సంస్కారం - B Vidyullata

Samskaaram

రావు & రావు

అడ్వకేట్ ఛాంబర్సు

సదానందరావు

సీనియర్ అడ్వకేట్

అని నల్లని బోర్డ్ పై తెల్లని అక్షరాలతో ఉన్న ఫలకంతో అలంకరించబడి ఉన్న మూడంతస్ధుల అందమైన, ఆకర్షణీయమైన

భవనం, జూబ్లీ హిల్సు చెక్ పోస్టుకు సమీపంలో సదానంద రావుగారి తండ్రి వామనరావు గారి కాలంలో నిర్మించింది. భవనానికి రెండు వైపులా రహదారులు ఉండటంతో ఒకవైపుకు ఇంటి గుమ్మం, రెండవ వైపుకు ఆఫీసు గుమ్మంఉండేటట్లుగా నిర్మించారు. ఆఫీసుకు వచ్చేవారికి ఇంటితో సంబంధం లేకుండా ఉండేటట్లుగా ఉండే ఆఫీసులోక్రిందంతా పార్కింగ్, పైన మూడంతస్తులూ ఆఫీసు అన్ని అధునాతన వసతులతో, ఒక వైపు లిఫ్టు ఒకవైపంతా మూడుఅంతస్థులలో విస్తరించిన న్యాయ శాస్త్ర గ్రంథాలయం, సెంట్రల్ ఎయిర్ కండిషనర్ తో,

ముందు వరండా లో ఒక రిసెప్షన్ డెస్కు, వచ్చిన వారు కూర్చోవటానికి వీలుగా కొన్ని కుర్చీలు, సోఫాలు. వెనక రెండు పెద్దగదులు. ఒకటి గ్రంథాలయం ప్రక్కనే జూనియర్ న్యాయవాదులకై మూడు పెద్ద పెద్ద టేబుళ్ళు, వాటి చుట్టూ కుర్చీలతో, చుట్టూరా అలమరలతోటి ఉన్నది, రెండవది క్లయింట్లతో న్యాయవాదులు కలుసుకునేందుకు వీలుగా ఒక ఆఫీసు బల్లదానికి ఒక వైపు సీనియర్ న్యాయవాది కూర్చోవటానికి ఒక రివాల్వింగ్ కుర్చీ, దానికి ఎదురుగా మూడు కుర్చీలు క్లయింట్లకోసం, గోడల వారగా రెండు సోఫీలు. రెండవ అంతస్తులో రెండు పెద్ద హాలులు, ఒక ఆఫీసు గది అనుభవజ్నుడైన రెండవస్థానంలో ఉన్న న్యాయవాది కోసం, రెండు హాళ్ళలో ఒకటి గ్రంథాలయానికి ఆనుకునీ న్యాయవాదులు కొరకు రెండు పెద్దటేబళ్ళతో చుట్టూరా కుర్చీలతో ఒక ప్రక్కగా ఒక డెస్కు టాపుతో చుట్టూరా అలమరలతోటి ఉంది. , దానిని ఆనుకునికంప్యూటర్ గది, మూడవ అంతస్థులో ఒక పెద్ద ఆఫీసు గది, అందులో ఒక పెద్ద టేబులు, రివాల్వింగ్ కుర్చీ, సోఫాలుఒక ప్రక్కగా ఫ్రిడ్జు, ఆగదిని ఆనుకుని ఒక చిన్న వరండా, కలవటానికి వచ్చినవారు వేచి ఉండటానికి కుర్చీలు వేసి ఉంది, గ్రంధాలయంలో ఒక భాగంలో మూడు కుర్చీలు, ఒక టేబులు, మూడు డెస్కు టాపులతో చుట్టూరా అలమరలతోఅమర్చబడి ఉంది, లిఫ్టుకు ఎదురుగా వరండాకి ఒక ప్రక్కగా ఒక ఆఫీసు గది. ఆఫీసు రూములకు వెనక నుంచి నేరుగాసదానందరావు గారి ఇంటిని కలుపుతూ ఉంటుంది.

సదానందరావుగారిది న్యాయవాదుల కుటుంబం. వామనరావు గారు మంచి పేరు మోసిన న్యాయవాది. ఆయనతండ్రి రంగారావు కూడా న్యాయవాదే, ఆయన బ్రిటన్లో బారిష్టరీ చేసి వచ్చి మదరాసులో న్యాయవాదిగా చేసేవారు. స్వాతంత్రోద్యమం సమయంలో గాంధీగారి పిలుపుతో స్వాతంత్ర ఉద్యమాలలో ప్రధాన పాత్ర పోషించేవారు. సంపాదించింది సంపాదించినట్లే ఉద్యమానికి ధార పోసేవారు. అప్పటికే వామనరావు గారు కూడా న్యాయవాదిగాప్రాక్టీసు చేసేవారు. రంగారావు గారు ఉద్యమం సమయంలో పోలీసు కాల్పులలో మరణించారు.

వామనరావుగారు స్వాతంత్ర్యం తరువాత రెండు చేతులా సంపాదించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత వారుహైదరాబాదు వచ్చేశారు. బర్కత్పురాలో ఉండి ప్రాక్టీసు చేస్తూ జూబ్లీ హిల్సులో ఇల్లు ఆఫీసు కలిపి కట్టారు. ఆయన పదిసంవత్సరాలపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా చేసి, అదే వృత్తిలోకి వచ్చి నిలదొక్కుకున్న కొడుకు సదానందం పేరు తన పేరుమీద రావు & రావు అడ్వకేట్ ఛాంబర్సు గా కొడుకు సదానందరావు తో కలిసి ప్రాక్టీసు

చేసేవారు. దాన్ని సదానందరావు గారు ఇంకా అభివృద్ధి చేశారు. సదానందరావుగారు కూడా తండ్రికి తగ్గకొడుకనిపించుకోని మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. అడ్వకేట్

జనరల్ గా చేసి, సీనియర్ అడ్వకేట్

గా గుర్తించబడ్డారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. కొడుకులు ఆయన వృత్తిలోకి రాకుండా, విదేశాలలోస్ధిరపడ్డారు. కూతురు మీనాకుమారి డిల్లీ లో లా చదివి, కొలంబియా లా స్కూల్‌లో మాస్టర్సు చేసి, ఢిల్లీ లోని

ఒక కార్పొరేట్ ఆఫీసులో లా ఆఫీసరుగా నాలుగేళ్ళు పనిచేసి, తండ్రి వత్తిడితో హైదరాబాదు వచ్చితండ్రి ఆఫీసులో చేరింది.

సదానందరావు గారి ఆఫీసుకి ఒక మంచి పేరు ఉంది. అక్కడ తయారైన న్యాయవాదులకు

న్యాయస్థానాలలో మంచి పేరుంది. ఆయన శిష్యుడూ,సహచరుడూ అయిన ప్రభాకరరావు ఆఫీసుని అన్నీ తానై తీర్చిదిద్దుతూ ఉంటాడు. అతని వల్ల సదానందరావుగారికి ఎంతో విశ్రాంతి దొరుకుతుంది. అతనంటే సదానందరావుగారికిమంచి నమ్మకం. 20 ఏళ్ళుగా ఆయనతోనే ఉంటూ, ఆయన అభిరుచులకీ, ఆయన ఆలోచనలకి తగ్గట్టుగా ఆఫీసునినడుపుతూ ఉంటాడు. ఎవరెవరికి కేసు అప్పచెప్పాలి, జీతాలు ఎలా, ఎంత ఇవ్వాలో కూడా ప్రభాకరే నిర్ణయిస్తాడు. వాటిని కళ్ళుమూసుకుని ఆమోదిస్తారు సదానందరావుగారు. వారిద్దరి అనుబంధం అలాంటిది మరి. అంత జాగ్రత్తగాచూసుకుంటూ నడిపిస్తారు కాబట్టే ఆఫీసులో పని చేయాలని కలలు కంటారు యువలాయర్లు. ఎంతో పరీక్షించి ఎంపికచేసి మరీ ఆఫీసులోకి తీసుకుంటారు యువ న్యాయవాదులను. తరువాత వారికి శిక్షణ నిర్వహించి వారినితీర్చిదిద్దుతారు. మూడంతస్తులలోను న్యాయశాస్త్రానికి సంబంధించిన

గ్రంధాలయం విస్తరించి ఉంటుంది. జూనియర్ లాయర్లనందరినీ వారి అనుభవానుగుణంగా మూడు భాగాలు చేస్తారు. 0-5, 6-10, 10-15 ఆపైనగా, 0-5 బ్యాచ్లో వారు నలుగురు, 6-10 లో ఉన్న ఒకరికి వారి పని వివరాలు అన్నీ వారాంతానికి ఒకనివేదిక ఇవ్వాలి, అలాగే తమకున్న అనుమానాలు అడిగి తెలుసుకోవాలి వారు మొదటి అంతస్తులో ఉంటారు. 6-10 వారు ముగ్గురు ఒక 10-15 వారికి నివేదిక ఇవ్వాలి. ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారి సలహా సహకారాలతో చేయాలి. వారు రెండవ అంతస్తులో ఉంటారు. ప్రభాకర్ రావు కూడా అక్కడే ఉన్న ఆఫీసు గదిలో ఉంటాడు. 10-15 సంవత్సరాలఅనుభవం ఉన్నవారు మూడవ అంతస్తులో గ్రంథాలయంలో ఉంటారు. సదానందరావుగారు అక్కడే పెద్దఆఫీసులోఉంటారు. ప్రతి నెలా ప్రభాకర్ అందరితో విడి విడిగా కలిసి చర్చిస్తాడు. వారంతా సరైన విధంగా వాళ్ళ కేసులుచేస్తున్నారో లేదో పరిశీలించి వారికి మర్గదర్శనం చేస్తుంటాడు. జటిలమైన విషయాలపై వాసుదేవరావుగారితో సంప్రదించిఆయన సలహాలు అమలు చేసేలాగా చూస్తాడు. అంత శ్రద్ధగా చేస్తారు కనకనే ఆఫీసుకు అంత మంచి పేరు. ఎంతఅడిగినా ఇవ్వటానికి జనం సిధ్దంగా ఉంటారు. వారు తీసుకునే కేసులు కూడా అంత క్లిష్టమైనవిగానే ఉంటాయి.

విధంగా నడిచి పోయే ఆఫీసుకు మీనా రాక కొన్ని మార్పులు తెచ్చింది. మీనాక్షికి ఆఫీసులో ప్రత్యేకమైన ఒక ఛాంబర్తండ్రి ఆఫీసు ప్రక్కనే ఉంది. ఆమె కేసు చేయాలో ఆమే ఎంపిక చేసుకుంటుంది. ఆమె ఎవరిని ఎంచుకుంటే జూనియరు ఆమెకు కోర్టులో సహాయకులుగా వెళ్ళాలి. ముఖ్యంగా ఆమె విషయంలో ప్రభాకర్ జోక్యం ఆమెకు ఇష్టంఉండదు. అది అర్ధం చేసుకున్న ప్రభాకర్ ఎంతలో ఉండాలో అంత దూరంగా ఉంటూ తన మర్యాదను నిలుపుకుంటూఉంటాడు.

ఒకసారి తన ముఖ్యమైన ఒక కేసు గురించి నీలిమను ఎంచుతుంది మీనా. నీలిమ ఆఫీసులో 6-10 బ్యాచ్లో ఉన్నది. సన్నంగా, చామన ఛాయతో, పెద్ద జడ, కళ గల ముఖం, తెలివిగా, చురుగ్గా ఉంటుంది నీలిమ. తన పనిని ఎంతో శ్రథగాచేసుకుపోతూ ఉంటుంది. మీనాతో కలిసి పని చేయటం అనగానే రెండు రోజుల ముందే మీనా అనుమతితో ఫైలంతాక్షుణ్ణంగా చదవుకుంది. ముక్షమైన పేపర్లకు ఫ్లాగులు అమర్చుకుంది. పనికి వస్తాయి అనుకున్న రిఫరెంస్ పుస్తకాలను తీసిఉంచుకుంది. ఆరోజు రానే వచ్చింది. అన్నీ సర్దుకొని మీనా తో హైకోర్టుకు వెళ్ళింది. మీనా తన వాదన చెబుతుంటే చక చకాఆమెకు కావలసినవి అందిస్తూ మీనాకు సహాయ పడింది. మీనా వాదనలకు అబ్బురపడింది. మీనాకు అవతలి వైపుజడ్జి రంగనాధ రావు గారి కుమారుడు రాజారావు వాదించాడు. అతను కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదివి తండ్రి హై కోర్టుజడ్జి అయ్యక, ఆయన ఆఫీసు చూసుకుంటూ ఇక్కడే స్ధిరపడ్డాడు. ఇద్దరి వాదనలు విన్నాక మీనా వాదనను బలపరుస్తూ తీర్పు వచ్చింది. అందరూ మీనాను అభినందిచారు. రాజారావు మాత్రంఅలాంటి జూనియర్ పక్కనుంటేఎలాంటి కేసైనా గెలవచ్చు, అసలు ప్రభాకర్‌ని మెచ్చుకోవాలి, వాళ్ళని అలా తయారు చేసినందుకుఅంటూ తేలికగాతీసేశాడు. ఆమాట మీనాకు అస్సలు నచ్చలేదు. పైకేమనకపోయినా లోపల ఏదో తెలియని చికాకు మనసునికలచివేయటం మొదలైంది.

మీనా తన వేరొక వ్యాజ్యంలోకూడా సాయానికి నీలిమనే తీసుకుంది. నీలిమకు కొంచెం ఎక్కువగా పని కలిపించి, ఆమెచేసిన ప్రతి పనికి వంకలు పెడుతూ, చేసినదే మళ్ళీ మళ్ళీ చేయించి ఇబ్బంది పెట్టేది. కేసు ఛీఫ్ జడ్జి ఉన్న బెంచి ముందువచ్చిన రోజున నీలిమను వెళ్లమని తనకు వేరే పని ఉందని చెప్పటంతో నీలిమ ఎంతో ఉత్సాహంగా వెళ్లింది. అలాంటిఅవకాశం చాలా అరుదుగా వస్తుంది. రోజు అన్నీ సర్దుకుని ఉత్సాహంగా కోర్టుకు బయలు దేరే సమయానికి మీనా పిలిచికొన్ని సూచనలు అవీ చెప్పి పంపింది. హడావుడిగా కోర్టులోకి వెళ్ళి చూసుకుంటే తన దగ్గర ఉన్న ఫైలు సరైనది కాదు తప్పుఫైలు. ఎలాగో సమయం తీసుకుని బయట పడింది. ఆఫీసుకు వెళ్ళి భయపడుతూ మీనా ముందుకు కు వెళ్ళింది.

ఫైలిక్కడే వదిలి వెళ్ళావు, అంత నిర్లక్షమేమిటి? ఏమైంది కోర్టులోఅంటూ మీనా అనే సరికి తెల్ల బోయింది. మీనారూములోకి ఫైల్ ఎలా వచ్చిందో అర్ధం కాలేదు.

సమయం తీసుకున్నానండి

సరే, మనం వేయాల్సిన జవాబు సిద్ధమే కదా? జాగ్రత్త తరువాతి వాయిదాలో కోర్టులో ఇవ్వాలి’. అంది మీనా.

అలాగేనండిఅని తన టేబుల్ దగ్గరకైతే వచ్చింది కానీ మనసు మనసులో లేదు.

రెండు రోజుల తరువాత మళ్ళీ మీనా కేసు కోర్టులో వచ్చింది. రోజు కూడా మీనా నీలిమనే వెళ్ళమంది. నీలిమ ఒకటికిరెండు సార్లు అన్నీ చూసుకుని బ్యాగులో పెట్టుకుంది. బయలు దేరే ముందు మళ్ళీ మీనా పిలవటంతో బ్యాగ్ అక్కడ ఉంచిమీనా దగ్గరకు వెళ్ళింది, మీనా ఎలా మాట్లాడాలో, ఏమేమిచెయ్యాలో ఒకటికి రెండు సార్లు చెప్పి పంపింది. వస్తూనేఒకసారి ఫైల్ సరైనది పెట్టుకుందో లేదో చూసుకుని బస్టాండు వైపు వడి వడిగా నడిచింది.

సరిగ్గా తమ కేసు పిలిచే సమయానికి చేరుకుంది. ‘ జవాబు వేస్తున్నారా?’ జడ్జి అడగగానే, ‘ ఎస్ మిలార్డుఅంటూఫైల్ తెరిచి, తను తయారు చేసిన జాబు కోసం చూసింది, కానీ అవి అందులో లేవు. కంగారుగా ఒకటికి రెండుసార్లువెదికింది. ‘సారీ, మిలార్డుఅంటున్న నీలిమనుసదానందరావుగారి జూనియరువైయుండి ఇంత నిర్లక్షంగాఉన్నావేమిటి? సాయంత్రం లోపల వెయ్యాలిఅని కేసు ప్రక్కన ఉంచారు. చేసేది లేక మీనాకు ఫోను చేసి జరిగిందిచెప్పింది.

ఎంత నిర్లక్ష్యం నీకు? ఆఫీసులో ఎవరూ లేరు. నువ్వు పేపర్లెక్కడ పడేశావో నేను వెతక లేనుఅని ఫోను పెట్టేసింది.

సాయంత్రందాకా ఉండి ఎలాగో బతిమిలాడుకుని మర్నాటి దాకా సమయం తీసుకుంది. ఆఫీసుకు వచ్చి, మీనాకుచెప్పింది.

ఏం చేస్తావో నాకు తెలియదు రేపు కోర్టులో వేయాలి, తయారు చేయిఅంది.

నీలిమ కంప్యూటరాపరేటర్ దగ్గరికి వెళ్ళి తన ప్రింటవుట్లు కావాలని అడిగింది. అతను అంతా వెతికి చూసి, తనుతయారు చేసిన డాక్యుమెంట్లలో అవి లేవని చెప్పాడు. డెలిట్ అయ్యాయని చెప్పటంతో, తను తయారు చేసిన రఫ్ కాపీతెచ్చి అతనిని బతిమాలు కొని మళ్ళీ పేపర్లన్నీ తయారు చేసుకుని మీనా దగ్గరకు వెళ్లింది. ఫైల్ అక్కడ పెట్టి వెళ్ళు, రేపునేను కోర్టుకు తీసుకొని వస్తాననటంతో ఫైలంతా ఆమెకిచ్చి రేపు తను కోర్టు దగ్గర కలుస్తానని చెప్పి వెళ్ళి పోయింది. ప్రభాకర్ఉంటే ఎవరినైన తోడిచ్చి పంపటమో లేకపోతే తనే దింపేవాడు. కానీ అతను సుప్రీమ్ కోర్టులో కేసు ఉండటంతో ఢిల్లీవెళ్ళాడు. చీకటి పడటంతో భయం భయంగా బస్ స్టాపులో ఎదురు చూస్తూ నిలబడింది.

మర్నాడు కోర్టు దగ్గర మీనా కోసం ఎదురు చూస్తూ కూర్చుంది నీలిమ. వాళ్ళ కేసు పిలిచే సమయం వస్తున్న కొద్దీనీలిమలో అలజడి మొదలైంది. అప్పటికే మూడు సార్లు ఫోను చేసినా మీనా ఫోను ఎత్తట్లేదు. వివరికి వీళ్ళ కేసుపిలిచారు. ‘ మీరు జాబు వేస్తున్నారాఅన్న జడ్జితోకొంచెం సమయంఅని నీలిమ అనగానే, పేపర్లు ప్రక్కన ఉంచి, సాయంత్రం చివరిగా పిలిచారు, ‘ సారీ మిలార్డ్అంటుండగానే,

యూ ఆర్ సో నెగ్లిజంట్అంటూ కోర్టు నుంచి మిమ్మల్ని నెలరోజులు బహిష్కరిస్తున్నాం, మీరు ఇక వెళ్ళ వచ్చు’. అంటూ, ఫైలు మీద సంతకం చేసి, వెళ్ళి పోయారు. అంత మంది ముందు జడ్జి అలా అనగానే నీలిమ త్వర త్వరగాబయటకు నడిచింది. ఎంత ఆపుకున్నా కన్నీళ్ళు ఆగట్లేదు. నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది.

మర్నాడు ప్రభాకర్ వస్తూనే సిసి కెమారాల ఫుటేజ్ లన్నీ చూశాడు. వెంటనే ఆఫీసు బాయిని పిలిచి మాట్లాడాడు. నేరుగా సదానందరావు గారి ఛాంబరులోకి వెళ్ళాడు.

ప్రభా, రా రా, ఏమంటోంది సుప్రీమ్ కోర్టు?’

మన గురించే మట్లాడుకుంటోంది సార్. మీ జూనియర్నేటగా ఛీఫ్ కోర్టు డిబార్ చేసిందని

కానీ, ప్రభా, మీనా చెప్పింది, అమ్మాయి నిర్లక్షంగా ఉందని

మన ఆఫీసులో అమ్మాయి ఐదేళ్ళుగా ఉంది. అమ్మాయి అలా చేసిందంటే మన సిష్టంలో ఏదో లోపమున్నట్లే కదా? మీరు ఎప్పుడూ అదే కదా చెప్పేవారు. జూనియర్ తప్పు చేస్తే అది మన శిక్షణ లోపమని. ఇదిగో, ఇదొక్కసారి చూడండిఅంటూ ల్యాప్ టాప్ ఆయన ముందు పెట్టి చూపించాడు. ఆఫీస్ బాయి యాది, నీలిమ బ్యాగ్ లోంచి పైల్ తీయటం, పేపర్లు తీయటం, మీనా కంప్యూటర్నించి ఫైల్ డెలిట్ చేయటం,

అన్నీ చూసిన సదానందరావు గారుమీనాఅంటూ పిలిచారు. మీనా రాగానే ల్యాప్ టాప్ వైపు చూపిస్తూఏమిటమ్మా, ఇది?’

ఫుటేజ్ లు చూసిన మీనా ఖంగు తింది. ‘డాడ్, ఇదొక్కటే కాదు అమ్మాయి మన ఆఫీసు ముందు బస్సు ఎక్కి కొద్దిదూరంలో దిగి, రాజారావు నీలం బ్రిజ్జా కారులో వెళ్ళటం నేను చూశాను’,

మరి నా కారేమిటిఅంటూ ప్రబాకర్ అడిగిన దానికి మీనా అయోమయంగా చూడటం చూసి సదానందరావుగారుప్రభది కూడా అదే కదమ్మా? నీలిమ ప్రభాకర్ కి దూరపు బంధువవుతుంది. ప్రభకి ఆఫీసులో అందరికీ విషయంతెలియటం ఇష్టం లేదు.’ అన్నారు

సార్, నిన్న నీలిమ ఫాదర్ కాల్ చేసి, నీలిమ నిద్ర మాత్రలు మింగిందని, ఆసుపత్రిలో చేర్చామని చెప్పారు. అందుకేముందు అక్కడికి వెళ్ళి వస్తున్నాను

అయ్యో, ఇప్పుడెలాగుంది? ముందు మనం అక్కడికి వెళ్ళాలి, చూశావా మీనా? ఎంత పనైందో? నువ్వు, అమ్మ కూడాబయలు దేరండిఅన్న సదానందరావుగారి మాటలకి, ‘ ఇందులో మీ తప్పు కూడా ఉంది సార్అన్న ప్రభతో,

నాదా?’

అవును, మీనాకి మన ఆఫీసు ఎలా నడుస్తుందో తెలియదు, తనకీ అందరిలో ఒక దానిలా ఉండటం నేర్పితే, ఇలాజరిగేది కాదు, అంతే కాదు, మీరు ఇంకొకటి కూడా ఆలోచించాలి, జడ్జిగారు తన వాదనలను విని తనను సమర్ధిస్తూతీర్పు ఇస్తే, దానికన్నా రాజారావు ఓడిపోయానన్న ఉక్రోషంతో జూనియర్‌ని మెచ్చుకున్నందుకు ఆమె మీద అసూయఎందుకు పెంచుకుందో అది తెలుసుకోండి, గురువుగారు’ . మీనా గబ గబా అక్కడినుంచి పారిపోయింది.

ఏమంటున్నావు ప్రభా ? నిజామా?’ ‘సరే, సరే, ముందు నీలిమ, తరువాత రంగనాధ రావు తో రాజారావు గురించి, సరేనా’?

రోజు సాయంత్రమే భార్యా, మీనా తో కలిసి ఆసుపత్రికి వెళ్ళి, నీలిమ తల్లి తండ్రులను కలిసి, వారికి ధైర్యం చెప్పి, ఆసుపత్రి ఖర్చంతా తమదేనని చెప్పి గదిలోకి వెళ్ళి నీలిమను కలిసి, ‘ ఏం పిచ్చి పనమ్మా, ఇది? తప్పు కదూ? ప్రాణాలుఎంతో విలువైనది, బ్రతికుంటేనే కదా ఏదైనా సాధించ గలం? మచ్చని చెరిపేసుకోకుండా పోతే, అది ఎప్పటికీ నీ పేరుతోపాటు ఉండదా? ఒక్క ప్రతిభ తోటే దానిని చెరుపుకోగలవు, ఇప్పుడు నీకు తోడుగా మన ఆఫీసులో అందరూ ఉంటారు, నేను, ప్రభా ఉండనే ఉన్నాము. రేపట్నుంచి ఎప్పట్లాగే ఆఫీసుకొచ్చై, సరేనా?’ అంటూ మీనాకి సైగ చేసి బయటకువచ్చేసారు.

మీనా , నీలిమ దగ్గరికివెళ్ళిసారీ, నీలిమా, నా వల్ల పెద్ద పొరపాటే జరిగింది. నన్ను క్షమిస్తావా?’ అంది.

మీరే నన్ను క్షమించాలి, మీరంత మంచి అవకాశమిస్తే, నేను ఉపయోగించుకోలేక పోయాను.’

నువ్వలా అస్సలు అనుకో వద్దు, నేను నీకు తోడుగా ఉండాలి, కానీ నిన్ను బలి చేసి తప్పు చేసాను. రోజు నుంచి నేనునీకు తోడుగా ఉంటాను. సారి మనిద్దరం కలిసి అదరకొడదాం, నువ్వు త్వరగా కోలుకుని ఆఫీసుకు రాఅని చెప్పివచ్చేసింది.

మర్నాడు సదానందరావుగారు ఆఫీసులో అందరినీ సమావేశ పరిచిఫ్రెండ్సు , తెలిసో తెలియకో మన ఆఫీసులో మామీనా వలన ఒక పొరపాటు జరిగింది, దాని వలన నీలిమకు అన్యాయం జరిగింది. ఇందులో నీలిమ తప్పేమీ లేదు. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడూ జరగవని మాటిస్తున్నాను. మీరంతా నీలిమను సాదరంగ

ఆహ్వానించి, ఆదరించాలి.’ అని చెప్పి ముగించారు. నీలిమ రాగానే అందరూ నిలపడి చప్పట్లతో లోనికి ఆహ్వానించారు.

ఒక నెల తరువాత మీనా వివాహం రాజారావుతో ఘనంగా జరిగింది. ఒక పెద్ద రిసార్టులో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వేదిక మీద మీనా, రాజారావు కూర్చుని ఉన్నారు. ఎంతోమంది అతిథులు వారిని అభినందిస్తున్నారు. ఆఫీసులోజూనియర్లందరూ అతిధులను ఆహ్వానిస్తూ మర్యాదలు చేస్తున్నారు. హైకోర్టు ఛీఫ్ జడ్జి వచ్చారు. వామనరావుగారు వేదికమీదకు తీసుకుపోయి వధూవరులను పరిచయం చేసి, అభినందల తరువాత ఫొటోలు అవి అయ్యాక క్రిందకు తెచ్చినీలిమా, ఇలా రా అమ్మా’, అంటూ పిలిచి, ‘చూడమ్మా, సార్ ని డివ్నర్ దగ్గరకి తీసుకు వెళ్ళు’, ‘ మా జూనియర్, నీలిమసార్, చాలా సిన్సియర్, తీసుకు వెళ్ళమ్మా,’ అంటూ పంపారు.

ఇలా రండి సార్,’

ఎలా ఉంది ప్రాక్టీసు?’

బాగుంది సార్

సదానందరావుగారిలాంటి మంచి ఆఫీసులో ఉంటే, అంతా బాగానే ఉంటుంది, ఆయన అంతా చెప్పారు. మనప్రొఫెషన్లో ఇలాంటివి మామూలే, నీ ప్రతిభే నిన్ను నిలపెడుతుంది, నువ్వు ధైర్యంగా కోర్టుకొచ్చెయి. అన్నీ సర్దుకుంటాయి,’

హలో, సార్, ఇటు రండి ,’ అంటూ ప్రభాకర రావు వచ్చి, తనతో తీసుకుని వెళ్ళాడు.

నీలిమ మనసు ఆనందంతో ఉప్పొంగి పోయింది. తప్పులందరూ చేస్తారు, కానీ, అది తెలుసుకుని దానిని ఒప్పుకుని, దిద్దుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారు?

ఇంత సంస్కారవంతుల మధ్య పని చేయటం తన అదృష్టంగా అనిపించింది. కొండంత బలం వచ్చినట్లనిపించి, సంతోషంగా అందరినీ పలకరించ సాగింది

******

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు