విముక్తి ఎప్పుడో! - రాము కోలా.దెందుకూరు.

Vimukti eppudo

ఏప్రిల్ 24 సాయంత్రం 2017. కష్టాలను మనస్సులోనే దాచుకుని. ప్రేమానురాగాలు పంచి,చివరకు వంచనకు గురౌతున్న నేటి సమాజంలో. అరిగిన చెప్పులతో,చేతిలో చిరుగుల సంచితో అప్పుడే ఆటో దిగుతున్న ఆమె వైపు చూస్తున్నాయి కొన్ని వందల కన్నులు. కన్న బిడ్డల నిరాధారణకు క్షణం క్షణం మరణించిన మనస్సును వారి వద్దనే వొదిలి. రక్తమాంసాలతో ఉన్న శరీరంతో కదిలి వస్తున్న సాటి నిర్బాగ్యూరాలికి స్వాగతం పలుకుతూ... కట్టలు తెంచుకునే కన్నీటిని చీర కొంగుతో తూడ్చుకుంటూ కొందరు. "చిన్న పలకరింపు ,మనస్సులో బాధను చెప్పుకునేందుకు ,వినేందుకు ఒక మనిషి ఉంటే చాలు ఈ జీవిత చరమాంకంలో" అనుకునే అభాగ్యులు కొందరు..అక్కడ ***** జూన్ 16 రాత్రి 11:55ని 2020 ఇరుకు అనే పదానికి నిర్వచనంలా ఉన్న స్థలంలోనే చకచకా నిర్మాణం జరిపించి కొత్తగా రంగులు వేసారు. మూడునాళ్ళ ముచ్చటే ఇది జనాల మెప్పుకోసం. ..అనేది వాస్తవం. నాలుగు గోడల మధ్య నిర్మించబడ్డ చీకటి గృహ లాంటి మహాసౌధంలో ఒక రకమైన వాసనతో ,ఊపిరి సలపడం లేదేమో. కాస్త గాలి పీల్చుకోవాలి అన్నట్లుగా బయటకు వచ్చింది నీలాంబరి , తను ఉంటున్న ఆరు అడుగుల ఇరుకు సామ్రాజ్యం నుండి. ప్రకృతిలోని చల్లని గాలి పీల్చుకోవాలని. దూరంగా చెట్టుకు దగ్గర్లో కాస్త పరిచయం ఉన్న ఆకారం ఉన్నట్లుగా అనిపించడంతో , చీకటికి అలవాటుపడిన కన్నుల్లో ఆశలు నింపుకుంటూ అటుగా నడక సాగించింది నీలాంబరి. చెట్టుకు ఆనుకుని దీర్ఘంగా ఆలోచిస్తూన్న గంగమ్మను చూసి గుర్తు పట్టినట్లుగా .... "నువ్వు !నువ్వు! గంగమ్మవు కదు "... అడగలేక అడిగింది.నీలాంబరి "ఎన్ని రోజులు అవుతుంది! నువ్వు ఇక్కడికి వచ్చి, మనిషిని అని చెప్పుకు తిరుగుతున కొన్ని నిర్జీవాలను చూడలేక లోపలే ఉంటున్నా,! నిన్ను ఇలా కలుసుకోవాలని ఉందేమో ఈరోజే కాస్త బయటకు వచ్చా!" "నువ్వు కనిపించావు చాలా సంతోషంగా ఉంది" మనిషి కంటే ఆప్యాయంగా పలకరించింది నీలాంబరి. "వారం అవుతుంది. అదిగో దూరంగా సాగిపోతున్నాడే? వాడే నా గారాల కొడుకు " "ఉన్న ఆస్తి మొత్తం వాడి చేతిలో పెట్టాను. నన్ను అనాధశరణాలంలో పెట్టాడు." "అక్కడ ఎలుకలు కొరికి, బొద్దింకలు కుట్టి. చీమలు నంజుకుతిని చివరకు ఇదిగో ఇలా ఇక్కడ చేరాను.".. చెప్పలేక చెప్పుకుంటూ దూరంగా వెళుతున్న కొడుకుని చూస్తుంది గంగమ్మ. "నిన్ను ఆశ్రమంలో నైనా చేర్చారు , నా కూతురు అది కూడా చేయలేదు, వీధిలోకి గెంటేసింది," "ఏ దిక్కులేక ఊరు బయట రావి చెట్టు నీడన తల దాచుకుంటూ ,తనువు చాలించా, మున్సిపాలిటీ వారు ఇక్కడ జాగా చూపించారు సర్దుకుంటున్నా." వివరంగా చెప్పింది నిలాంబరి. "పిల్లల్ని కనగలమే కానీ,ఎందుకు వృద్దాప్యంలో పోషించ లేరని అడగ లేము కదా...?" "అవును,...!" "ఆస్తులు పంచినా అస్థికలు కూడా కలపలేక పోతున్నారు...." "మనకు విముక్తి లేదు.ఎన్ని రోజులు ఆత్మ రూపంలో ఇలా గడపాలో " నిట్టూర్చింది నీలాంబరి. "అవును! కనీసం అస్థికలైనా పుణ్య జలంలో కలుపుతారనే ఆశతో ప్రతి రాత్రి ఎదురుచూస్తూనే ఉన్నా." కోరిక తీరకుండా మనం భూమిని వదలిపోలేమటకదా ..?. అమాయకంగా అడిగింది గంగమ్మ.. "అవునేమో!పున్నామ నరకం తప్పిస్తాడని కొడుకు కోసం ఎన్ని పూజలు చేసానో.." కళ్ళు వొత్తుకుంది గంగమ్మ. "ఆడపిల్లే ఇంటికి మహాలక్ష్మీ అన్నారని ఎన్ని నోములు నోచానో కూతురు కోసం" చెప్పుకుంటూ.. ప్రక్కనే ఉన్న మరో సమాధి పైన అలసటగా కూర్చుంది నీలాంబరి. ఇవి ఏవీ చూడలేని మనిషి మరో శరీరాన్ని కననం చేసేందుకు సమాధి త్రోవ్వుతున్నాడు .. వీరికే చాలీచాలని స్థలంలో మరొ శరీరంకు కొంత స్థలాన్ని కేటాయిస్తూ.... మనిషి ఎంత సహృదయుడో కదా!

మరిన్ని కథలు

Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి