింక్ చెయ్యను అని చెప్పాను , నా పెళ్లి ఆగిపోతుంది అన్న భయం వెంటనే అటు ఇటు చూసా అదృష్టం ఏంటి అంటే రోడ్ మీద నేను ఈ body తప్ప ఎవరూ లేరు ఎవరు చూడలేదు కాబట్టి ఏ ప్రాబ్లెమ్ ఉండదు అని నేను అక్కడ నుంచి నా కార్ ఎక్కి ఫాస్ట్ గా వెళ్లిపోయా తరవత రోజు నా పెళ్లి , ఇంటిలో అందరూ చాలా ఆనందం గా ఉన్నారు నేను మాత్రం ఆ dead body ఏమీ అయింది అని న్యూస్ చూస్తున్న సరిగ్గా అప్పుడే నగర శివారుల్లో accident కి గురి ఐన ఒక 35 వయసు గలా వ్యకి అతని పేరు మురళి అతను హైదరాబాద్ వాస్తవ్యుడు , accident ఎవరు చేశారో కనిపెడతాం అన్న పోలీస్ లు అని న్యూస్ అది చూడగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి మా ఇంటిలో వాళ్ళు ఎందుకు నువ్వు డల్ గా ఉన్నవు అని అడుగుతున్న నా దగ్గర సమాధానం లేదు సరే పెళ్లి ఐపోయాక accident చేసింది నేనె అని పోలీస్ లకి లొంగిపోదాం అనుకున్నాను. మరి కాసేపట్లో నా పెళ్లి , నేను స్వాతి పెళ్లి మండపానికి వచ్చేసాం ఐన ఏమీ జరుగుతుంది అన్నా భయం పెళ్లి పీటల మీద కూర్చున్నాము నా మనసులో ఒకే ఒక కోరికా దేవుడా ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా చై అని కానీ చేసిన పాపం ఊరికే వదిలి పెడుతుందా కరెక్ట్ గా నేను తాళి కట్టే సమయానికి పోలీస్ లు మండపం లోకి వచ్చారు అంతే అందరూ ఏమి అయింది అని ఒకటే ఆలోచిస్తున్నారు అప్పుడు SI మా నాన్న గారిని పిలిచి 6677 బ్లాక్ కలర్ ఫోర్డ్ కార్ మీదే కదా అని అడిగారు అవును అది మా అబ్బాయి ది అని అన్నారు, మా నాన్న తెగ కంగారు పడుతు సర్ ఏమి జరిగింది అని అన్నారు అప్పుడు ఆ SI రాత్రి మీ అబ్బాయి ఒకడిని accident చేసి చంపేసి ఏమి తెలియనట్టు వచ్చి పెళ్లి చేసుకొంటున్నాడు అని చెప్పాడు అది వినగానే మా నాన్న భయం తో సర్ అస్సలు మీరు ఎవరు అనుకోని ఇక్కడికి వచ్చారు మా నాన్న si తో వాదిస్తుంటే ఇంకా అది అంత చూడలేక ఏది ఐతే అది అయింది అని నేనే తాగి accident చేశా నాన్న అని అన్నాను ఆ మాట బయట ఉన్న స్వాతి వాళ్ళ ఫ్యామిలీ కూడా విన్నారు మా నాన్న ఇంకా చేసేది ఏమి లేకా si తో పెళ్లి అయ్యక వాడే పోలీస్ స్టేషన్ కి వస్తాడు సార్ అని అన్నారు దానికి స్వాతి వాళ్ళ నాన్న ఇది solve అయ్యక పెళ్లి పెట్టుకొందాం అని అన్నారు స్వాతి నా దగ్గరకు వచ్చి నీకు డ్రింక్ చేసే అలవాటు లేదు అన్నావ్ ఇప్పుడు ఇది అంత ఏంటి అని అడిగింది నాకు ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు వెంటనే పోలీస్ లు నన్ను పెళ్లి మండపం నుంచి తీసుకొని వెళ్లిపోయారు పెళ్లి ఆగిపోయింది. నా మీద హిట్ అండ్ రన్ కేస్ ఫైల్ చేసి ఆ రోజు పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు వార్తల్లో ఎట్టకేలకు హంతకుడు దొరికాడు అని మొత్తం సిటీ అంత నా పేరు తెలిసిపోయింది తరవాత రోజు ఆ చనిపోయిన వ్యక్తి భార్య పిల్లలు నా దగ్గరకు వచ్చారు తన పేరు సుశీల చనిపోయిన ది తన భర్త అని తనకి ఇంకా ఏ ఆదారం లేదు అని వాళ్ళ ఇద్దరి చిన్న పిల్లలని చూపించి తాను తెగ ఏడ్చింది తన పరిస్థిది చూసి నేను ఎంత పెద్ద తప్పు చేసానో అని నాకు అర్ధం అయింది ఇంకా నాకు జైల్ శిక్ష తప్పదు అని జీవితం మీద ఉన్న అన్ని ఆశలు వదిలేసుకొన్న మా నాన్న వాళ్ళు వాళ్ళ పరత్నం వాళ్లు చేస్తున్నారు కానీ ఏ ఉపయోగం లేదు కానీ నన్ను రిమాండ్ కి కోర్ట్ కి పంపే ముందు రోజు ఒక వ్యక్తి నన్ను కలవడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చాడు అతని పేరు కృష్ణ ప్రసాద్ ఇతను hyderabad లో ఒక పెద్ద builder నాకు తెలియని విషయం ఏంటి అంటే ఆయన ఒక advocate. ని కేస్ నేను వాదిస్తాను నిన్ను ఈ సమస్య నుండి బయట పడేస్తాను అని అన్నాడు అస్సలు మీరు నా కేస్ వాదించడం ఎంటి సర్ మీకు నాకు అస్సలు పరిచయం కూడా లేదు అని నేను అన్న , దానికి ఆయన నవ్వి న్యాయం నీ వైపు ఉంది అది చాలు అని అన్నాడు ఆయన అన్న మాటలు అర్ధం కాకపోయిన కొంత ధైర్యం నింపాయి తర్వాత రోజు కోర్ట్ కి నన్ను తీసుకొని వెళ్లారు స్వాతి స్టేషన్ కి కనీసం చూడటానికి రాలేదు కోర్ట్ ఐన వస్తుంది అని చూసా కానీ రాలేదు లాయర్ కృష్ణ ప్రసాద్ అన్నట్టు గానే court కి నా తరపు వాదించడానికి వచ్చారు సుశీల గారు ఒక ప్రాసిక్యూషన్ లాయర్ ని పెట్టుకున్నారు judge గారు వచ్చారు వాదన మొదలైంది ప్రాసిక్యూషన్ లాయర్ అయిన సోమా శేఖర్ గారు నేను ఆ రోజు నైట్ ఏమి చేసానో మొత్తం అంత judge గారికి చెప్పారు దానికి judge గారు నువ్వే accident చేసినట్టు ఒప్పుకొంటున్నవా అని అడిగారు అవును సర్ అని నేను అన్న ,నిందితుడి వినయ్ ఏ తన చేసిన తప్పుని ఒప్పుకొన్నపుడు ఇంకా defence లాయర్ కృష్ణ ప్రసాద్ ఏమి వాదిస్తారో నాకు అర్ధం కావడం లేదు అని లాయర్ సోమా శేఖర్ అన్నాడు దానికి కృష్ణ ప్రసాద్ judge గారి తో వినయ్ accident చేసాడు అన్న మాట నిజమే దానికి నేను ఒప్పుకొంటున్న కానీ ఒక్కసారి ఆ body ని further ఎక్సమినేషన్ కి పంపాలి అని నా request అని అడిగారు దానికి లాయర్ సోమశేకర్ judge గారితో already వినయ్ నేనే డ్రైవ్ చేసి accident చేశా అని ఒప్పుకున్న తరవాత కూడా మళ్లీ ఈ request లు ఎందుకు అని అన్నారు కానీ judge హరి ప్రసాద్ గారి రిక్వెస్ట్ కి permission ఇచ్చారు కోర్ట్ సెషన్ ని రేపటికి వాయిదా వేశారు , నాకు అర్ధం కాలేదు హరి ప్రసాద్ గారు body ని examin చెయ్యాలి అని ఎందుకు అన్నారో మళ్ళీ కోర్ట్ సెషన్ స్టార్ట్ అయింది కృష్ణ ప్రసాద్ వాదించడం మొదలు పెట్టారు ఇలా your honour వినయ్ ఆక్సిడెంట్ చేసింది date 19-4-2021 friday టైం నైట్ 12:30 am కి మన రికార్డ్స్ ప్రకారం, కానీ body లోని ప్రాణం forensic department analysis ప్రకారం దానికి 3 hours ముందే పోయింది అంటే ప్రాణం లేని ఒక బాడీ ని గుద్దాడు వినయ్ అని అన్నాడు.ఈ వాదన విన్నాక judge తో పాటు కోర్ట్ లో ఉన్న వాళ్ళు అందరూ షాక్ అయ్యారు ఒక ప్రాణం లేని బాడీ ని మళ్ళీ accident చేస్తే కేస్ ఏంటో నాకు అర్ధం కావడం లేదు అని అన్నారు కృష్ణ ప్రసాద్ judge తో వెంటనే judge ఆ forensic రిపోర్ట్ ని చూసి చాలా ఆశర్యపోయారు సోమా శేఖర్ ఐతే ఆ forensic రిపోర్ట్ ని ఎన్ని సార్లు చూసారో నేను చెప్పలేను అప్పుడు వెంటనే judge హరి ప్రసాద్ ఇచ్చిన రిపోర్ట్ చూశాక అతను ఆక్సిడెంట్ లో చనిపోలేదు అని అర్ధం చేసుకొని నన్ను తాగి డ్రైవ్ చేసి నందుకు మందలించి ఫైన్ వేసి రిలీస్ చేస్తున్న అని తీర్పు ఇచ్చారు . అతను అస్సలు ఎలా చనిపోయాడో further investigation చెయ్యాలి అని పోలీస్ లకి order చేశారు ఆ మాట విన్నాక నా ప్రాణం నాకు తిరిగి వచ్చి నట్టు అయింది మా ఇంటిలో వాళ్ళు ఎంత ఆనంద పడ్డారో నేను మాటల్లో చెప్పలేను కృష్ణ ప్రసాద్ గారికి ఎలా థాంక్స్ చెప్పుకోవాలో నాకు అర్ధం కాలేదు నేను ఈ కేస్ నుండి బయట పడి 4 రోజులు అయింది స్వాతి వాళ్ళు నేను అబద్ధం చెప్పాను అని మ్యాచ్ cancel చేసుకొన్నారు . కొన్ని రోజుల తరవత కృష్ణ ప్రసాద్ గారిని మా ఇంటికి lunch కి invite చేసాను ఆయన వచ్చారు అస్సలు నేను ఆ కేస్ నుండి బయట పడిన తరవత ఏమి అయిందో తెలుసు కొందాం అని ఆయనని అడిగాను దానికి ఆయన ఆ చనిపోయిన అతని పేరు గోపి అస్సలు జరిగిన విషయం ఏంటి అంటే ఆ గోపి భార్య సుశీల కి అతని పక్క ఇంటిలో ఉంటున్న భాస్కర్ కి affair ఉంది అది ఒక రోజు గోపి కి తెలిసి పోయింది సుశీల ని వెళ్లి నిలదీస్తే ఇంకా ఇలాంటి పనులు ఎప్పుడు చెయ్యను అని గోపి తో చెప్పి నువ్వు accident చేసిన 3 హార్స్ ముందు భాస్కర్ తో కలసి ఊపిరాడకుండా తలగడతో నొక్కి చంపేశారు మరి ఇంటిలో సడన్ గా చనిపోతే వాళ్ళ మీదకి వస్తుంది అనుకొన్నారేమో ఆ బాడీ ని భాస్కర్ కార్ లో బయటకి తీసుకొని వచ్చి ఆ చీకట్లో హైవే మీద వెళ్తున్న ఏ కార్ కిందో తోసేస్తే ఆక్సిడెంట్ అని కేస్ close చేస్తారు అని అనుకున్నారు నీ దురదృష్టం ఆ కార్ నీది అయింది అని చెప్పారు ఇది అంత విని ఒక్కసారి నేను ఊపిరి పీల్చుకొని కృష్ణ ప్రసాద్ గారితో కానీ నా అదృష్టం ఏంటీ అంటే మీరు నా కేస్ టేక్ up చెయ్యడం అస్సలు మీరు నాకు అస్సలు తెలియదు ఎలా ఈ కేస్ టేక్ up చేశారు అని నేను ఆయనని అడిగాను దానికి ఆయన నిన్ను ప్రేమించిన ప్రియ నా భార్య నువ్వు work చేస్తున్న company లో job మనేసాక నా కంపెనీ లో జాయిన్ అయింది తను నాకు నచ్చి నేను వెళ్లి propose చేస్తే తను నాకు నీ గురించి చెప్పింది నేను అది accept చేస తరవత మా marriage జరిగింది కొన్ని నెలల తరవత నువ్వు ఈ problem లో ఉన్నావ్ అని తెలిసి నన్ను ని కేస్ టేక్ up చెయ్యమని నన్ను అడిగింది అందుకు నేను నీ కేస్ వాదించాను ఇప్పుడు నా భార్య happy తను హ్యాపీ ఐతే నేను happy సరే నేను వెళ్లి వస్తా అని ఆయన వెళ్లిపోయారు కానీ ప్రియ విషయం లో నేను చేసినది ఎంత తప్పో నాకు అప్పుడే అర్ధం అయింది అస్సలు జరిగిన విషయం ఏంటి అంటే ప్రియ మన ప్రేమ విషయం మా ఇంటిలో నేను చెప్తా నువ్వు మీ ఇంటిలో చెప్పు అన్నది కానీ నేను ఆ రోజు మా ఇంటిలో చెప్పలేదు ఎందుకంటే నాకు స్వాతి match వచ్చింది స్వాతి ప్రియ మీద చాలా డబ్బునది దానికి ఆశపడి ప్రియ కి మా ఇంటిలో catse ప్రాబ్లెమ్ అని చెప్పి వదిలేసా ఆ పాపమే నన్ను ఇలా చుట్టుకొంది మళ్ళీ ప్రియ వల్లే దనిలోంచి బయట పడ్డ తనకి నేను నా మొహం కూడా తిరిగి చూపించుకోలేను కానీ ఇప్పుడు నేను చెయ్యగలిగినది ఒకటే తను బాగుండాలి అని కోరుకోవడం.

మరిన్ని కథలు

Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి