కరుణాకర్ కరుణ - Boga Purushotham

Karunakar Karuna
ఎప్పటిలాగే తను స్వంతంగా ఏర్పాటు చేసుకున్న ఆస్పత్రిని
కంటికి రెప్పలా కాపాడుతూ పర్యవేక్షిస్తున్నాడు కరుణాకర్.
అతని ముఖం గాంభీర్యంగా వున్నా మనసంతా కరుణతో నిండివుంటుంది. ఎప్పుడో
నలభై ఏళ్ల క్రితం కార్డియాలజీలో డాక్టర్ కోర్సు చేసి ప్రాక్టీస్ పెట్టాడు. అప్పటి నుంచి ఆగే ప్రతి
గుండెకూ ఊపిరి పోయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు డాక్టర్ కరుణాకర్. అప్పటి నుండి
ఇప్పటి దాకా కొన్నివేలఆపరేషన్లు చేసి ప్రాణం పోశాడు. ఆయనంటే నెల్లూరు పరిసర
ప్రాంతాలకు నడిచే దేవుడు. ఆయన ఆస్పత్రిలో మొదట గుండెకు మాత్రమే శస్త్ర చికిత్సలు జరిగేవి.
ఆ తర్వాత గర్భిణుల ప్రసవ విభాగం, ప్రత్యేక ఆపరేషన్లు, సాధారణ
జబ్బుల విభాగం, మెదడు, నరాల జబ్బుల ప్రత్యేక చికిత్స విభాగం వంటివి
విస్తరించాయి.
ఎప్పుడూ కరుణాకర్ గాంభీర్యంగా వుండటం వల్ల ఎవరూ ఆయనతో
మాట్లాడేవారు కాదు. నిరంతరం తనవద్ద వున్న డాక్టర్లను యంత్రాల్లా
పనిచేయిస్తూ క్షణం తీరిక లేకుండా వైద్య సేవలు చేసేవాడు. ఆయనకు ఏ
మాత్రం కరుణ లేదని నిరంతరం డబ్బు సంపాదనలో పడి అందరిపై విరుచుకుపడుతూ పని
రాక్షసిలా తయారయ్యాడని అందరూ ఆయన్ని విమర్శించేవారు. అయితే
అదేమీ పట్టించుకునే వాడు కాదు కరుణాకర్. తనలో చివరి శ్వాస వున్నంత వరకు పరుల
ప్రాణాలను రక్షించాలని ఆలోచించేవాడు. అదే లక్ష్యంతో అయన స్వంత
ఊరిలో ప్రభుత్వ వైద్య శాల సూపరింటెండెంటుగా ఉద్యోగంలో చేరాడు.
అక్కడ వైద్యసేవలు వదిలిపెట్టి తన ఆస్పత్రిలో పనిచేస్తుంటాడు. ప్రభుత్వ
జీతం తీసుకుంటూ ప్రైవేటు ఆస్పత్రిని ఎలా నడుపుతారని ఇది చట్ట విరుద్ధమని
ఆయనపై పలువురు అభియోగాలు మోపి జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదులు చేశారు.
మేల్కొన్న జిల్లా వైద్యశాఖ కొద్దిరోజులకు అయన వైఖరిని ఖండిస్తూ
ఎంక్వయిరీ కి ఓ బృందంని పంపింది.
సరిగ్గా అదే సమయానికి రిపబ్లిక్ డే రోజు కావడం.. ఆయనకు ఉత్తమ
వైద్యసేవ పురస్కారం రావడం తనిఖీ బృందాన్ని అచ్యర్య చకితుల్ని చేసింది.
నిజానికి అయన ఒక్క రోజు కూడా ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్క రోగికీ వైద్యం
అందించిన పాపాన పోలేదు. ఇలాంటి సమయంలో ఏకంగా ఆయనకు ఉత్తమ డాక్టర్ అవార్డు
ఎలా వచ్చింది? అని చర్చించుకోసాగారు .
ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి అవార్డు వచ్చేలా చేశారు... ఎలాగైనా
అవార్డు అందుకోనివ్వ కుండా అడ్డుకోవాలని తనిఖీ వైద్యాధికారులు ప్రయత్నిoచారు.
అయితే అది ఫలించలేదు . అయన ఇప్పటికీ ఉత్తమ సేవ చేస్తున్నారని ఫై
అధికారుల వద్ద సమాచారం వుంది. ఎంత ప్రయత్నించినా ఆయనపై చెడు అభిప్రాయం
కొంచమైనా లేదు. ఇదెలా సాధ్యమైయిందని తనిఖీ బృందానికి అనుమానం వచ్చింది.
వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంక్వయిరి చేశారు. " అయన సరైన టైముకు
ఆస్పత్రికి రాడు.. ఒక్కరికీ వైద్యం చేయడు.. ఇక మిగిలిన డాక్టర్లు,
ఉద్యోగులు సైతం విధులు సక్రమంగా నిర్వహించడం లేదు... ఆస్పత్రి తీరు
అగమ్యగోచరంగా వుంది. . " అని రోగులు కరుణాకర్ ఫై తీవ్ర ఆగ్రహం వ్యక్తం
చేశారు.
అప్పటికే కరుణాకర్ ను సస్పెండ్ చేస్తూ నివేదికలు తయారుచేసి
జిల్లా వైద్యాధికారులకు పంపడానికి సిద్ధమయ్యారు తనిఖీ అధికారులు. అయితే
ఆయనకు అవార్డు ఎలా వచ్చిందో తెలుసుకోవాలన్న కుతూహలం వారిలో పెరిగింది.
వెంటనే వాళ్ళందరూ ఓ సాధారణ రోగుల్లా ఆ ప్రైవేటు ఆస్పత్రిలో
ప్రవేశించారు. ఓపీ టికెట్ తీసుకుని జనరల్ వార్డులోకి ప్రవేశించారు. వారి
కళ్లు ఆశ్చర్య చకితుల్ని చేసింది ఓ దృశ్యం.
అప్పుడే యాక్సిడెంటులో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి కళ్లు
,గుండెను వేరుచేసి మరో వ్యక్తికి అమర్చే ప్రయత్నంలో వున్నాడు డాక్టర్
కరుణాకర్. మరో వైపు మహిళల ప్రసవ విభాగంలో చికిత్సలు అద్భుతంగా
అందుతున్నాయి. వాటితో పాటు డెంగ్యూ , కరోనా విష జ్వరాల వ్యాధులకు
ప్రత్యేక చికిత్స విభాగాలు సేవలు అందిస్తున్నాయి. నిరంతరం అన్ని విభాలను
పర్య వేక్షి స్తూ, సమన్వయంతో పని చేయిస్తూ రోగులకు ఉత్తమ వైద్య సేవలు
అందించడం కళ్లారా చూశారు. ఇటు ఫీజులు సైతం సామాన్యులకు అందుబాటులో
ఉన్నాయని తెలుసుకున్నారు. ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లలో అధికమంది
ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లే అని గుర్తించారు.
అటు తర్వాత ఇలాంటి సేవలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎందుకు అందించలేక
పోతున్నారని వారిని పిలిచి ప్రశ్నించారు. ఫై స్థాయి అధికారులు " తమకు
సరైన మందులు, వైద్య పరికరాలు, సౌకర్యాలు కల్పించడం లేదు.. " అని ఫిర్యాదు
చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రోగులకు ప్రత్యేకంగా విష జ్వరాలకు, కరోనా వంటి రోగులకు
ఎలా వైద్య సేవలు అందించమంటారు? " అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నతో తనిఖీ బృందానికి సమాధానం ఏమి చెప్పాలో దిక్కు తెలియలేదు.
ఒకరి నొకరు చూసుకుని తెల్లముఖాలు వేశారు. తాము రూపొందించిన నివేదిక
పత్రాలను చించి వేశారు. దీనిపై ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేటు ఆస్పత్రి
నడుపుతున్నా నిస్వార్ధ సేవ చేస్తున్నారని .. డాక్టర్ కరుణాకర్ కు వైద్య
రత్న అవార్డును ఇవ్వడం సమంజసమే నని తనిఖీ బృంద సభ్యులు సమర్ధించారు.
మరుసటిరోజు కలెక్టర్ చేతుల మీదుగా వైద్య రత్న అవార్డు
అందుకుంటున్న డాక్టర్ కరుణాకర్ ను పుష్ప గుచ్ఛo తో అభినందించి
సత్కరించారు జిల్లా ప్రభుత్వ వైద్యాధికారులు. చేతిలో అవార్డు కరుణాకర్
నిస్వార్ధ సేవకు తార్కాణంగా నిలుస్తోంది.
ReplyForward

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు