నైవేద్యం - యు.విజయశేఖర రెడ్డి

Naivedyam

ఒక వనంలో అమ్మవారి గుడి ఉంది. భక్తులు అక్కడ మూడు రాళ్ళ పొయ్యిలతో వంటకాలు చేసి పూజారికి ఇస్తే, ఆయన పూజలు చేసి ఆ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి కొద్దిగా ప్రసాదం కింద తీసుకుని మిగతాది వారికి ఇస్తాడు.

ఒక రోజు మూడు కుటుంబాలవారు వచ్చారు.మగవాళ్ళు ఒక వైపు కూర్చుని ఉన్నారు. పిల్లలు వనంలో ఆడుకోసాగారు. వంటలు చేసే ఆ ముగ్గురు లక్ష్మి,సీత,పార్వతి. ముందుగా వారు కూరగాయలు తరిగి తరువాత మూడురాళ్ల పొయ్యి వెలిగించి వంటలు చేయసాగారు.

లక్ష్మి మౌనంగా కూరలు తరిగి...అంతే మౌనంగా వంటలు చేయసాగింది. సీత,పార్వతి మాత్రం పనికి మాలిన మాటలతో కూరలు తరిగి వంటలు చేయసాగారు. ఇదంతా పూజారి గమనిస్తూనే ఉన్నాడు.

తరువాత ఆ వంటకాలను ఆ ముగ్గురు స్త్రీలు తమ భర్త పిల్లలతో గుడిలోకి తీసుకు వచ్చారు. అప్పుడు పూజారి “అమ్మల్లార... మీ ముగ్గురులో ఒక్క లక్ష్మి గారి వంటకమే పూజకు నైవేద్యంగా పనికి వస్తుంది. కూరలు తరిగేప్పుడు ఇంక వంట చేసేప్పుడు మీరు లేనిపోని కబుర్లు చెబుతూ వంటలు చేసారు. మాట్లాడేప్పుడు నోటి తుంపరాలు కోసిన కూరగాయాలలో పడతాయి... అదే విధంగా వంటకాలు చేసేప్పుడు కూడా జరుగుతుంది. మీరు చేసేది దైవ కార్యం, మౌనంగా పనులు చేయాలి మనసులో దైవాణ్ణి ప్రార్దిస్తూ, వంటకాలు చేయాలి. అప్పుడే ఆ వంటకం ఎంతో రుచిగాను స్వచ్చంగాను ఉంటుంది” అని చెప్పాడు పూజారి.

“మా వల్ల తప్పు జరిగింది.. మరి ఇప్పుడు ఎలాగ పూజారి గారు?” అన్నారు. సీత,పార్వతి. “లక్ష్మి చేసిన వంటకాని నైవేధ్యంగా సమర్పించి.. మీతో పూజలు చేయిస్తాను. ఆ ప్రసాదం తీసుకుని, మీరు చేసిన వంటకాలను మీ కుటుంబాలతో భుజించి వెళ్లండి.. ఇంకో సారి ఇలాంటి తప్పిదం జరగదు అని అమ్మవారిని వేడుకోండి” అని పూజారి చెప్పాడు. “అమ్మా! తప్పయ్యింది క్షమించు” అని సీత,పార్వతి చెంపలు వేసుకుని పూజారి చెప్పిన విధంగా చేశారు***

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు