పొదుపు చేసినమేలు - - బోగా పురుషోత్తం,

Podupu chesina melu

పుష్ప గిరిలో కొండయ్య అనే ఓ కూలీ ఉండేవాడు. అతనికి ముగ్గురు సంతానం. రోజూ కూలిపనికి వెళ్లి అంతో ఇంతో సంపాదించి సాయంత్రం మద్యం తాగివచ్చేవాడు. దీంతో వచ్చిన కూలి డబ్బులు మద్యానికే ఖర్చు చేసేవాడు .

కొండయ్య భార్య రేణుకమ్మ తెలివైoది. పిల్లల్ని బాగా చదివించేది. కొండయ్య తాగుడు అలవాటు ఎక్కువై రేణుకమ్మను డబ్బులకోసం హింసించేవాడు. దీన్నిఆమె మనస్సులోనే దాచుకుని సహించి వుండేది. కొద్దిరోజులకు అనారోగ్యానికి గురై కూలి పనికి వెళ్లడం మానివేశాడు. తీవ్రమైన జబ్బుతో మంచాన పడ్డాడు.
ఇది గమనించిన రేణుకమ్మ కూలీపనికెళ్లి డబ్బు సంపాదించి పిల్లలను చదివించసాగింది. పిల్లలు ఖాళీ సమయంలో కిరాణా కొట్టులలో పనిచేసి తమకొచ్చిన ఆదాయంలో కొంత సమీపంలోని పోస్టాఫీసులో దాచేవారు. కొన్నాళ్లకి కొండయ్యకి వ్యాధి తీవ్రమయింది. మంచం పట్టాడు. వైద్యం చేయాల్సిన అవసరం వచ్చింది. కనీసం మంచి ఆస్పత్రికి తీసుకెళ్లాలన్నా డబ్బులు లేక ఏమి చేయాలో దిక్కుతోచక సాయం కోసం ఎదురుచూడ సాగింది.
తాను పని చేసే ఆసామి వద్దకువెళ్లి అప్పు ఇవ్వాలని ప్రాధేయ పడింది. అతను నిరాకరించాడు. ఇక చేసేదేమిలేక బంధువులు, ఇరుగు,పొరుగు వద్దకు వెళ్లి డబ్బు ఇచ్చి ఆదుకోవాలని ప్రాధేయపడింది. అయినా ఎవరూ స్ప oదించలేదు. ఆందోళన అధికమై ఇంటికి చేరుకుంది." చివరకు భర్తకు వైద్యం అందించడం ఎలా ?" అని తీవ్రంగా ఆలోచించసాగింది.
సరిగ్గా అదే సమయానికి వచ్చింది పదో తరగతి చదువుతున్న రెండో కూతురు మునెమ్మ . నాన్న ఆరోగ్యంపై తల్లి బెంగ పెట్టుకోవడం కూతురిని కలవరపెట్టింది. " అమ్మా .. నాన్న ఆరోగ్యం కోసమే కదా నీ చింత ..?" ప్రశ్నించింది కూతురు మునెమ్మ. రేణుకమ్మ అవునన్నట్లు తల ఊపింది.
మరుసటిరోజే మునెమ్మ పోస్టాఫీసుకి వెళ్లిoది. అప్పుడప్పుడూ దాచిన డబ్బు పది వేల రూపాయలను తీసుకొచ్చి రేణుకమ్మ చేతిలో పెట్టింది కూతురు.
కూతురు ముందు చూపుతో కూడబెట్టిన డబ్బు పది వేల రూపాయలతో సమీపంలోని పెద్ద ఆస్ప్రతిలో చేరిపించింది రేణుకమ్మ . నెల రోజుల తరువాత టీబీ పూర్తిగా నయమైయింది. కూతురు దాచిపెట్టిన సొమ్ము ఆపద సమయాల్లో ఆదుకున్నందుకు కూతురిని ఎంతగానో అభినందించింది. తన భర్తకు వైద్యం అందించి ప్రాణాపాయంనుంచి రక్షించుకుంది రేణుకమ్మ.

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు