బంధం - B.Rajyalakshmi

Bandham
“ కొత్త ఆపీసర్ శానా మంచోడే “ అన్నాడు నర్సయ్య .
“అది కాదయ్యా ,అయన వచ్చి వారం కూడా కాలేదు .అప్పుడే మంచోడో ,చెడ్డోడో తెలిసిందా నీకు “వెటకారం గా అదోరకం గా నవ్వుతూ పసిబిడ్డకు కొంగు చాటున పాలిస్తూ అన్నది నర్సమ్మ .
“నీదంతా చోద్యమే పిల్లా ..ఒకసారి చూస్తే తెలిసిపోతుంది గదే !మంచీ,సెడ్డ !” అన్నాడు నర్సయ్య .
“ అయితే ఆయన లో ఏం చూసి మంచోడు అంటున్నావు ?” ప్రశ్నించింది నర్సమ్మ .
“పాత ఆపీసర్లు కోపం గా మాట్లాడేవాళ్లు .యీయన నవ్వుతూ పలకరిస్తాడు ,మాట్లాడుతాడు “ అన్నాడు నర్సయ్య .
“ఒక్కడే రాలేదు ,పొట్ట తో వున్న అమ్మగారిని కూడా తెచ్చుకున్నాడు .”అన్నాడు నర్సయ్య .
“గొప్పే ! పెళ్లాన్ని వెంట తెచ్చుకోడం కూడా గొప్పేనా “అన్నది నర్సమ్మ .
నర్సమ్మ ఆలా అనడం నర్సయ్యకు నచ్చలేదు .
“సర్లే ! కూడు పెట్టు ,తొరగా పోవాలి “ అన్నాడు నర్సయ్య .
“ కొంచెం ఆగవయ్యా పసిబిడ్డ పాలు తాగుతుంది కదయ్యా” అన్నది నర్సమ్మ .
“నువ్వు లేవకు నేనే పెట్టుకు తింటా “ అంటూ నర్సయ్య లోపలికి వెళ్లాడు . “కడుపు నిండా తినయ్యా .తిని తొంగో “ అంటూ మొగుణ్ణి ప్రేమ గా చూసింది నర్సమ్మ .
—————————————————————————-/—-/—-/——————————
నర్సయ్య కంచం లో అన్నం వడ్డించుకుని కూర్చున్నాడో లేదో ముద్ద నోట్లో పెట్టుకోబోతున్నాడు ,అంతే.
“ఆపీసర్ సారు నిన్ను అర్జెంటు గా పిల్చుకు రమ్మన్నాడు నర్సయ్యా “అంటూ శీనయ్య లోపలికి వచ్చాడు . శీనయ్య ఆఫీసు కు ,ఆఫీసర్ యింటికీ. కాపలాదారు .అతని గుడిసె ఆఫీసరు యింటి వెనకే వుంది .శీనయ్యకు గేదెలు వున్నాయి .అవి పక్కన పశువుల పాకలో వుంటాయి .పాలు పితకటానికి ,దాణా వెయ్యడానికి పనివాణ్ణి పెట్టుకున్నాడు శీనయ్య .
ఠక్కున ముద్ద కంచం లో పెట్టేసి చెయ్యికడుక్కున్నాడు .అది చూసి నర్సమ్మ చివుక్కుమంది .
“ అదేమిటయ్యా ,కంచం మీంచి లేచావు !! తినిపో , అసలే ఆకలితో వున్నావు “ నర్సమ్మ అరుస్తూనే వుంది ,నర్సయ్య వినిపించుకోకుండా కండువా భుజం మీద వేసుకుని శీనయ్య తో కలిసి వెళ్లాడు .
———————————————————————————————————
ఆ వూరి పంచాయతీ ఆఫీసుకు శివరాం కొత్తగా బదిలీ మీద వచ్చాడు .ఆఫీసు దగ్గరే అతనికి క్వార్టర్ కేటాయించారు .నర్సయ్య ను అతనికి ప్యూన్ గా నియమించారు .శివరాం తెలివి గా నవ్వుతూ నర్సయ్య తో అన్ని పన్లు చేయించుకుంటాడు .నర్సయ్య కూడా ఆ నవ్వులను ఆపిసరు మంచితనం అనుకుంటూ గొడ్డు లాగా ఆపీసు పనీ ,యింటి పనీ రాత్రీ పగలూ తన యిల్లు కూడా పట్టించుకోకుండా చాకిరీ చేస్తాడు . నర్సయ్య శివరాం యింటి. ముందు నించున్నాడు .శీనయ్య తన గుడిసె కు వెళ్లిపోయాడు .
శివరాం భోజనం చేసి బయటకు వచ్చి నర్సయ్యను చూసాడు .ఒక నవ్వు నవ్వాడు .నర్సయ్య మురిసిపోతూ శివరాం. కు దండం పెట్టాడు .శివరాం నర్సయ్య ను ‘ అన్నం తిన్నావా ‘ అని అడగలేదు ,నర్సయ్య చెప్పనూ లేదు
“నర్సయ్యా. మనం యిప్పుడు మా అత్తగారి వూరెళ్ళాలి . జీపు వస్తుంది . ఒక వారం రోజులుండాలి అక్కడ . యింట్లో చెప్పేసి బట్టలు తెచ్చుకో , వెళ్లి తొందరగా రా” అన్నాడు శివరాం . నర్సయ్య మళ్లీ యింటికి బయల్దేరాడు .
“ అయ్యగారు ,అమ్మగారి తో కలిసి అమ్మగారి పుట్టింటికి వెళ్లాలి .వారం రోజులుండాలిట . బట్టలు తెచ్చుకోమన్నాడే “ అన్నాడు నర్సయ్య నర్సమ్మతో . హడావిడిగా అన్నం తినేసి బట్టలు సంచీ లో పెట్టుకుని బిడ్డను ముద్దుపెట్టుకుని శివరాం యింటికి వచ్చాడు .జీపు వచ్చేసింది . డ్రైవర్ వచ్చేసాడు . నర్సయ్యా వెనక కూర్చున్నాడు . శివరాం ,అతని భార్య లత ముందు కూర్చున్నారు .మిట్టమధ్యాహ్నం యెండ తీవ్రం గా వుంది . నర్సయ్య అన్నం. కొంచమే తినొచ్చాడు . మళ్లీ యేదో తినాలనిపిస్తుంది . శివరాం ,లత మధ్య మధ్య. పళ్లు తింటున్నారు కానీ నర్సయ్యను కనీసం ‘కావాలా ,తింటావా ‘ అని అడగను కూడా అడగలేదు . నర్సయ్య. నోరు. కట్టుకుని కూర్చున్నాడు ! పొట్టలో పేగులు గోల పెడ్తున్నాయి .
సాయంకాలం సుమారు నాల్గింటికి డ్రైవర్ పెట్రోల్ బంక్ దగ్గర జీపు ఆపి పెట్రోల్. కొట్టించాడు .ఆ జీపీ నయం ,యీ నర్సయ్య ఒట్టి మూర్ఖుడు ,అనుకున్నాయి అతని. కడుపు లో. పేగులు .కనీసం జీపు కడుపు లో వున్నా బాగుండేది అని. యేడ్చాయి .శివరాం అత్తవారి ఊరెళ్ళేటప్పటికి చీకటి పడింది .అత్తగారూ మామగారూ అల్లుడి. దర్జా కు మురిసిపోయారు .డ్రైవర్ కూడా అక్కడే వున్న చుట్టాలింటికి వెళ్లిపోయాడు .నర్సయ్యను వాకిట్లో పడుకోమన్నారు .కనీసం తిండీ తిప్పలూ
కనుక్కోలేదు .వాళ్ల భోజనాలయ్యాక అప్పుడు గుర్తుకొచ్చి విస్తట్లో అన్నం , పచ్చడీ ,ప్లాస్టిక్ గ్లాసులో మజ్జిగా. సత్తుగ్లాసులో నీళ్లు పెట్టి చింకి చాప యిచ్చి వరండాలో పడుకోమన్నారు .
ఆ రాత్రి లతకు నొప్పులు రావడం తో. హాస్పిటల్ లో జాయిన్ చేసారు .నిద్రాహారాలు మాని వాళ్లు చెప్పిన పనల్లా చేసాడు నర్సయ్య .శివరాం దంపతులకు మగ పిల్లాడు పుట్టాడు .నర్సయ్య మహా సంతోషపడ్డాడు .’అయ్యగారు చాలా మంచోడు ‘ అని మరీ మరీ అనుకున్నాడు .తనెంతో యిష్టం కాబట్టే యిలాంటి సమయం. లో తనను దగ్గరుంచుకుని అన్ని పన్లు చెప్తున్నారు .మరి ఆకలి దప్పుల మాటేమిటి ?అవసరం వచ్చినప్పుడు అవన్నీ ఆలోచించకూడదుగా ! వాళ్లకు వీలైనప్పుడు నర్సయ్యకు తిండి పెట్టేవారు . నర్సయ్యకు అంతా తనవాళ్లే !
తన పెళ్ళాం నర్సమ్మ కు నొప్పులొచ్చినప్పుడు అసలు వూళ్లోనే లేడు .అంతకు ముందు వున్న ఆపీసర్లు వాళ్ల ‘మందుల ‘ కోసం పక్క వూరికి పంపారు .నర్సయ్యకు పెళ్ళాం నొప్పుల ఆలోచనే తట్టలేదు . తిరిగి వచ్చేటప్పటికి నర్సమ్మ ఆడబిడ్డను కనేసింది . నెలల బిడ్డ యిప్పుడు . తల్లి పాలే తాగుతున్నది . నాలుగు రోజుల తర్వాత శివరాం , నర్సయ్యా జీపు లో తిరిగి శివరాం యిల్లు చేరారు .
వస్తూనే “నర్సయ్యా. ఒళ్లంతా నొప్పులుగా వున్నాయిరా , కాస్త ఒత్తు “నవ్వుతూ నర్సయ్యను చూసాడు .ఒక గంట సేపు శివరాం వొళ్ళు పట్టి చీకటి పడ్తుంటే యిల్లు చేరాడు .పీక్కు పోయిన మొహం , గుంటలు పడ్డ కళ్లు అట్టలు కట్టిన జుట్టు చూసి నర్సమ్మ. కు యేడుపొచ్చేసింది . బిడ్డ నిద్రపోతున్నది . వేణ్ణీళ్లు పెట్టింది . మొగుడికి శుభ్రం గా రుద్ది స్నానం చేయించింది . వేడి వేడి గా వంట చేసి తనే ముద్దలు కలిపి పెట్టింది .పెళ్ళాం సేవలో వారం రోజుల కష్టం మర్చిపోయాడు నర్సయ్య . నర్సమ్మను ముద్దు పెట్టుకుని చింకి చాప మీద గురక పెడుతూ నిద్రలోకి జారిపోయాడు . ఇంత వెర్టిబాగులోడు , అమాయకుడు ఎట్ట బతుకుతాడో అనుకుంది నర్సమ్మ . తన మొగుడి మెతకతనం చూసి. ఆపీసర్లు అన్ని పనులూ చేయించుకుంటున్నారు అని బాధపడింది . ఆపిసరు పెళ్లానికి. కొడుకు. పుడితే తన మొగుడి చేత అడ్డమైన చాకిరీ చేయించుకోవడం యెందుకు అని నర్సమ్మకు బాగా కోపం వచ్చింది .
———-/
————————————————————————————————————
మూణ్ణెల్ల తర్వాత భార్య లత పిల్లాణ్ణి తీసుకుని శివరాం దగ్గరకు వచ్చింది , పిల్లాడికి తన పాలు సరిపోవడం లేదని చెప్పింది . ఎవరైనా పాలిచ్చే పసి బిడ్డ తల్లిని చూడమని భర్తకు చెప్పింది . శివరాం శీనయ్యను అడిగాడు . శీనయ్య నర్సయ్య. పెళ్ళాం నర్సమ్మ పేరు చెప్పాడు . అంతే శివరాం నవ్వుతూ నర్సయ్యకు విషయం చెప్పి నర్సమ్మను పంపమన్నాడు . వెర్రిబాగుల నర్సయ్య ఆపిసరు సారు కొడుక్కి తన పెళ్ళాం పాలు యివ్వడం అంటే చాలా అదృష్టం అనుకున్నాడు .
శీనయ్య అప్పుడే యీనిన కొత్త గేదెను దూడ తో సహా తెచ్చి జీతగాడిని పశువుల పాకలో గుంజ కు కట్టమన్నాడు ! జీతగాడు గట్టి. పలుపుతాడుతో కట్టేసాడు .దూడను యెదురు గుంజకు కట్టేసాడు . తల్లి గేదెను ,దూడను విడి విడి గా యెదురెదురుగా కట్టేసాడు
నర్సయ్య. నర్సమ్మ తో అంతా చెప్పాడు .
“అయితే నన్నేం చెయ్యమంటావయ్యా “అడిగింది నర్సమ్మ .
“ ఆపిసరు గారి బిడ్డకు పాలిచ్చే అదృష్టం అందరికీ రాదే “ అంటూ భార్యను ఒప్పించే ప్రయత్నం చేసాడు నర్సయ్య ,
“ మన బిడ్డకు పాలివ్వకుండా ఆ బిడ్డకు యివ్వడమేంటయా ,శీనయ్యకు గేదెలున్నయ్యి కదయ్యా , ఆ పాలు యివ్వొచ్చు గా “ అంటూ నర్సమ్మ ఒప్పుకోలేదు కానీ ప్రయోజనం లేకపోయింది . మర్నాడే నర్సమ్మను ఆపిసరు గారింటికి తీసికెళ్లి. లత ముందు నిలబెట్టాడు నర్సయ్య .లత నర్సమ్మను ఆపాదమస్తకం ఒకటికి రెండు సార్లు నిశితం గా పరీక్షించింది .
“నర్సయ్యా నీ పెళ్లాన్ని యిక్కడే వుంచి నువ్వెళ్లిపో “అన్నది లత .సరేనని తలూపి నర్సమ్మను అక్కడే వుంచేసి వెళ్లిపోయాడు నర్సయ్య . నర్సమ్మకు దుఃఖం ఆగలేదు .పసిబిడ్డను వదిలి వచ్చింది .
“ఇంకా నిలబడ్డవేమిటి ? యింటి వెనక బావి దగ్గర శుభ్రం గా స్నానం చేసిరా ,యిదిగో యీ చీర కట్టుకుని రా “ అంటూ లత నర్సమ్మను తన పిల్లాడికి పాలిచ్చేందుకు సిద్ధం చేసింది .కింద కూర్చుని నర్సమ్మ ఆ పసివాడికి తన పాలు పట్టింది .లత పక్కన కుర్చీ వేసుకుని కూర్చుంది .లోకం తెలియని ఆ పసికూన కడుపునిండా పాలు. తాగి నర్సమ్మ ఒళ్లోనే నిద్రపోయాడు .లత ముఖం చిట్లించుకుంటూ పిల్లాణ్ణి యెత్తుకుని మెత్తటి పరుపు మీద పడుకోబెట్టింది .
ఇక వెళ్తా అన్నట్టుగా లేచి నిలబడింది నర్సమ్మ .
“అమ్మగారూ. యింటికెళ్లానమ్మా “అన్నది నర్సమ్మ .
లత కోపం గా “యెక్కడికెళ్తావ్”అంటూ అరిచింది .
“ఇంట్లో నా పసి బిడ్డకు నా పాలియ్యలమ్మా !అది యేడుస్తావుంటది “అన్నది నర్సమ్మ గుడ్లల్లో నీళ్లతో .
“ఏమిటీ నీ బిడ్డకు పాలిచ్చి ,ఆ యెంగిలి పాలు నా బిడ్డకిస్తావా !వీల్లేదు ,నువ్విక్కడే వుండాలి .మీ యింటికెళ్లడానికి కుదరదు .మా ఆయనకు చెప్పి నీ మొగుడికి డబ్బులిప్పిస్తాను ,పాల ప్యాకెట్లు కొనుక్కుని నీ బిడ్డకు పాలు పడతాడు మీ ఆయన “అంటూ కసురుకుంది లత నర్సమ్మను .
ఇంటి వెనకాల ఒక గదిలో నర్సమ్మను కట్టడి చేసింది లత .నర్సమ్మ కదలికలను ఒక కంట కనిపెడ్తున్నది .
శీనయ్య జీతగాడు గేదెలకు దాణాపెట్టేటప్పుడు పాలిచ్చే వాటికీ మంచి పచ్చగడ్డి , పోషకాల దాణా పెడతాడు . పాలివ్వని గేదెలకు యెండు గడ్డి , అంతగా పోషకాలు లేని దాణా పెడతాడు .పాలు పితికే ముందు పొదుగు బాగా కడుగుతాడు , పుష్టిగా దాణా పెట్టి పాలచెంబు పట్టుకుని కూర్చుంటాడు .
లత నర్సమ్మకు విస్తరి నిండా రకరకాల రుచికరమైన , పోషకాహారాలు చ్రయించి మరీ పెట్టించింది .తన పిల్లాడికి పాలు యివ్వాలిగా నర్సమ్మ , అదీ లత స్వార్ధం .కానీ నర్సమ్మ కు ఒక్క ముద్ద కూడా తినాలనిపించలేదు ,ఏడుస్తున్న తన పసిబిడ్డ కళ్లల్లో మెదిలింది .గుండె పిండినట్టయ్యింది . పారిపోవాలనిపించింది .కానీ పోలేదు .అన్నం మొత్తం అలాగే చెత్తకుప్పలో విసిరేసింది .శబ్దం రాకుండా బిడ్డను తల్చుకుని కుళ్లి కుళ్లి యేడ్చింది .
ఆ సాయంత్రం
పశువుల పాకవైపు చూస్తూ నిలబడింది దూడను గుంజకు కట్టేసి జీతగాడు పాలు పితకడానికి కూర్చున్నాడు .గేదె ముందు దాణా వుంది .గేదె దాణా చూడడం లేదు.యెదురుగా గుంజకు కట్టిన దూడనే గేదె చూస్తున్నది . తల్లి మనసు కదా !పొదుగు కడిగి ధారగా పాలు పిండుతున్నాడు .దూడ ఆకలిగా జాలిగా గేదెను చూస్తున్నది . గేదె మౌనం గా యేడుస్తున్నది.
ఆ గేదెను, దూడను చూస్తుంటే నర్సమ్మకు తన బిడ్డ ముఖం కళ్లముందు నిలిచి దుఃఖం ఆపుకోలేకపోయింది .ప్రస్తుతం తన బతుకు గుంజకు కట్టిన గేదె బతుకు లాగా వుంది ,అనుకుంది .గది లో చింకి చాప మీద పడుకుంది కానీ నిద్ర పట్టడం లేదు .దీనంగా చూస్తున్న దూడ ,,యేడుస్తున్న తన పసిబిడ్డ తల్చుకుని గుండె చెరువయ్యింది .మెల్లగా తలుపులు తీసి వెళ్లిపోదామని అనుకుంది. కానీ శివరాం గదిలో పసివాడి యేడుపు, అన్ని లైట్లు వెలగడం చూసి భయం తో గదిలోకి వెళ్లి తలుపులు మూసేసుకుంది .
———————————————————————————————————————
ఒక రోజు బిడ్డను తీసుకుని నర్సయ్య వచ్చాడు .నర్సమ్మకు వూపిరి వచ్చినట్లయ్యింది . గబగబా బిడ్డను గుండెకు హత్తుకుని పాలు పట్టబోయింది . లత యెక్కడినుంచిచూసిందో యేమోపరుగెత్తుకుంటూ వచ్చింది .
“ ఏం చేస్తున్నావే ,బుద్ధిలేనిదానా ,నా బిడ్డకు యెంగిలి పాలిద్దామనుకుంటున్నావా !ఒరేయి నీ బిడ్డను తీసుకెళ్లిపో , అయినా పెళ్లాన్ని చూడకుండా వుండలేవా “గట్టిగా కసిరింది లత . పాపం నర్సయ్య తలొంచుకుని బిడ్డను యెత్తుకుని వెళ్లిపోయాడు . బిడ్డ అమ్మను వదల్లేదు . నర్సయ్య బలం గా లాక్కుని తీసుకెళ్లిపోయాడు .
నర్సమ్మ పశువుల పాకనేచూస్తున్నది .దూడ చిక్కిపోతున్నది .డొక్కలు యెండిపోతున్నాయి .గేదె పాలు చెంబులు చెంబులు నిండుతున్నాయి .శీనయ్య కు. సిరి పెరుగుతున్నది .
ఒక రోజు సాయంకాలం
గేదె ముందు దాణా. పెట్టి ఎదురుగుండా గుంజ. కు దూడను కట్టేసి జీతగాడు పాలు పితకటానికి చెంబు తో. కూర్చున్నాడు . కానీ గేదె యెదురుతిరుగుతున్నది ! పొదుగు మీద చెయ్యి వెయ్యగానే తన్నబోతున్నది . పాలు పితకనివ్వడం లేదు . గుంజను లాగీ లాగీ తాళ్లు తెంచుకుని దూడ దగ్గరకు పరుగెత్తింది . దూడ తల్లి పొదుగు పట్టుకుని పాలు ఆత్రం గా తాగింది . గేదె దూడను ప్రేమగా నిమిరింది . ఇదంతా చూస్తున్న నర్సమ్మకు కళ్లు చెమర్చాయి .
రాత్రంతా నిద్ర పట్టలేదు నర్సమ్మకు .తాళ్లు తెంపుకున్న గేదే పదే పదే తన కళ్ల ముందు నిలబడ్డట్టుగా అనిపించింది .తన పాలు తన కన్నబిడ్డకు పట్టలేని బతుకూ ఒక బతుకేనా ! తన మొగుడికి చెప్పినా అర్ధం కాదు .ఆ గేదె కు వున్న ధైర్యం తనకు లేదా ! నోరు లేని పశువే తన దూడ కోసం తాళ్లు తెంపుకుంది .అన్నీ వున్న తనకు అంత పిరికితనమెందుకు ? మహా అయితే నర్సయ్య వుద్యోగం పోతుంది ! కూలీచేసుకుని స్వతంత్రం గా బతకొచ్చు ! ఈ బానిస బతుకెందుకు ! నర్సమ్మ కు మొండి ధైర్యం ,తెగింపు వచ్చింది .అంతే తలుపులు తెరిచి బయటకు వచ్చింది .ఇంకాతెల్లవారలేదు .సూర్యోదయం లో నర్సమ్మ తన వెలుగును చూసుకోవడానికి నవ్వుతూ తన యింటికి అడుగులు వేసింది .
—————————————————/—————————————————————-

మరిన్ని కథలు

Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి