దారి చూపించాడు! - రాము కోలా.దెందుకూరు.

Daari choopinchaadu

కారు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకు పోతోంది . కార్లో ఉన్న మధన్ పదే పదే తన చేతికి ఉన్న వాచ్ వంక చూస్తున్నాడు. వేగాన్ని సెకనుల్తో సహా ,మనస్సులోనే లెక్కించుకుంటూ అసహనంగా . కారణం తను చేరుకోవాల్సిన ఫంక్షన్ సమయం అసలు కారణం . కారు స్పీడో మీటర్ 135 చూపిస్తుంది. కాలం అతని సహనాన్ని పరిరక్షించేందుకో,లేక! మరో కారణమేమో.. కారు ఒక్కసారిగా తుఫాన్ లో చిక్కుకున్న నావలా ఊగి ప్రక్కకు లాగేస్తూంది. వేగిన్ని కంట్రోల్ చేసుకుంటూ,రోడ్డుకు కాస్త ప్రక్కన పార్క్ చేసి ఏమైవుంటుంది ! అనుకుంటూనే దిగి చూసాడు, ముందు టైర్ పంక్చర్. తన తప్పు ఏమీ లేదన్నట్లుగా ముడుచుకుని కనిపిస్తుంది గాలి లేక.ఏ "బుల్ షిట్ "ఈ సమయంలో ఇలా ? అసహనంతో రోడ్డు పైన కనిపిస్తున్న రాయిని బలంగా తన్నేసి చుట్టూ చూసాడు .. అతన్ని మరింతగా అసహనానికి గురిచేయడం కాలానికి ఇష్టం లేదేమో? కాస్త దగ్గరగా ఓ పంక్చర్ ‌షాపు కనిపించడంతో భార్య సమేతంగా వెళ్ళి తలుపు కొట్టాడు మధన్. ‌*** రోడ్ వెంట ఖాళీ స్థలంలో వేసుకున్న చిన్న పూరిపాక ఆది. లోపలి నుండి వచ్చిన వ్యక్తిని ఎక్కడో చూసిన గుర్తుకు వస్తున్నా ఇప్పుడు అంతా అవసరం లేదులే అనిపించింది మధన్ కు తన కారు టైర్ పంక్చర్ అయిందని వచ్చి చూస్తే అడిగినంత డబ్బు ఇస్తానని చెప్పాడు మధన్.. "అయ్యె..సార్ అవసరాన్ని బట్టి అడిగే అలవాటు నాకు లేదు. "ఒక్క పది నిముషాలు ఓపిక పట్టండి! వచ్చేస్తాను ." అంటూ గదిలోకి వెళ్ళి పోయాడు సదరు పంక్చర్ వేస్తానన్న వ్యక్తి. అడిగినంత డబ్బు ఇస్తానంటే‌ సంతోషంతో వెంటనే వస్తా అంటాడు కున్న మధన్ కు నిరాశ ఎదురైంది. కాలం పరుగెడుతుంది. ఫంక్షన్ సమయం దగ్గర పడుతుండటంతో మధన్ అసహనంగా "ఇతను లోపల వెలగబెట్టే అంతగా రాచకార్యం ఏముంటుంది" అనుకుంటూ లోపలికి తొంగి చూసాడు. రెండు కట్టె మంచాలు.. మంచంలో ఇద్దరు వృద్దులు. ఇద్దరిది లేవలేని పరిస్థితి .ఇద్దరి మధ్యలో మొకాళ్ళ పైన నిలబడి వారికి అన్నం తినిపిస్తూ కనిపించాడు అతను బహుషా! అతని తల్లి దండ్రులు అనుకుంటా!. చిన్నతనంలో అమ్మ కొసరి కొసరి లాలించి బుజ్జగించి తినిపించినట్లు గా తినిపిస్తున్నాడు. వారు తినే ప్రతి ముద్దుతో తన కన్నుల్లో తృప్తి నింపుకుంటూ. "ఇంత చిన్న ఇంట్లో తన తల్లిదండ్రులను ఇతను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. మరి తను .లక్షలు జీతం వస్తున్నా, లంకంత ఇల్లు ఉన్నా తల్లిదండ్రులను ఎందుకు అనాధాశ్రమంలో చేర్పించి, తను మాత్రం సమాజంలో ఒంటరిగా బ్రతుకుతున్నాడో! తల్లి దండ్రుల కన్నుల్లో సంతోషంతో పాలను చూసే అదృష్టం ఎందుకు దూరం చేసుకున్నావ్! ఇదేనా! నీకు చదువు నేర్పిన సంస్కారం.. అని మనసు ప్రశ్నిస్తుంటే తనకు కనువిప్పు కలిగించిన వ్యక్తికి మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆశ్రమంకు వెళ్ళి తన తల్లి దండ్రులను ఇంటికి తీసుకు రావాలని నిర్ణయం తీసుకున్నాడు మధన్.. రాత్రి సమయంలో శ్రమ అనుకోకుండా వచ్చి తన కారు టైర్ పంచర్ వేసిన వ్యక్తికి , లక్షరూపాయలు చెక్కు వ్రాసి ఇచ్చాడు. తల్లి దండ్రులను కనుపాపలు చాలా చూసుకుంటున్న అతని సంస్కారానికి శిరసువంచి నమస్కరిస్తు.

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు