ఊరికి దక్షిణాన! - రాము కోలా.దెందుకూరు.

Vooriki dakshinana

అమావాస్య. సమయం అర్దరాత్రి దాటింది. అంతవరకు వ్రాయవలసిన రికార్డ్స్ కంప్లీట్ చేసి, మెల్లగా దివాన్ పైన నడుము వాల్చేసా!. గోడ గడియారం ఎప్పుడూ లేనివిధంగా! , టంగ్..టంగ్.. టంగ్ మైనే శబ్దంతో గుండెల్లోంచి రైళ్లు పరుగెత్తిస్తుంది. ఆకు కూడా కదలడానికి భయపడుతున్న సమయంలో.. పెను తుఫాన్ తాకిడికి ఊగినట్లు ఊగిన మర్రి చెట్టు,తన కొమ్మలను నేలపైపుకు వంచుతుంది. నేలను చీల్చుకుని వస్తున్న చేతులు కొమ్మలకు ఉన్న ఆకులు అందుకుంటున్నాయ్. బహూశా అది నా భ్రమే అనుకున్నా! షుమారుగా నూటయాభై సంవత్సారాలు వయస్సున్న చెట్టు కొమ్మలు నేల వైపు వంగుతూ రావడం ఏంటో? అర్థం కాలేదు నాకు. కిర్ర్...ర్..ర్ మనే శబ్దంతో కిటికీ మెల్లగా తెరుచుకుంటుంది. తెగిన నల్ల కోడి కుత్తుక నుండి రక్తం చుక్కలు చుక్కలుగా పడుతున్నా! చేత పట్టుకుని తడబడే అడుగులతో ముందుకు నడుస్తుందో ఆకారం. ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ భాగంలోని కిటికీ మాత్రం తెరిచే ప్రయత్నం చేయోద్దు. పదేపదే చెప్పి కాశీకి వెళ్ళింది బామ్మా. వారం రోజుల్లో ఎప్పుడూ! కిటికీ తెరిచే ప్రయత్నం చేయలేదు నేను . కారణం బామ్మా మాటంటే వేదవాక్కు నాకు . కానీ!ఈ రోజు ఎందుకో తెరిచి చూడాలని పించింది . అంతగా చూడకూడని రహస్యాలు ఏమీ ఉండి ఉంటాయ్ , అనిపించింది. నా మనసులో భావం గ్రహించిందేమో?.కిటికీ చిన్నగా కిర్ర్...ర్..ర్ మనే శబ్దంతో మెల్లగా తెరుచుకుంటుంది. మరో చేతిలో భగ భగ మని మండుతున్న నిప్పులు కుంపటి పెట్టుకున్న ఆకారానికి వెనుకగా నడుస్తున్న మరో ఆకారం,ఆగి ఆగి ఏదో కుంపటి పైన చల్లుతుంది. బహుశా క్షుద్ర పూజలు నిర్వహించేవారం చల్లే గుగ్గీళ్ళం అయివుంటుంది. అందుకే చుట్టూ తెల్లని పోగా కమ్ముకుంటుంది. ఏమై ఉంటుంది? అసలు ఇంత రాత్రి సమయంలో అలా తిరగాల్సిన అవసరం వాళ్ళకు ఏంటి.? అనుకుంటూ లేచి కిటికీ దగ్గరగా నిలిచి చూసే ప్రయత్నం చేసా. ఎంత ప్రయత్నించినా ఆకారాలను గుర్తించలేక పోతున్నా! కారణం వాళ్ళు అదోరకమైన వస్త్రదారణలో ఉండడమే కావచ్చు.! అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆకాశం భయంకరంగా గర్జిస్తుంది. ఆమెరుపు వెలుగులో జాగ్రత్తగా చూసా! ఒక చిన్న పిల్లను లాక్కుంటూ వెళుతున్నారు. పరిస్థితి అర్థం అవుతుంది. అక్కడ‌ చిన్న పిల్లను బలి ఇచ్చే ప్రయత్నం జరుగుతుందనేది . ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు అనుకుంటూ టార్చ్ లైట్ తీసుకుని అదే కిటికీ నుండి బయటకు దూకేసాను. ***** గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నేల అంతా చిత్తడిగా మారిందేమో.శరీరం మొత్తం బురదతో నిండిపోయింది. చుట్టూ చూసాను! అప్పుడు ఆర్దమైంది ,కదిలే క్రీనీడలను చూస్తూ నేనే ఏదో ఊహించుకుంటూ కిటికీలోనుండి బయటకు దూకేసానని. ‌*శుభం*

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు