"ఏది జరగకూడదు అనుకునైనామో ? ఏదో జరిగి పోయింది.... అంతా ధైవాదీనం. మనం చేయగలిగింది ఏదీ లేదు. కానీ!ఇప్పుడు చేయవలసిన కార్యక్రమాలు ఎలా జరిపించాలో ఆలోచించండి." "కనీసం! రూపాయి ఎక్కడైనా దాచిందేమో, ఏమైనా తెలిసిందా?" అంటున్న మేనమామ మాటలకు, పార్వతమ్మగారి పిల్లలు తలలు వంచేసారు, ఏమీ తెలియదంటూ... "ఇన్ని రోజులు పెట్టిన పైసల ఖర్చుల లెక్కలు చూడండి," "తప్పదు కదా!, తలాకాస్త వాటా వేసుకుందాం," అంటున్న మేనమామ మాటకు, పూర్తి అవ్వక మునుపే ! ఈ మాట కోసమే ఎదురుచూస్తున్న పుత్రరత్నాలు . జేబుల్లో భద్రంగా దాచుకున్న లెక్కల కాయితాలు తీసి, టేబుల్ పైన ఉంచేసారు. అమ్మకు ఖర్చు చేసిన పైసా కూడా లెక్కలు రాసి పెట్టిన పుత్ర రత్నాలను చూసి పార్వతమ్మ గారి ఆత్మ నవ్వుకుంది. మీకోసమే నా ఈ తల్లి తల్లడిల్లుతుంది ,అనుకుంటూ... ****** కాలం వేగంగా పరుగులు తీసింది. కళ్ళు కాయలు కాసే లా ఎదురుచూస్తున్న క్షణం వారి ఇంటి ముంగిట్లో నిలిచింది. "పోస్టు" అన్న కేక వినిపించడంతో, ఒకే కాంప్లెక్స్ లోని అన్నదమ్ములు తల తిప్పి చూశారు పోస్టు మ్యాన్ వైపు. ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నారన్నది అక్కడ అందరికీ తెలుసు. "ఇక్కడ, ఫణి, రవి. తేజస్వి ఎవ్వరో వచ్చి సంతకం చేసి ఈ రిజిస్ట్రార్ పోస్టు తీసుకోండి." అంటున్న పోస్టు మ్యాన్ దగ్గరకు పరుగున చేరుకుని తమకు వచ్చిన కవర్స్ తీసుకుని ఓఫేన్ చేసారు ముగ్గురు.. అక్షరాలు వెంట వేగంగా పరుగులు తీస్తున్నాయి వారి నయనాలు. ****** వారి చేతుల్లో ఉన్నది పార్వతమ్మగారు వ్రాయించిన వీలునామా అని తెలుస్తూనే ఉంది . " తల్లిగా నా బాధ్యతలు ఎప్పుడూ విస్మరించనూ లేదు, ఆలాగే సమాజం కోసం ఏదో చేయాలనేది నా చిన్ననాటి కోరిక,అది కూడా మరువలేదు. నా ఆలోచలో మార్పులేదు." "మీకు ఆస్తి పంపకాలు జరిపిన రోజు నావాట నాదగ్గర ఉంచుకుని ,మీకు న్యాయ బద్దగా చెందవలసింది ఆస్తీని పంచేసాను." నా దగ్గర ఉన్న ఆస్తి తో మీకు ఎటువంటి సంబంధం లేదు. విలాసాలకు,సమాజంలో మీగుర్తింపుకోసం "మీ జల్సాలకు నేను పెంచిన ఆస్తి మొత్తం ఖర్చు చేసుకుని, చివరకు అప్పుల్లో మునిగిపోయారు. నా ఆస్తి కోసం నన్ను ఇబ్బంది పెట్టారు." " అయిన నా కుమారులు కదా అనుకున్నాను, సర్దుకున్నాను. " పెద్ద మనసుతో మన్నించాడు. " కన్న ప్రేమతో మీ కష్టాలను చూస్తూ వేదనతో చిక్కి శల్యమై.. మీ ముందు జీవశవంలా మిగిలిపోయాను. " " నాకు తెలుసు బ్రతికి ఉండగా ఏదైనా నేను చెప్పినా మీకు చాదస్తంగానే ఉంటుంది. " " నా దగ్గర ఉన్న ఆస్తులను నేను ఏ అనాధ శరణాలయాలకో ఇచ్చేయాలి అనునున్నా. కానీ మరో ఆలోచన చేశాను, మీకు కాస్త ఉపయోగపడాలని. " కన్న ప్రేమ కాదా! " ఆస్థి మొత్తంతో ఒక గార్మెంట్ షాపు పెట్టాను. అందులో మీకు మూడు ఉద్యోగాలు కేటాయించాను." "మీకు ఇష్టం ఉంటే చేయవచ్చు.. ఇందులో బలవంతం ఏమీ లేదు.కానీ మీరు నెల వర్కర్స్ లాగా మాత్రమే..ఓనర్స్ ఎప్పటికీ కారు.. " " దానిపైన వస్తున్న ప్రతి పైసా అనాధ శరణాలయానికే చెందుతుంది. మీకు ఇష్టం ఉంటే అక్కడ "జాన్ మార్టిన్ "ఉంటాడు. వెళ్లి కలవ వచ్చు.. ఇదే నేను మీకు చేయగలిగే చివరి సహాయం " "మీ అమ్మగా మీ క్షేమం కోరి నేను చేస్తున్న ప్రయత్నం.ఇది మీకు నచ్చక పోయినా ! అవమానకరంగా భావిస్తున్నా.. అది మీలోని అవివేకానికి నిదర్శనంలా మిగిలిపోతుంది. చివరి అవకాశం నిలుపుకుంటారో?లేక చేజార్చుకుంటారో మీ ఇష్టం. చదివిన ముగ్గురుకు కన్నీరు ఆగలేదు అమ్మ మనసు అర్దం అవుతుంటే...