అంగ్ల నడక-పింగ్లనడక. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

Angla nadaka pingla nadaka

అడవిలో రోజుకు ఇరవై గంటలు నిద్రపోయే సింహారాజుకు అరోగ్యం బాగాలేకపోవడంతో తనగుహవదలి వెలుపలకు చాలారోజులుగా రాలేదు.ఇదే అదనుగా భావించిన నక్కమంత్రి తనను రాజుగా ప్రకటించుకున్నాడు. దుర్మార్గుడైన నక్కమంత్రికి ఎదురు చెప్పలేని జంతులుఅన్ని భయంతో మౌనంవహించాయి.
తెలివైన కుందేలు " అయ్య అనుభవజ్ఞులైన తమరు మాకురాజుగా ఉంటే మాఅందరికి రక్షణ కలుగుతుందని నమ్ముతున్నాం. మరి ఈఅడవికి రాజు కావాలి అంటేతమకు అంగ్ల నడక,పింగ్లనడక తెలిసిఉండాలికదా?"అన్నడు అతివినయం ప్రదర్శిస్తూ కుందేలు.
కుందేలు వినయ విధేయతకు పొంగిపోయిన నక్క" ఏమిటి అంగ్లనడక, పింగ్లనడక అంటే ఏమిటి? అవినాకు తెలియలేదే! "అన్నాడు నక్క."ఓహా సింహారాజుగారు తమకు చెప్పలేదన్నమాట.అవిషయం తమకు చెపితే ఏనాటికైనా తమరు వారికి పోటీదారులు అవుతారనికాబోలు,అదేం పెద్ద విషయంకాదు అడవి వెలుపల తమరికి కొద్దిసేపట్లో నేను నేర్పిస్తాను.కాని దానికి మొదటి నియమం తమరు తలదించకుండా నన్ను అనుసరించండి రాజుఎవ్వరికి తలవంచడుకదా! అందుకే తమరు తలఎత్తుకుని మహరాజ ఠీవితో నడవండి "అన్నది కుందేలు.
"అలాగే"అని గెంతుతూ,ఎగిరి దూకుతూ వెళుతున్న కుందేలును అనుసరించసాగింది ఆకాశన్నే చూస్తూనక్క. అలా కొంతదూరం వెళ్ళాక ఆకాశాన్నే చూస్తున్న నక్క తనకళ్ళముందుఉన్న బురదగుంటలో (ఊబి)దిగబబింది."ఏయ్ కుందేలు అల్లుడు నువ్వుచెప్పినట్లు ఆకాశాన్నే చూస్తూ నడవడంవలన ఈ బురదగుంటలో చిక్కుకున్నాను.నన్ను ఎలాగైనాకాపాడు"అన్నది నక్క.
"బుద్దిహీనుడా ఎవరు ఏదిచెపితే అదినమ్మడమేనా? ముందుచూసి నడవకపోతే ప్రమాదం అనితెలియదా! ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు మనల్నిమనం కాపాడుకునే ప్రయత్నంచేస్తాం.ఎవరోవస్తారు మనల్ని కాపాడుతారు అని ఎదురు చూడకూడదు.నిన్నునువ్వు కాపాడుకోలేవు మా అడవిలోని జంతువులను ఏంకాపాడతావు? ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగావుకదా! అంగ్ల నడక, పింగ్ల నడక ఏమిటని ఆలోచించివా? ఎవరినైనా పెద్దలను విచారించావా?స్ధాయికి మించిన కోరికలు కోరుకుంటే ఇలాంటి ఆపదలే సంభవిస్ధాయి ఏప్రాణికైనా!, ఏనుగంత ఆహారం మనం తినగలమా? నీటిలోని మొసలిలా నెలలతరబడి ఆహారం లేకుండా ఉండగలమా? దేని జీవితం దానిదే! ఎవరివిలువవారిదే.స్ధాయికి మించిన కోరికలు ఎప్పుడూ ఆపదలకే దారితీస్తాయి. ఆశ కి, దురాశకి వత్యాసం తెలుసుకోలేనినువ్వు రాజు పదవికి అనర్హుడివి.మనస్ధాయి కోరికలు కోరుకోవడం ఆశ.మనస్ధాయికి మించిన కోరికలు కోరుకోవడం దురాశ. నీలాంటి దురాశా పరులకు తగిన శిక్షేఇది.నిన్నుచూసైనా ఇతర దురాశాపరులు బుద్ది తెచ్చుకుంటారు"అన్నది కుందేలు."నిజమే వీడు కొయ్యరాని కొరక" అంది పిల్లరామచిలుక."అంటే"అన్నది కుందేలు"అంటే వీడు కొరకరానికొయ్య"అని సరిచేసింది తల్లిరామచిలుక.
పిల్లరామచిలుక మాటలకు నవ్వుకుంటూ తనదారిన తాను ఆహారం వెదుకుతూ వెళ్ళిపోయింది కుందేలు.
ఆరోగ్యం కుదుటపడిన అనంతరం తల్లి రామచిలుకద్వారా విషయం తెలుసుకున్న సింహారాజు కుందేలును తన మంత్రిగా నియమించుకున్నాడు.

మరిన్ని కథలు

Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి