మన్నించుమా! - రాము కోలా.దెందుకూరు.

Manninchumaa

పెళ్ళి జరగడానికి ఇంకా పది గంటల సమయమే ఉంది. ఇది పోలీసులకు తెలిస్తే.. ఎన్నో ఆశలతో పెళ్ళి మండపం చేరవలసిన జంట పరిస్థితి ఏంటి. కన్నులు మూతపడుతున్నాయ్........ "అసలు మావారిని అనాలి..." "ప్రతి సారి వెనకేసుకు రావడమే.." "పాపం పిల్లలు గల్లది అంటూ.." "ఇప్పుడు చూడండి ఏం జరిగిందో?" "దాన్ని నమ్ముకుని ,మరేవ్వరికి ఈ పని ఆప్పగించక పోవడం నా బుద్ది తక్కువ పని...అనుకునేలా చేసింది..." అంటూనే కళ్యాణం జరగవలసిన ఇంట్లో కోపంతో ఊగిపోతుంది సునయని. "పోనిలేమ్మ!" "ఎలాగోలా సర్దుకుందాం!" "ఇంట్లో అందరం ఉన్నాం కదా !" "మనం కట్టెద్దాం పూబంతులు "సర్ది చెప్పే ప్రయత్నం చేసింది చిన్న కూతురు వినమ్ర. "ఎలా కట్టగలమే!" "ఏమైనా కొద్ది పూవ్వులా ఏమన్నానా?" "ఇల్లు మొత్తం డెకరేట్ చేయాలని చాలా తెప్పించారు.." "ఇదేమో ఇలా చేసింది.." పంటి బిగువున కోపం ఆపుకుంటుంది సునయన. ఎలాగోలా నలుగురు నాలుగు చేతులు వేసుకుని నాలుగు గంటలు శ్రమ పడితే కాని , తెచ్చిన పూవ్వులతో బంతులు చేసి మాలగా గుచ్చడం.అవ్వలేదు... "ఎంతనుకున్నా ! దాని చేతిలోని పనితనం ముందు మా అందరి పనితనం తీసి కట్టే " అనుకుంది సునయని. పువ్వులు డెకరేషన్ పని ఒప్పుకుని ,రాకుండా! కనీసం ఫోన్ కూడా చేయని రాజ్యంను మనసులో ఎన్ని సార్లు తిట్టుకుందో. అన్నిసార్లు తన పని గురించి తలుచుకుంటూనే ఉంది సునయని. పెళ్ళి అనుకున్నా ప్రకారం ముహుర్తానికి జరిగింది. మండపం నుండి అందరూ ఇంటికి చేరుకున్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. పెళ్ళికూతురు వర్దిని చిన్నగా తన తల్లి సునయని రూమ్ లోకి రావడం చూసి. "ఏంట్రా!ఇలా వచ్చావు.." "అప్పుడే ఒంటరి తనం ఫీలౌతున్నావా!" అంటు వర్దిని నుంచి దగ్గరకు తీసుకుంది సునయని. "అమ్మా !ఒక్క సారి గాంధీ హాస్పటల్ దాకా నాతో రాగలవా," అంటూనే కన్నీరు పెట్టుకుంటున్న వర్దిని పరిస్థితి అర్దం కాలేదు సునయనికి. "ఈ సమయంలో బయటకు వెళితే బాగోదు. పైగా పెళ్ళి వారు ఇంట్లోనే ఉన్నారు." అంటున్న సునయని మాటలకు . "అమ్మ! రాహుల్ కూడా వస్తారు మనతో .. నువ్వు కూడా వేస్తే మాకు కాస్త ధైర్యం గా ఉంటుంది ." అంటున్న వర్దిని మాటలు అర్దం కాక , "సరే పదండి " అనేసి వర్దినితో ..కలిసి గాంధీ హాస్పటల్ కు బయలు దేరింది సునయని....... హాస్పటల్ బెడ్ పైన రాజ్యం.. కాళ్ళకు పూర్తిగా సిమెంట్ కట్టుతో.. పక్కన చిన్న పిల్లలు... చూస్తున్నా సునయనికి ఏమీ అర్ధం కాలేదు. రాజ్యం ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఉండడమేమిటి రాహుల్ వర్దిని కలిసి ఇక్కడికి తీసుకురావడం అర్దం కాని సునయని. వర్దినిని అడిగింది.."ఏమిటిది "అంటూ ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని, ప్రెండ్స్ తో సరదాగా బయటకు వెళ్లి తిరిగి వస్తూ రాహుల్ రాజ్యంను తన కారుతో...చెప్పలేక చెపుతుంది వర్దిని.. రాహుల్ ఫోన్ చేయగానే వచ్చాను. చూస్తే రాజ్యం. మేమే తీసుకు వచ్చి ఇక్కడ ఎడ్మిట్ చేసామ్. పెళ్ళి సవ్యంగా జరగాలని,తనే రోడ్డు సరిగా కనిపించక కారుకు తగిలానని డాక్టర్ దగ్గర చెప్పింది. "తను దగ్గర ఉండి పెళ్ళి పనులు చేయలేక పోయినందుకు మన్నింపు కోరింది." "ముఖ్యంగా నిన్ను మరీమరీను" డాక్టర్ రాహుల్ ప్రేండ్ కావడంతో కేసులేకుండా.. అంటూ ఇంకా ఏదో చెప్పతున్న వర్దిని కంటనీరు తూడ్చుకుంటూ చూస్తుంటే.. సునయని రాజ్యం కాళ్ళు మొక్కుతుంది.... నీవే కదా మా దైవం అంటూ.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు