తెల్లచీర....మల్లెపూలు..!! - డాక్టర్ కెఎల్వి ప్రసాద్

Tella cheera malle poolu

(గల్పిక )

శాంత ,శరత్ ల పెళ్లి ఇరుపక్షాల తల్లిదండ్రుల ఇష్టం తోనే ఘనంగా జరిగింది . వాళ్ళది ప్రేమవివాహము ,కులాంతర ,మతాంతర ,ప్రాంతీయేతర ,వివావాహం అయినప్పటికీ ఇరుపక్షాలకూ నచ్చడంతో ,వాళ్ళ ప్రేమకథ సుఖంతమై ,చక్క ని సంతోషకరమైన వైవాహిక జీవితానికి మార్గం సుగమం చేసింది . శాంత పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ భర్త శరత్ కు అన్ని రకాలుగా సుఖ సౌఖ్యాలను అందించే ప్రేమమయి . శరత్ మాత్రం తక్కువవా డా ?అతని రూపు రేఖలు నిజమైన మగాడి కి మాదిరి అన్నట్టుగానే ఉంటుం ది . అంతేకాదు ప్రతిరాత్రీ అతగాడు నిత్యమన్మధుడే మరి !అందుచేత వాళ్ళిద్దరి అన్యోన్య సంసారిక జీవితం ఆనందంగా గడిచిపోతుంది . పిల్లలు పుట్టగానే ,ఒకరిపట్ల మరొకరికి ఆకర్షణలు ,ప్రేమలూ సన్నగిల్లుతాయే మో !అలా అని అందరి విషయాన్ని అలాఊహించలేముగానీ ,కొందరి విషయంలో మాత్రం కొంతలో కొంత మార్పు సహజం . శాంత - శరత్ లు దీనికి భిన్నంకాదు . వయసు పెరగడంతో పాటు ,ఇంటి బాధ్యతలు ,ఆఫీసు బాద్యత లు ,కొన్ని ఎదురొచ్చిన అనవసరపు అలవాట్లు ,మనిషి జీవన శైలిని ఖచ్చితంగా మార్చేస్తాయి . అది తప్పకుండా ,కుటుంబం మీద లేదా తమ సంసారిక జీవితం మీద ప్రభావం చూపిస్తుంది . ఇద్దరు రత్నాల్లాంటి పిల్లలు పుట్టడం ,వాళ్లకి చదువుకునే వయసు వచ్చాక మంచి చదువు పేరుతొ ,ఎక్కడో దూరప్రాంతంలో మంచి పేరున్న స్కూల్ లో చేర్పించి వాళ్ళని హాస్టల్లో పెట్టడంతో ,శరత్ ఆఫీసుకు వెళ్లిన తర్వాత శాంత ఇంచుమించు వంటరి జీవితాన్ని గడుపుతోంది . కాలక్షేపం కోసం పుస్తకాలు చదివినా అవి మాత్రం ఎంత సేపు చదవగలుగుతుంది ?టి . వి ,చూద్దామన్నా అది మాత్రం ఎంతసేపు చూడగలుగుతుంది పాపం ! దీనికి తోడు ఆఫీసు పని పేరోతో శరత్ రోజూ ఆలస్యంగా రావడం ,అలసట అంటూ స్నానం చేసి ,డిన్నర్ తిని ,గురకపెట్టి నిద్రపోవడం ,ఆమెను ఎంతగానో నిరాశ పరుస్తున్నది .భర్త రాకకోసం ఎన్నో ఆశలతో ఎదురుచూడడం ,తీరా అతను వచ్చాక ,మాటామంతీ లేకుండా నిద్రకుపక్రమించడం ,తనకు క్రమంగా నిరుత్సాహం ,జీవితం మీద విరక్తి పుట్టే సూచనలు కనిపిస్తున్నాయి . అయినా ఎంతో సంయమనం తో ఓపిగ్గా నెట్టుకొస్తోంది ,పిల్లలను దృష్టిలో పెట్టుకుని !అప్పుడప్పుడూ ఆమెను మానసికంగా అతలాకుతలం చెసి సంసారిక ఆలోచనలు అదుపుచేసుకోలేని స్థాయికి మెలమెల్లగా వచ్చేస్తోంది ఆమె జీవితం . నోరు విప్పి చెప్పలేని కొన్ని ముఖ్యవిషయాలు ,చేష్టలతో ప్రత్యేకమైన ఆహార్యంతో చెప్పే ప్రయత్నం ఆమె చేసినా ,శరత్ అసలు అర్ధం చేసుకునే పరిస్థితిలోలేడు . విషయం ఏమిటో శాంత కు అర్ధంకాక ఆమెలో అశాంతి ప్రభలడం మొదలైంది . అయినా ఆమె తొందర పడలేదు . జాగర్తగానే అతనితో మెసలడం మొదలుపెట్టింది . అతని అవసరాలు ఏమిటో తెలుసుకు ని ,ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా జాగ్రత్త పడుతోంది . తన కనీస అవసరాలు పట్టించుకునే స్థితిలో అతను లేడు . ఎంతో నిగ్రహం పాటిస్తూ తనలో భర్తకు ఎలాంటి మార్పుకనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది శాంతి ఆరోజు శరత్ వచ్చే సమయానికి ,చక్కగా తయారయింది . పల్చటి తెల్లటి చీర కట్టుకుంది . తలనిండా మల్లెపూలు తురుముకుంది . నిజంగా చెప్పాలంటే శాంతి కొత్త పెళ్ళికూతురిలా అప్పుడే దివినుండి భువికి దిగి వచ్చిన అప్సరసలా తయారయింది . సాయంత్రం కాస్త మామూలు సమయా నీకంటే కాస్త ముందు గా ఇంటికి వచ్చాడు శరత్ . అతను కావాలని ప్రత్యేకంగా రాలేదు . అసలు ఆ రోజు ప్రత్యేకత కూడా అతనికి గుర్తులేదు . ఇలాంటి విషయాల్లో భార్యలకున్న జ్ఞాపకశక్తి భర్తలకుండాదెందుకోమరి !డిన్నర్ లో ప్రత్యేకమైన వంటలు వడ్డించినా ,అతనికి ఆ రోజు ప్రత్యేకత అర్ధం కాలేదు . అతను తృప్తిగా తింటుంటే ‘’ ఏమండీ .. ఈ రాత్రి మీ ఇష్టం .. ఎలావినియోగిం చుకుంటారో మీ ఇష్టం .. ‘’ అంది శాంతి నవ్వుతూ . ఆ మాటలు వినగానే గబ.. గబా .. భోజనం పూర్తి చేసి ,హడావిడిగా తయారై ‘’ థాంక్య్ శాంతీ .. జాగ్రత్త .. తలుపేసుకో .. ‘’ అనుకుంటూ వడి .. వడి .. గా బయటకి వెళ్ళిపోయాడు . అతని చర్యకు శాంతి ఆశ్చర్యపోయింది . తన మాటలను భర్త ఎలా అర్ధం చేసుకున్నాడో ఆమెకు అసలు అర్ధం కాలేదు . ఎంతో ఇష్టంగా కొనుక్కుని పెట్టుకున్న మల్లెపూలు తీసి నేలకేసి విసిరికొట్టింది ,తెల్లచీర విప్పి మంచం- మీదికి విసిరేసింది . రాత్రి ధరించే నైటీ తగిలించుకుని రెండు చేతులమధ్య తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్వడం మొదలు పెట్టింది . ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదుకానీ కాలింగ్ బెల్ మోత విని గబుక్కున వెళ్లి తలుపు తీసింది .సమయం చూస్తే అర్ధరాత్రి పన్నెండు దాటింది . ఎదురుగా శరత్ నిలబడి వున్నాడు . ఆమె చప్పున వెనుతిరిగి చరచరా బెడ్ రూంలోకి వెళ్లి పడుకుని దుప్పటి కప్పేసుకుంది . ఆమె వెనుక ‘’ సారీ .. శాంతి .. రియల్లీ అయామ్ వెరిసారీ .. ‘’ అంటూ బుజ్జగించబోయాడు శరత్ . ‘’ నన్ను ముట్టుకోకండి .. మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లి తిరిగి రండి ‘’ అంది సన్నగా ఏడుస్తూ . ఈ వక్కసారీ నేను ఏమి చెబుతున్నానో విను శాంతీ ‘’ అన్నాడు . శాంతి ఏమీ మాట్లాడలేదు . అయినా దైర్యం చేసి చెప్పాడు . ‘’ తప్పు నాదే శాంతి ,మళ్ళీ మళ్ళీ అలా జరగనివ్వను . నువ్వు అలా అన్నావుకదా అని ఫ్రెండ్స్ తో సరదాగా పేకాడాలనుకున్నానే గాని ,నీమాటలు అర్ధం చేసుకోలేకపోయాను . ‘’ అన్నాడు . ‘’ నేను ప్రత్యేకంగా అలా ఎందుకు తయారయ్యానో కూడా అర్ధం చేసుకోలేక-- పోయారా ?’’ అంది ఉక్రోషంగా ముక్కుపుటాలు ఎగరేస్తూ . ‘’ అందుకేకదా మరి .. సత్యభామ గారికి నామీద ఇంత కోపంరావడానికి కారకుడినయ్యాను ‘’ అన్నాడు చిలిపిగా బుగ్గమీద సున్నితంగా చిటికేస్తూ . ‘’ పొండి ,కబుర్లతోనేగా ఎప్పుడూ నన్ను బోల్తా కొట్టిస్తారు ‘’ అని పక్కకు తోసేసింది శరత్ ని . ‘’ నా ముద్దుల బంగారమా .. ఇంకెప్పుడూ నిన్ను విడిచి క్షణం కూడావుండ ను ,గాక ఉండను . ఆఫీసు అయిపోగానే ,దేవిగారిముందు వాలిపోతాను .. ఇప్పటికయినా కరుణించవా ?’’ అన్నాడు బ్రతిమాలుతున్నట్టుగా . ‘’ వూ .. పొండి .. మీరెప్పుడూ ఇంతే ..’’ అని మత్తుగా భర్త వంక చూసింది శాంతి . క్షణం ఆలస్యం చేయకుండా ఆమె పక్కకు చేరి పోయాడు శరత్ . శాంతిని మరింక మాట్లాడనివ్వలేదు అతను . చెవిలో శాంతి ఏదో చెప్పబోతుం టే , వినిపించుకునే స్థితిలో లేడు శరత్ . తెల్లచీరతో పనిలేకుండా ఒక నిర్ణయా నికి వచ్చేసాడు శరత్ . ***

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు