"  ఆదిశక్తి " - నల్లబాటి రాఘవేంద్రరావు

Aadishakthi

పురోగమనం తో ఆకాశమంత ఎత్తు ఎదగడానికి అయినా ...తిరోగమనం చెంది ....పాతాళానికి కూరుకుపోవడానికి అయినా సమానమైన అవకాశాలు ఉన్న మహా మాయా నగరం అది!! అక్కడికి పట్టాభిరామయ్య చెప్పాడు... అది పెద్ద కంపెనీ అయినంత మాత్రాన 20 వేల రూపాయల జీతం ఆఫర్ చేసినంత మాత్రాన ... అక్కడ ఓ నలుగురు సభ్యుల కుటుంబం బ్రతికి బట్టకట్టి నెగ్గుకురావడం చాలా కష్టమని... కానీ అతని కొడుకువిగ్నేష్ అందుకుఅంగీకరించ లేదు. " ఒరేయ్ విగ్నేష్ ..ఆ మహానగరంలో మనకు గురివింద పూస ఎత్తు అన్యాయం జరిగినా మనం తిరగబడ లేము. తిరగబడి నిలబడలేం. సుఖాన ఉన్న ప్రాణం కష్టాలపాలు కావడమే అవుతుంది..... కేవలం సినిమాలు చూసి....అందులో హీరో తనకో తనతండ్రికో, తన చెల్లికో అన్యాయం జరిగితే మొత్తం ఆమహానగరాన్ని ధ్వంసంచేసి పారేస్తాడు.అది సినిమా రా. నువ్వు అలాగే చేద్దాం అని అనుకుంటున్నావా.. కలలు కంటున్నావా??"అసలు అలా నిజజీవితంలో కుదురుతుందా..??????? " ఒకే ఒక్క మనిషిని" నువ్వు ఎదుర్కోవడమే చాలా కష్టం. అలా ఎదుర్కోవడంలో... ఓ కాలు విరిగిన.. ఒక కన్నుపోయినా.....లక్షలు.. కట్ట మంటాడు డాక్టర్.. ? పైగా ఆరు నెలలు బెడ్ రెస్ట్..! ఇక అప్పుల పాలు. ఉద్యోగం ఊడిపో తుంది. అందుకనే ఆ తలంపు విరమించరా." ఈవిధంగా చాలాసార్లు వివరించాడు కొడుక్కి తండ్రి పట్టాభిరామయ్య. "ఎన్నాళ్ళిలా అందరూ అందలం ఎక్కేస్తున్నారు నీ పిరికి మందు తో నాలో "సాహసం " అన్న పదం మరుగున...పడి పోయింది. ఎక్కడ..వేసిన గొంగలి అక్కడే... చావో రేవో తేల్చుకుందాం".. అన్నాడు కొడుకు చిట్ట చివరగా. అంతే ..ఆ కుటుంబం.. అలా ఆ మాయనగరం చేరి.. సంవత్సరం పూర్తయింది. విగ్నేష్ సంపా దన 20 వేల తో సర్దుకు బ్రతికేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు నలుగురు. పట్టాభి రామయ్య తను కొందరికి సంస్కృత పాఠాలు చెప్తూ వచ్చిన డబ్బులతో కూతురు రోజా కి చదువు చెప్పిస్తున్నాడు. ఆ అమ్మాయ ఇంటరు రెండోసంవత్సరం. పట్టాభిరామయ్య భార్య మంగమహాలక్ష్మి అప్పడాలకంపెనీలో పనిచేస్తూ సంపాదించే రోజు కూలీ ఆ... కుటుంబం మందులు ఖర్చుకి సరిపోతుంది. అలాఅలా ఆ కుటుంబం ఆ మహామాయా నగరం లో చాలాకష్టంగా నెట్టు కొస్తున్నారు. " నాన్న.. నువ్వు.....రేషన్ షాప్ నుండి తెచ్చిన కిరసనాయిలు కొలత సరిపోలేదు. వెళ్లి అడగనా"? " నోరు మూసుకొని నీ పని చూసుకోరా." ఆ మర్నాడు........ " నాన్న.. అమ్మ మనీపర్సు మార్కెట్లో ఎవడో దొంగ .....లాగుకొని పోయాడట. కంప్లైంట్ ఇవ్వనా...అందులో 1000 రూపాయలు ఉన్నాయి. నీకు చెప్పడానికి భయపడుతుంది." "వద్దు..అందరూ నోరు మూసుకుని కూర్చోండి. అజాగ్రత్తగా ఉండడం మన అవివేకమని.. ఆ డబ్బు మనకు ప్రాప్తం లేని ధనం అని వేదాంత ధోరణి లో సర్దుకుపొండి." ఇదే పద్ధతి..ఇదే విధానం.. ఆ ఇంట్లో ప్రతి రోజు రకరకాల సమస్యల మీద. కుటుంబం అంతా హైటెక్ బస్సు ఎక్కి ఈ మహా మాయానగరం చేరే ముందు రోజే.. కొడుకుని తన జాగ్రత్త కోసం ఒక " గాడి" లో బంధించి పడేసాడు పట్టాభిరామయ్య.... " " ఒరేయ్..విగ్నేష్.. ఇలాకూర్చో.. ఆనాడు గాంధీగారు మద్యం, మాంసం ఇంగ్లాండులో ముట్టను..అని.. శపథం చేసి వెళ్ళాడు. అలాగే మెలిగాడు. నీకు తెలుసుగా ....అందుకనే ఆయన మహాత్ముడు అయ్యాడు." " " సరే నాన్న.. అర్థం అయింది. ఇదిగో విను నీ మనసు సంతోషం కోసం.. నేను ..నేను కూడ మాటిస్తున్నాను.. ఆ మాయానగరంలో నేను కూడా ఎవరితోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ తగవు పడను.. తిరగబడను. ఇదిగో.. నేను కూడా ప్రమాణం చేస్తున్నాను.. సరేనా.. " ". అదిగో..ఆనాడు ఆ మాయానగరం వెళ్లే ముందే కొడుకు దగ్గర అట్లా మాట తీసుకున్నాడు పట్టాభి రామయ్య. తనకు చిక్కిన ఆ పదునైన "ప్రమాణ" ఆయుధంతో.. కొడుకును గాడిలో కట్టిపడేసి బాగానే నెట్టుకొచ్చాడ..ఒక సంవత్సరం పట్టాభిరామయ్య. రెండో సంవత్సరం మొదలైన మొదటిరోజు ...విగ్నేష్ జీతం 25వేలకు.. పెరిగింది. అయినా రోజులు కష్టంగానే గడుస్తున్నాయి. ఆరోజు.. కూతురు రోజా స్నేహితురాలు విమల పరుగున వచ్చి ....కాలేజీ కి వెళ్లేటప్పుడు ఆటోవాడు...రోజా తో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని.. ఏడిపించాడు అని.. చెప్పింది. పౌరుషం గా పైకి లేచి బయటకు వెళ్ళడానికి షర్టు వేసుకున్నాడు విగ్నేష్. " ఎక్కడికి వెళ్తావు ..విగ్నేష్.. వెళ్లొద్దు... ..వద్దు ...ఇప్పుడేమైంది అసలు..ఆ వెధవ ఎవడో దాన్ని ఏడిపించాడు అంతే కదా. అది వచ్చాక విషయం అడిగి రేపటినుండి ఆదారిలో అసలు వెళ్లొద్దని.. చెబుదాం." " నేను ఊరుకోను నాన్న.. ఈ విషయంలో పోలీస్ కేసు పెడతాను." " ఓ గొప్ప.. దిగి వచ్చాడమ్మా.. ఒరేయ్ ఇప్పుడు కేసు కి ముందుగానే నాలుగైదు వేలు కావాలి అనుకో... అదెలా తేగలవు అసలు? సరే ఒకవేళ నువ్వు కేసు పెడితే..రేపు వాడు అలాగే చేతకానివాడిలా ఊరుకుంటాడా... కాపుకాసి.....యాసిడ్ దాడి చేయొచ్చు. లేదా నలుగురు ఆటో వాళ్ళని పోగేసి నీ చెల్లిని ఊరి చివర కొండల్లోకి తీసుకెళ్లి ఏదైనా చేస్తే... అది చచ్చిపోతే....? కాసేపటికి కాలేజీ నుండి రానేవచ్చింది రోజా. "విషయంతెలిసింది ..అమ్మా..రోజమ్మా ..నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావే... " అడిగాడు తండ్రి. తండ్రి ప్రశ్నలోని పటుత్వాన్ని గ్రహించింది రోజా.. " కాలేజీ మానేస్తాను నాన్న.. " టక్కున జవాబు చెప్పి..ఏడుస్తూ ఇంట్లోకి వెళ్లి పోయింది. మౌనం వహించాడు పట్టాభిరామయ్య. వారం గడిచింది. " అదేమిటి నాన్న జీవితంలో ప్రతి విషయం చచ్చిపోతూ బ్రతకమంటావు" అడిగాడు విగ్నేష్ . " దీన్ని చచ్చిపోతూ బ్రతకటం అనరురా..... సర్దుకుపోతూ బ్రతకడం అంటే.. చాలా.. చాలా బాగుంటుంది. నీకు చాలా విషయాలు చెప్పాలి. రా ఇలా కూర్చోమీద కూర్చో". పట్టాభిరామయ్య తన "ఫ్లాష్ బ్యాక్" చిట్టా విప్పాడు. తన అన్నగారు ఆస్తిపంపకాల్లో తనను, తన భార్యను భయపెట్టడం కోసం.. పదిమంది గుండాలని పోగు చెయ్యటం.. వాళ్లతో దౌర్జన్యం చేయించడం.. తను కత్తితోనరికి నట్టు.. కత్తి సృష్టించి , రక్తం సృష్టించి..పోలీసులనునమ్మించి దొంగ తప్పుడు కేసులు పెట్టించి.... ఐదేళ్లు అనవసరంగా తనను కోర్టుల చుట్టూ .... తిప్పించడం కళ్ళు లేని ఆ పోలీసు వ్యవస్థ.. ఆ కోర్టు వ్యవస్థ..డబ్బుతో ప్రాణాలు తీసే ఆ గూండాగిరి వ్యవస్థ.. ఛీ.. ఛీ.. జీవితం మీద విరక్తిని పెంచే ఆపద్ధతులకు తను బలైపోయిన తీరు..చిట్టచివరికి దుర్మార్గత్వంతో తన అన్న గారు చెప్పిన పంపకాల పద్ధతికే ఇష్టపడి ఆ ఊబిలో నుంచి అతి కష్టం మీద బయటపడ్డ.. "గతం" పూర్తిగా వివరిస్తూ గుర్తుచేశాడు కొడుక్కి పట్టాభి రామయ్య. " నాన్న..మీరు చెప్పింది యదార్థమే. కానీ అన్ని విషయాలు ఒకే గాటన కట్టేసి చూస్తే ఎలా??ఇప్పుడు చట్టాలు చాలా ....పకడ్బందీగా ఉన్నాయి.తప్పు చేసినవాడికి శిక్ష పడేతీరాలి. అసమర్థులకు, అమాయకులకు చేయని నేరానికి జైలు శిక్షపడటం ప్రమాదం అని మీ అభిప్రాయం. కాదనను.. కానీ.....అదే... అమాయకులు ఓదుర్మార్గుడు చేస్తున్న నేరాన్ని చూస్తూ ఊరుకోవడం కూడా ఇంకా చాలా చాలా పెద్ద ప్రమాదం అని నా అభిప్రాయం కాదంటారా? " "" నువ్వు సంసారబంధం లేని బుజ్జి గాడివిరా. ప్రాణం రూపాయి పావలా కన్నా చవక అయి పోయిన ఈ రోజుల్లో కక్ష , కసి,ద్వేషం, అన్యాయం, దుర్మార్గత్వం ల బారిన పడొద్దు. హాయిగ బ్రతుకుదాం ..జరిగిపోయిన చిన్న పెద్ద నష్టాలని మరిచిపో . రాబోయే కష్ట నష్టాలను కూడా మర్చిపోవడానికి సిద్ధంగా ఉండు. ఏమిటి అలా చూస్తున్నావు.. నీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నావో నాకు అర్థం అవుతుంది రా. " నాన్నా నువ్వు ఒక తండ్రి వేనా... రేపొద్దున నన్ను ఎవరైనా రైలు పట్టాల మీదకు తోసి చంపేసిన.. నాకెందుకులే అని ఊరుకుంటా వన్నమాట... నీ పద్ధతి నాకు నచ్చలేదు నాన్నా" అని నువ్వు మనసులో అనుకుంటున్నది... నాకు అర్థం అవుతుంది రా. నా పద్ధతి నీకు నచ్చడం ముఖ్యం కాదురా. ఈ మాయా నగరంలో ఏ రోజుకారోజు ...మన కుటుంబ సభ్యులు నలుగురం ప్రాణాలతో క్షేమంగా ఉండటమే నాకు ముఖ్యం."" **** **** ***** కొన్నాళ్ళకు... విగ్నేష్ కు దగ్గర సంబంధం చూసి పెళ్ళి జరిపించేశాడు పట్టాభిరామయ్య. అయితే.... అదే...విగ్నేష్ పాలిట శాపం అవు తుందని కలలో కూడా ఊహించలేదు విగ్నేష్. పెళ్లయిన తర్వాత నెల గడిచాక భార్యతో సినిమాకెళ్లి... రాత్రి ఇంటికి నడిచి వస్తుంటే వర్షం మొదలైంది. రోడ్డంతా బురదమయం అయింది. అప్పుడే.. వాళ్ల పక్కనుంచి దూసుకెళ్లింది.. టాటాసుమో...! విగ్నేష్ భార్య మల్లిక తెల్లచీర ఖరాబు అయ్యింది. విగ్నేష్ ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు. ముందుకు వెళ్ళి పోయిన టాటా సుమో అలాగే వెనక్కు వచ్చింది. విగ్నేష్ ఏదో అడుగుదాం అనుకుంటుండగా తండ్రికి చేసిన ప్రమాణం... భార్య వెనక్కు లాగే తత్వం.. అడ్డు వచ్చాయి. అతను..' ఎర్రి నాయుడు'.... ఎమ్మెల్యే గారి అనుచరుల్లో ప్రప్రథముడు.. కుడి,ఎడమ భుజం కూడా!!. " ఏందిరా అట్టా సూత్తున్నావు..?? " అరిచాడు అద్దాలప్రేమ్ క్రిందకు దింపి ... .. ఎర్రినాయుడు. " అన్నా, ఈడు.. మనల్ని మనసులో తిట్టు కుంటున్నాడన్నా.... "ఎర్రినాయుడు ని రెచ్చ గొట్టాడు గుబురు మీసాల అనుచరుడు. " అన్నా ఈడి పెండ్లం.. మంచి జబర్దస్త్ మీదున్నాది.. కావాల్నా... " అడిగాడు మరో భీమునిలాంటి అనుచరుడు. "నడవండ్రా" అరిచాడు ఎర్రినాయుడు అంతే.... ఎర్రినాయుడు బలవంతంగా వాళ్ళిద్దర్నీ కారు ఎక్కించి తన పాతబంగళా కి తీసుకెళ్ళిపోయాడు. అనుచరులు విగ్నేష్ ను కుర్చీకి కట్టేసి..మల్లికను లోపలున్నఎర్రినాయుడి కి అప్పచెప్పారు. గంట తర్వాత.. మల్లిక చెదిరిన ఆకారంతో ఏడుస్తూ వచ్చింది గదిలోంచి బయటకు. ***** ****** ****** వారం నుండి... కొడుకు కోడలు ప్రవర్తన అర్థం చేసుకోలేకపోతున్నాడు పట్టాభిరామయ్య. ఏదో పెద్ద సమస్యే అని గుర్తించగలిగాడు. విషయం ఏమిటో తెలుసుకునే ప్రయత్నమూ చేశాడు. " విగ్నేష్.. సమస్య ఎంత జటిలమైన ఈ మాయానగరం లో మనం ఏమి చేయలేమురా. ఒకవేళ చేసినా తెల్లారేసరికి లారీ మన మీదకు ఎక్కేసి యాక్సిడెంట్ లో మనం చచ్చిపోవచ్చు. లేదా మన ఇంట్లో... మనకు తెలియకుండా మనమే మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకొని ఉండొచ్చు...! అలా ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా... అవమానాలు భరిస్తూ...... బ్రతకడమే బెటరేమో..! పిరికిమందు నూరినూరి బాగా పోస్తున్నాను.. అని అనుకుంటున్నావు కదూ.. వ్యవస్థ మొత్తంకుళ్లిపోయిందిరా. మామూలోడు ఎదిరించి నిలబడలేడు... ఈ మాయానగరం సాలెగూడురా ఇదొకచదరంగంlపద్మవ్యూహం!! కోడలా మల్లికా.... అబ్బాయి ఎలాగూ నోరు మెదపడంలేదు. కాస్త.....నువ్వైనా చెప్పమ్మా. వారం క్రితం ఏం జరిగింది అసలు??" " ఏం జరగలేదు మామయ్య గారు.. అంతా బాగానే ఉంది." కోడలు కొసరికొసరి అన్న మాటలు బాగానే అర్థం అయ్యాయి పట్టాభిరామయ్య కు. ******* ******* ****** తన ట్యూషన్ పనులన్నీముగిశాక.. రాత్రి నడుచుకుంటూ ఇంటికి వస్తున్నాడు.. పట్టాభి రామయ్య ఈ రోజు కూడా వర్షం కురిసి వెలసింది. రోడ్డంతా బురదబురద మయమైంది. మళ్లీ అదే టాటాసుమో..... ఈసారి పట్టాభిరామయ్య పంచె ఖరాబైంది బురదతో. పట్టాభిరామయ్య ఆగిపోయి వెనక్క తిరిగి చూశాడు. ముందుకు వెళ్లి పోయిన టాటా సుమో అలాగే వెనక్కు వచ్చింది. ఫ్రేమ్ బిల్వారి అద్దం క్రిందకు దిగింది. " ఒరేయ్.. వారం క్రితం తగిలినోడులాగే వీడు కూడా పెద్ద విపిగాడు లాగే ఉన్నాడురా.. పిచ్చిగా, వెకిలిగా నవ్వుతూ అన్నాడు...ఎర్రి నాయుడు. "గురువా.. ఈడు వెంట ఆడపిల్లలు ఎవరూ లేరు. అదే పెద్ద బాధ. అయినా రోజు అలాంటి బేరాలు తగలవు. ఆడికి ఈడు తండ్రేమో!!వాలకం చూస్తే అట్లనే ఉంది. గురువా.. ఆరోజు ఆ పిల్లని నువ్వు నంజుకు తిన్నాక..మేం కూడా చప్పరించి పాడేసాం... భలేరుచిగా ఉంది.. వీడు ఉత్తి వేస్ట్ గాడు. కూడా ఆడంగులు ఎవరూ లేరు. ఏం చేస్తాం.. పోదాం పద అన్నా." ఎర్రి నాయుడు అనుచరులు నీరసంగా అన్నారు. మారుతి కారు కదలబోతోంది. " ఆగండి.. వారం క్రితం ఏం జరిగింది అసలు? సమాధానం చెప్పి కదలండి." అరిచాడు కోపంగా పట్టాభిరామయ్య. " ఎవడ్రా నువ్వు... మా ఎర్రినాయుడు అన్న తోనే మాట్లాడే ధైర్యమా?? అయినా సరదా సరదా ఇసయం అడిగావు కనుక చెప్తుండా. వారంక్రితం సరిగ్గా ...ఇదేసమయం, ఇదే వర్షం ,ఇదే చోటు, ఇదేబురద... ఆ పిల్ల పేరు.. ఆళ్ళు.. మాట్లాడుకుంటే మా కెరుక అయినది. " మల్లిక అంట.. " బాగా అందరం నంజుకు తిన్నాం. ఇంతకన్నా....నీకు అనవ సరం ... ఎళ్ళు... " " మల్లిక నా కోడలు.. విగ్నేష్ నా కొడుకు. నిజం చెప్పండి వాళ్లని ఏం చేశారు? ఎర్రినాయుడు ...నీది తప్పుదారి.. నాశనం అయిపోతావు." పిచ్చిగా కేక పెట్టాడు పట్టారామయ్య. "ఓరి.. మాకే శాపాలు పెడుతువా... అన్నా.. ఈడు పెమాదం చేయగలడు. హూ... అను... పురుగుల మందు పట్టించి.. రైలు పట్టాల మీద దింపుతాం" " చెప్పి చేస్తుండ్రు సిగ్గు లేదురా .... " అంతే .....అంతే......... కడుపులో పురుగులమందు తో కాసేపట్లో రైలు పట్టాల మీద పడున్న పట్టాభిరామయ్య... నిస్సత్తువగానే జేబులోంచి ' సెల్' తీశాడు. " నా ..య..నా...విగ్నే...ష్ ... నేను..నేను కాసేపట్లో.. చచ్చిపోతానురా... కానీ.. ఒకందుకు సంతోషిస్తున్నాను బాబు...ఈ మాయానగరంలో నువ్వు నన్ను పోగొట్టుకొంటున్నావు గాని.. నిన్ను నేను పోగొట్టుకోవడంలేదు కదరా.. అలా నేనే మహావిజయంసా..ధించాను...రా....!!?? నీ పాలిట నీ భార్య పాలిట యముడు ఆ ఎర్రినాయుడు.. ఆడే.. నా పాలిటకూడా కాలయము డయ్యాడు. మీ ఇద్దరు గురించిన విషయం నాకు తెలిసి నందుకే.. నాకు పురుగుల మందు పట్టించి రైలు పట్టాల పై ప..డే...సాడు..బాబు..వద్దురా..ఏమీ..ఆలోచించొద్దు.. పోలీసులు..ప్రశ్నిస్తే అడిగితే..ఏదో చెప్పేసి.. నువ్వు, నీ పెళ్ళాం, తల్లి చెల్లి తో... పారిపోండిరా.... "" ' సెల్' జారిపోయి పట్టాభిరామయ్య చేతినుండి కింద పడి పోయింది. ****** ****** ******* " శవాన్ని ..గుర్తుపట్టండి ..గుర్తుపట్టండి.. " " మా నాన్నే..పట్టాభి..రామయ్య... " " ఎలా చనిపోయాడు అంటారు ఎవరైనా శత్రువులు ఉన్నారా? " " ఎవరూ లేరు.. అప్పుల బాధ భరించలేక చచ్చిపోతానని అనేవాడు. చివరికిలాపురుగుల మందు తాగి... ఆత్మహత్య చేసుకున్నాడు." శవాన్నిఅప్పచెప్పాక..బాధతోకార్యక్రమాలన్నీ పూర్తి చేశాడు విగ్నేష్. ఆ రాత్రే భార్య ,చెల్లి ,తల్లి తో..రైల్వే స్టేషన్కు వచ్చాడు. ఆ మాయానగరానికి దూరంగా వెళ్లి పోవాలనేది విగ్నేష్ ఆలోచన.! 'బంధం' అంటూ ఒకటి ఏర్పడ్డాక... గతంలో ఉండే పౌరుషం, కసి, పట్టుదల అన్నీచచ్చిపోయాయి విగ్నేష్ లో. తాను ఎక్కవలసిన రైలు ఇంకాసేపట్లో వస్తోంది ..అనగా.. విగ్నేష్ భార్య మల్లిక.. అక్కడ బల్లమీద కూర్చుని తదేకంగా ఒక "దృశ్యం" ...చూడసాగింది.! ఒక చీమ... తనకన్నా నాలుగురెట్లు పెద్దది అయిన పంచదార పలుకును.. తన గమ్యానికి చేర్చే ప్రయత్నంలో.. దొర్లిస్తుంది. ఆ పలుకు... తన దారిలో అడ్డొచ్చిన ఎత్తుపల్లాల కి జారి జారి ఎక్కడికో వెళ్లి పడిపోతుంది. అయినా రెట్టించిన ఉత్సాహంతో వెనక్కువెళ్లి ఆ పలుకును మళ్లీ గమ్యానికి చేర్చేమొక్కవోని దీక్షాప్రయత్నం .. అలా అలా చేస్తూనే ఉంది. మళ్లీ మరింతమరింత పాతాళానికి జారిపడి పోతుంది. అయినా..మళ్లీమళ్లీ అదేఅదే ప్రయత్నం!!! చిట్టచివరికి విజయం సాధించింది .... ఆ పంచదార పలుకును తాను అనుకున్న గమ్యానికి చేరవేసింది.!.. చీమ చాలా చిన్నది. .ఆ పంచదార పలుకు దాని కన్నా 10 రెట్లు పెద్దది.. ఇది ఎలా ..ఇది ఎలా సాధ్యం? !!! ఈ సంఘటనతో మల్లిక శరీరం జలదరించి నట్లు అయింది.!! ఏదో కర్తవ్యం బోధపడిందినట్లయింది.!! ఎక్కవలసిన రైలు అప్పుడే వచ్చి ప్లాట్ ఫామ్ మీద ఆగింది. తనవాళ్లు కదిలి రైలు ఎక్క బోతున్న మల్లిక..కదలలేదు..చలించలేదు.. పైకిలేవలేదు.. " రా మల్లిక..ఏమిటి అలాఉండిపోయావు.? రైలు కదులుతుంది.త్వరగా రా.. " చాలా గట్టిగా అరిచాడు విగ్నేష్. " ఒరేయ్ విగ్నేష్.. ఇక్కడ కొచ్చి మీ నాన్న గారిని పోగొట్టుకున్నాను. ఇక్కడవద్దురా దూరంగ వెళ్లిపోదాం .రైలుకదులుతుందిగా...... మల్లికను త్వరగా రమ్మన రా" విగ్నేష్ తల్లి కంగారు పెట్టింది. " అన్నయ్య ..ఈ మాయాపట్టణం రాక్షస గృహం లా కనిపిస్తుంది. ఇక్కడ బ్రతకలేము. అన్నయ్య..వదినను త్వరగా రమ్మనిపిలువు." చాలా బాధగా కంగారుగా అంది రోజా. " ఆగండి.. మీ బాధలు కంగారులు.. అన్ని కట్టిపెట్టండి... ఎక్కడికివెళ్ళినా..ఎంతదూరం వెళ్ళినా ఈమనుషులే ఉంటారు....అందుకనే ఇక్కడే ఉండి చచ్చేవరకు పోరాటం చేయాలనే నిర్ణయానికి వచ్చాను. కెరటం సైతం పడిలేస్తూ తీరానికి చేరుతుంది. అలాగే మనిషి కూడా!!!! " ఖచ్చితమైన అభిప్రాయంతో పైకి లేచి కంచుగంట లా మాట్లాడిన మల్లిక మాటలకు.. విస్తుపోయారు మిగిలిన ముగ్గురు.కదులుతున్న ట్రైన్ నుంచి దిగి పోయి మల్లికను చేరారు. ఆమె వదనం ఏదో సాధించాలన్న గుర్తుగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. "నేనుమహిళాసంఘాలు,స్త్రీవాదసంఘాలు, అభ్యుదయసంఘాల సమాలోచన తో ... ఆ ఎర్రి నాయుడి ఇంటికి వెళ్తాను. అందరం అక్కడ ధర్నా చేసేలా చేస్తాను. వాడికి సంకెళ్ళు వేసి లాక్కొని తీసుకువెళుతున్న... ఆ..." దృశ్యం".. అన్ని టీవీ ఛానళ్లలో రాష్ట్ర ప్రజలంతా చూడాలి. తర్వాత జరిగేది కాలమే నిర్ణయిస్తుంది. ఇంకా మనదగ్గర పోవడానికి .. ప్రాణాలు తప్పించి ఏమీ లేవు గా.. ఇదే నా నిర్ణయం" ఓ వీరవనితలా ఉరుము ఉరిమినట్లు అంది మల్లిక. అంతే..ఆమెలో సాహసానికి, వీరత్వానికి, ధీరత్వానికి, తెగింపు కి ఆశ్చర్యపోయారు...ఆ ముగ్గురు... ఆమెలో వాళ్లకి ఓ వీరనారి ఝాన్సీ కనబడుతుంది. ప్రతీకారం తీర్చుకున్న ఓ ద్రౌపది కనబడుతుంది.!!!! ఎర్రినాయుడు ఇంటికి త్వరగా చేరి అతన్ని బజారుపాలు చేయాలన్న దృఢసంకల్పంతో..... ముందుకు పడుతున్నాయి మల్లిక అడుగులు!!! " ఆడది అగ్నికణం ఐతే .. ఈ,,, దూదిప్రపంచం.... భగ్గుమనక మానదు!! " ******* ****** ******* . "

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు