దేశం కోసం - కందర్ప మూర్తి

Desam kosam

" అమ్మా ! నేషనల్ డిఫెన్స్ అకాడమీ సెలక్షన్ కి యు.పి.యస్.సి నోటిఫికేషన్ వచ్చిందే. నా గ్రాడ్యుయేషన్ అయిపోయిందిగా. నేను తాతయ్య, నాన్నలా ఆర్మీలో చేరి దేశసేవ చేస్తాను. గత సంవత్సరం దేశ సరిహద్దు లడాక్ గాల్వాన్ లోయ వద్ద చైనా సైనికులతో ఘర్షణలో నాన్న అతి దారుణంగా చంపబడి అమర వీరుడిగా ఇంటికి వచ్చారు. సైనిక లాంఛనాలతో ఎంతో గౌరవం కలిగింది ఆయనకు. ఆ సంఘటన ఇప్పటికీ నా మనసులో మెదులుతోంది. 1962 సం.లో స్నేహమంటూనే దేశ సరిహద్దుల్లో చైనా సైన్య దాడిలో తాతయ్య కాలు పోగొట్టుకుని వికలాంగుడిగా సైన్యం నుంచి పదవీ విరమణ చెయ్య వల్సి వచ్చింది. ఉన్న ఒక్క కొడుకును చదువు లేనందున కింది స్థాయి సైనికుడిగా ఆర్మీకి పంపితే నాన్న హవల్దార్ ర్యాంక్ వరకు చేరుకున్నారు. నన్ను డిగ్రీ చదివించి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేర్పించి సైనిక ఆఫీసర్ హోదాలో చూడాలనుకునే వారు. నేను ఆయన కళ్ల ముందే సైనిక కుటుంబ వాతావరణంలో పెరిగిన వాడిని.నాకూ ఆర్మీలో ప్రవేసించి దేశ సేవలో జీవితం గడపాల నుండేది. నాకు ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. తాతయ్య, నాన్నలా నా కర్తవ్యం కొనసాగిస్తాను" గౌతం కుమార్ తల్లికి తన కోరిక చెప్పేడు. " వద్దురా బాబూ , మిలిటరీ జీవితమంటేనే భయమేస్తోంది దిన దిన గండం. ఎప్పుడు చావు ముంచుకొస్తుందో తెలియదు. దేశ సరిహద్దులో పోస్టింగు అయినందున మీ నాన్న శలవులో వచ్చి మనతో గడిపి డ్యూటీకి వెళ్లిన కొద్ది రోజుల్లోనే ఆయన చనిపోయారన్న పిడుగులాంటి వార్త వినవల్సి వచ్చింది. ఉన్న ఒక్కడివి నువ్వూ ఆర్మీకి పోతానంటే దిగులుగా ఉంది."అమర జవాను మాజీ హవల్దార్ వేణుగోపాల్ భార్య దేవకి కొడుకుతో అంది. " అమ్మా , నాన్న గారి కోరిక నెర వేరుస్తాను.ఆర్మీలో చేరి ఆఫీసర్ గా దేశసేవ చేస్తాను. సైనికుడంటేనే సాహసం. చావు ఎక్కడైనా రావచ్చు. చావుకు భయపడితే దేశ రక్షణ దళాల్లో ప్రవేసించే దెవరు? నన్ను ప్రోత్సహించి ఆశీర్వదించు " తల్లిని వేడుకున్నాడు గౌతంకుమార్. చేసేది లేక దిగులుగానే ఒప్పుకుంది దేవకి. ఆనవాయితీ ప్రకారం అప్లికేషను నింపి ఇంటర్వ్యూకి అటెండై అన్ని ఎగ్జామ్స్ లో పాసయి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశం పొందాడు గౌతంకుమార్. ముందుగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఖడక్ వల్స(పూణె) లో మిలిటరీ ట్రైనింగ్ పూర్తయి ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ లో గ్రాడ్యుయేషన్ పొంది అన్ని ఈవెంట్స్ లో బెస్టు కేడెట్ గా ఆర్మీ జనరల్ చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నాడు ఆర్మీ లెఫ్టినెంట్ గౌతంకుమార్. మాజీ హవల్దార్ వేణుగోపాల్ భార్య వీరనారి దేవకిని ఎంతో ఆదరణగా వి.ఐ.పి ల గ్యాలరీలో కూర్చోబెట్టి ఘనంగా సత్కరించారు ఆర్మీ అధికారులు.. తన కొడుకును హోదా గల ఆఫీసర్ గా చూసి మురిసి పోయింది దేవకి. "మేరా భారత్ మహాన్" * * *

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు