సింహరాజు అరణ్య సరిహద్దుల పరిశీలనకువెళుతూ, పులిరాజును వారం రోజులు రాజుగా నియమించాడు.అడవిలోని జంతువుల పిల్లలు అందరిని సాయంత్రం ఒకచోటచేర్చి కథచెప్పసాగాడునక్కమామ."పిల్లలు అల్లరి చేయకుండా జాగ్రత్తగా వినండి ఇప్పుడు మీకు చెప్పబోతున్న విషయం కథకాదు నిజంగాజరిగింది.ప్రతి అమావాస్యరోజు గిలిగాడు తన భుజానికి తుపాకితగిలించుకుని అడవిలో తిరుగుతుంటాడు.దొరికిన ప్రాణి ఏదైనా అది పులికావచ్చు,సింహంకావచ్చు ఏనుగైనాసరే బంధించి చురకత్తితో కోసి తింటాడు"అన్నాడునక్క."నక్కమామ గిలిగాడు ఎలాఉంటాడో చెప్పు" అన్నది భయంగా కుందేలుపిల్ల. "ఎవరికితెలుసు మాఅమ్మమ్మ మాఅమ్మకు చెప్పింది, మాఅమ్మనాకు చెప్పింది అదినేను మీకు చెపుతున్న అయిన ఇటువంటివిషయాలు మావంటి పెద్దవాళ్ళు చెపుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి అడ్డమైన ప్రశ్నలు అడగకూడదు. జాగ్రత్త ఈరోజు అమావాస్య గిలిగాడు వేటకు వస్తాడు చీకటిపడకముందే ఇంటికి వెళ్ళండి అన్నాడు.అప్పటివరకు ఊపిరిబిగపట్టి బిగుసుకుపోయిన పిల్లజంతువులన్ని ఏడుస్తూ భయంతో ఇళ్ళకు పరుగులుతీసాయి. నక్కమామ పక్కనే ఉన్న తనబొరియ (ఇల్లు)లోనవ్వుకుంటూ దూరాడు. చెట్టుచాటునుండి నక్కమామ మాటలు విన్న పిరికిపులిరాజు భయంతో నేలతడిపాటు.ఇంతలో వచ్చిన కోతిబావను చూసిన పులిరాజు"ఏయ్ కోతి ఈరోజు గిలిగాడు వేటాడటానికి అడవిలోనికి వస్తాడట.నువ్వు నేను నిద్రపోఏ గుహకి కావలికాయాలి!"అన్నాడు తనభయం కోతికి కనపడకుండా.
"ప్రభు నేను ఎప్పుడు చెట్టుపైనే నిద్రిస్తాను అటువంటిది గుహముందు నేలపైన నిద్రరాదు"అన్నాడు వినయంగా."కావలి కాయమంటే నిద్ర పోతినంటున్నావు వళ్ళెలాఉంది?"అన్నాడు పులిరాజు.
"అలాగే ప్రభూ"అని పులిరాజు గుహకు చెరుకున్నారు."ప్రభూ తమరు హాయిగా నిద్రపొండి నేను గుహముందర తమకు గిలిగాడి దాడి జరగకుండా కావలి ఉంటాను"అన్నాడు కోతిబావ."నీతెలివి తేటలు నావద్దనా? నేను నిద్రపోగానే చల్లగాజారుకోవడానికా? అని, అందుబాటు లోని కొన్ని అడవితీగలు అందుకుని కోతితోక చివరిభాగాన్ని,తన తోక చివరిభాగంతో గట్టిగా ముడివేసి ధైర్యంగా నిద్రపోయాడు పులిరాజు.కు
అర్ధరాత్రి దాటాక కుందేళ్ళను వేటాడుతరతున్న వేటగాళ్ళు తుపాకీలతో కాల్పులు ఢాం'-'డాం'అని జరుపగా ఆతుపాకిమోతలు వినిపించడంతో అదిరిపడిన పులిరాజు గిలిగాడు తనకోసమే వచ్చాడని భయంతో తుపాకిమోత వినిపించిన దిశకి వ్యతిరేకంగా పరుగు లంకించుకున్నాడు.తోకలు ముడిపడిఉండటంతో నిద్రపోతున్న కోతిబావనుకూడా ఈడ్చుకు పోసాగాడు.భయంతో ఏంచెయాలోతెలియని కోతిబావ "ఓరినీభయంపాడుగాను ఆగరా సామి"అన్నడు నేలపైనుండి.ప్రాణభయంతో పరిగెత్తే పులిరాజు ఇవేమి వినిపించుకునే స్ధితిలోలేడు.వళ్ళంతాగీరుకుపోయిన కోతిబావ ఎగిరి పులిరాజు పైన కూర్చొని కిందపడిపోకుండా పట్టుకోసం పులిరాజు రెండుచెవులు గట్టిగా పట్టుకున్నాడు.
అసలేభయంతో సగంచచ్చిన పులిరాజు ఆసంఘటనతో మరింతభయపడి "నేనుకాదు,నాకేంతెలియదు,నన్నువదిలేయిరా గిలిగా!" గిలిగాడే తనపై కూర్చొని తనచెవులుపట్టుకున్నాడని భయంతో మరింత పరుగు వేగం పెంచాడు.నానాబాధలుపడి తోక ఊడదీసుకున్న కోతి పులిపైనుండి ఎగిరి దూకిదూకి తప్పించుకున్నాడు కోతిబావ.
బాలలు చూసారా? చెప్పుడుమాటలు ఎంతభయాన్ని, ఎన్నితిప్పలు తెచ్చిపెడతాయో! ధైర్యం కలిగినవాళ్ళే విద్యలో ఉన్నతశిఖరాలు అధిరోహిస్తారు.భయమే మన మొదటి శత్రువు అని తెలుసుకొండి.