సుయోధన్... తాతగారి అదుపు ఆజ్ఞలలో నే పెరిగాడు బాల్యం నుండి. తాతగారి పెంపకంలో చాలా సాంప్రదాయాలు తెలుసుకుంటూ.... చాలా గ్రంథాలు కూడా చదువుతూ పెరిగాడు. అతనికి కొంచెం పరి శోధన తత్వం మాత్రం ఎక్కువగా ఉండేది. తాతగారు చెప్పిన ప్రతి దానికి తల ఊపేవాడు కాదు. అది ఎంతవరకు కరెక్టు అన్నది చాలా వివరంగా అడిగి తెలుసుకుని ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడే పాటించాలి అని అనుకునేవాడు. అతను ఒకరు చెప్పింది వినకుండా తన వ్యక్తిగత అభిప్రాయాలకు పెద్ద పీట వేస్తూ ముందుకెళ్లడం తాతగారికి కూడా కొంత నచ్చుబాటు అయ్యింది. " తాతగారు.. మీరు మొన్న చెప్పారు.. "ప్రాణం పోకడ వర్షం రాకడ ఎవరికీ తెలియదు" అని అన్నారు... ఎందుకో దాని మీద నాకు సదభి ప్రాయం లేదు." అవునండి... ఇప్పుడు పిల్లల్ని ఎప్పుడు కావా లంటే అప్పుడు.. ఆ ముహూర్తానికి పుట్టిస్తు న్నారు. అలాగే చనిపోయే మనిషిని కూడా కొన్నాళ్ళు బ్రతికిస్తున్నారు... ఒకలా చెప్పా లంటే... మనిషికి తానే ప్రాణంపోసి కావలసిన గర్భంలో పెట్టి పుట్టిస్తున్నాడు. అట్లాగే కృత్రిమ శ్వాసలు, కృత్రిమగుండె తదితర సాధనాల ద్వారా ఎక్కువకాలం బ్రతికేలా చేయగలుగు తున్నారు... అందుకని ప్రాణం పోకడ విషయం పక్కన పెట్టండి...... ఇక రెండవది.... వర్షం రాకడ...ఇప్పుడు.. ఇప్పుడు ఇదంతా మన గుప్పిట్లో ఉంది...శాస్త్ర పరిజ్ఞానం పెరిగిపోయి... కావలసిన చోట..... క్యుములోనింబస్ ద్వారా వర్షాలు రాబట్ట గలుగుతున్నాము... అసలు వర్షం ఎప్పుడు పడబోతున్నదో..... ఎన్నాళ్ళు ఉంటుందో ఖచ్చితంగా తెలుసుకోగలుగుతున్నాడు మనిషి... అట్లాగే వరదలు కూడా ఎప్పుడు వస్తాయో ముందుగా పసిగట్టి... కరెక్ట్ గా చెప్ప గలిగి.. మనిషి తానే మరోబ్రహ్మ అయిపో యాడు. అందుచేత తాతగారు మీరు చెప్పింది విత్డ్రా చేసుకోవాలి... చేసుకుంటారా.? "..ప్రశ్నించాడు మనవడు సుయోధన్. తాతగారు నవ్వారు..... "పిచ్చి మనవడా... ఇప్పుడే ప్రపంచమంతా నీ చేతుల్లోకి వచ్చేసి నట్టు భ్రమ పడుతున్నావు.... ఏం కాదురా నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా.. వర్షాల గురించి ఎంత శాస్త్ర పరిజ్ఞానం పెంపొందించుకున్న... ఆది సముద్రంలో నీటిబొట్టు అంతకాదురా"" " నో.. నేను ఒప్పుకోను తాతగారు ఈ విష యంలో మీతో ఏకీభవించను. ఈ విషయంలో మీతో పందెం కూడా కాయడానికి సిద్ధంగా ఉన్నాను.." " పందెమా... కాస్త వివరంగా చెప్పు" తాతగారు మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఎక్కువ వర్షం ఎక్కడ పడుతుందో నేను తెలుసుకుని అక్కడికి వెళ్లి... అక్కడ వర్షంలో రోడ్ల మీద తడిసి ముద్దయి నాట్యంచేస్తూ ఆ వీడియో తీసి మీకు పంపిస్తాను.... అప్పుడైనా వర్షం రాకడ నేను కనిపెట్ట గలిగాను అని వర్షాన్ని కాలికింద చెప్పులా చేసుకోగలిగానని మీరు నాతో ఏకీభవిస్తారా??" " అది నీ తరం కాదురా మనవడా...ఒక వీధి లో వర్షం ఉంటే మరొక వీధిలో వర్షం పడదు... ఇంకా వివరంగా చెప్పమంటావా... ఒక్కోసారి పెద్దగా మబ్బుపట్టి ఒక్క చినుకు పడదు అలాగే పెద్ద వర్షం కురిసి ఒక్కనిమిషంలో ఆగిపోవచ్చు ... ఇంకా చెప్పాపెట్టకుండా సెకండ్ లో అతి భయంకరమైన వర్షం రావచ్చు!!!! అలాంటి వాతావరణ పరిస్థితులతో నువ్వు పోటీపడడం పూర్తి అవివేకం రా. సృష్టిని శాసించగలిగే అంత గొప్ప వాడివా నువ్వు?..... పిచ్చి ఆలోచనలో ఉన్నావురా...నోరు మూసుకొని ఇంట్లో అలా ఉండు... వెధవ ప్రయత్నాలు ప్రయోగాలు చేయకురా ..తడిసి ముద్ద అయ్యా వంటే తలపోటు, రొంప, జ్వరం వస్తుంది." " లేదు తాతయ్య గారు... మీ మాటలతో నాలో పౌరుషం బాగా పెరిగిపోతుంది. నా ఫ్రెండ్స్ రెండు రాష్ట్రాల్లో ఉన్నారు...ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశం పేరు ముందుగా నేను మీకు చెప్పి ఆ తర్వాత నేను అక్కడికి వెళ్లి అక్కడినుంచి వాట్సాప్ లో మీకు నేను ఫోటో పంపిస్తాను... వీడియో పంపిస్తాను... అప్పు డైనా మీ మనవడు ఘనాపాటి అని మెచ్చుకొని దండవేసి తీరాలి" " ఏంట్రా కొంపతీసి ఇప్పుడు ఈ భారీ వర్షంలోనే తడిచి వెళ్ళిపోతావా??" " మీరు నన్ను రెచ్చగొట్టారు తప్పదు వెళ్తాను .. ఇదిగో ఫోన్ చేస్తున్నాను మా ఫ్రెండ్ కి... కృష్ణా జిల్లా కొందూరు మండలం అంతా అత్యధిక వర్షపాతం అట ఈ సంవత్సరం!! నేను ఆ వూరు ఎంచుకుంటాను... అక్కడ మా ఫ్రెండ్ అభిజిత్ ఉన్నాడు.. వాడితో మాట్లాడి .. ఇప్పు డే ఈ వర్షంలోనే తడిసి ముద్దయి నా సరే ఎలాగోలా అక్కడికి వెళ్లిపోతాను.... ఇదిగో ఫోన్ చేస్తున్నాను.... " అంటూ సుయోధన్.. అభిజిత్ నెంబర్ కు ఫోన్ చేశాడు. "ఆ... ఆ.... అరే ఒరే అభిజిత్ నేనురా సుయో ధన్ మాట్లాడు తున్నాను.. బాగున్నావా.. మీ మండలం లో ఇప్పుడు వర్షపాతం ఎంత నమో దయింది రా.." " 180 సెంటీమీటర్లు రాష్ట్రం మొత్తం మీద ఇది అధికం.. ఏ అలా అడుగుతున్నావ్!!?" చెప్తా అక్కడకొచ్చి చెప్తా ఇప్పుడే ఈ వర్షంలోనే తడిసి ముద్దయి నేను ఎలాగోలా మీ ఊరు వస్తాను నిన్ను కలుస్తా... అక్కడ మీ ఇంటి ఎదురుగా రోడ్డు మీద నేను భరతనాట్యం చేస్తాను రా ..ఈ పెద్ద భయంకరమైన వర్షంలో... అప్పుడు నువ్వు వీడియో తీయాలి నన్ను ఓకేనా..." " ఏరా నీకేమైనా పిచ్చి పట్టిందా.?" " పిచ్చే ..మదపిచ్చి.. తాతతో పందెం కట్టానురా వివరాలన్నీ వచ్చాక చెప్తాగా వర్షాన్ని అలాగే ఉంచు తగ్గనివ్వకు." సుయోధన్... వేగంగా బయటకు వచ్చి ఎవరికీ చెప్పకుండా వర్షంలో తడిసి ముద్దయి.. బస్టాండ్ కి వెళ్లి బస్సు ఎక్కాడు. చాలాసేపటికి కొందూరు మండలం లో దిగాడు. దిగేసరికి ప్రశాంతంగా ఉంది వాతావరణం. భయంకరమైన వర్షం తగ్గి చాలాసేపు అయిం దట. టీవీలో చెప్తున్నాడు 180 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైందని ఈ సంవత్సరం ఇంత అత్యధిక వర్షపాతం ఎక్కడలేదని.... మరి ఇప్పుడు ఆ వర్షం ఏది?? అర్ధగంటలో ఎంత మార్పు ..ఆ మండలంలో ఇప్పుడు ఎక్కడ చినుకులు పడటం లేదు.... ఏమిటీ వింత... ఏమిటీ విచిత్రం???? ఫోన్ రింగ్ అయింది సుయోధన్కు...తాత నుండి. ...ఏం చెప్పాలి.. తన వర్షంవీడియో కోసం ఎదురు చూస్తున్న తాతకు విషయం ఏమని చెప్పాలి. తను ఓడిపోయినట్లే.... కాదు కాదు. ఒప్పుకో కూడదు. ఫోన్ కట్ చేశాడు . కృష్ణాజిల్లాలోని బాపులపాడు... వీరుల్లపాడు 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందట. అక్కడకు అదీ అధికమే.. ఆయా ప్రాంతాల్లో కూడా తనకు కొలీగ్స్ ఉన్నారు... ఫోన్ చేశాడు సుయోధన్... అక్కడి ఫ్రెండ్స్ విషయం పూర్తిగా తెలుసుకొని... "వర్షం మనిషి నడవడానికి వీలులేనంత భారీగా కురుస్తుందని...ఎలాగోలా చాలా అర్జెంటుగా వచ్చి ఇక్కడ రోడ్డుమీద భరతనాట్యం చేస్తూ వీడియో తీసి.. మీ తాత గారికి పంపు” అని.... మెసేజ్ పెట్టారు. సుయోధన ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి సరైన వాహన సౌకర్యం లేకపోయినప్పటికీ.... కొంత దూరం ఆటో మీద.. కొంత దూరంఎడ్లబండి మీద ..కొంత దూరం నడిచి.... ఆ భయంకర వర్షం లో తడిసి తడిసి ముద్దయి పోతూ...చిట్ట చివరికి తన ఫ్రెండ్స్ ని సమీపించాడు.... కానీ ఫలితం శూన్యం.... తను వెళ్ళేసరికి అక్కడ కూడా వర్షం బాగా తగ్గి పోయింది...నిరాశ ...నిరాశ ..నిస్పృహ!తన మీద పగ పట్టినట్టు వాతావరణ అసమానతలు ఏమిటో అతనికి అర్థం కాలేదు..మళ్లీ తాత నుండి ఫోన్ రింగ్ అయ్యింది... ఈసారి ఫోన్ ఆన్ చేసాడు సుయోధన్ కోపంగా.... " ఒరేయ్ మనవడా సుయోధన్...ఈ తాత తో నీకు పంతం ఏమిటిరా... అమ్మానాన్నకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయావట... ఇక్కడ వర్షం బాగా పెరిగిపోయింది రా.. ఈదురు గాలులు చెట్లు కూడా పడిపోతున్నాయిరా... నువ్వు వెళ్లేటప్పుడు బాగానేఉన్నా.... ఇప్పుడు వాతావరణం పూర్తిగా మారిపోయిందిరా.... మన ప్రాంతంలో వర్షం పడుతుంది అని చెప్ప లేదు .అయినా భయంకరమైన.. అతి భయం కరమైన వర్షం పడుతుందిరా....నాక్కూడా ఉన్నట్టుండి ఆరోగ్యంలో మార్పు వచ్చిందిరా.... ఒళ్ళు బాగా వేడెక్కింది. రొంప జలుబు దగ్గు.... ఊపిరి కూడా ఆడడం లేదు. నువ్వే నెగ్గావని ఒప్పుకుంటున్నాను రా..వచ్చేయ్ త్వరగా వచ్చేయ్రా...." " పర్వాలేదు తాత.. నువ్వు కంగారు పడకు. నాన్న ఉన్నారుగా... మన ఫ్యామిలీ డాక్టర్ ప్రకాశం గారు నిన్ను బాగానే చూస్తున్నారుగా... మొన్ననే పూర్తి బాడీ హెల్త్ చెకప్ చేసినప్పుడు కూడా... నీకు ఇంకా పది సంవత్సరాల వరకు తిరుగులేదని కూడా చెప్పారు... ఎందుకలా కంగారు పడతావు..నేను రేపు వస్తాను. ఈ లోపున నీకు ఫొటోస్, వీడియోస్ వస్తాయి చూడు"..జవాబు కోసం ఎదురు చూడకుండా ఆఫ్ చేశాడు సెల్... సుయోధన్. సుయోధన్ లో పట్టుదల పెరిగి పోయింది. తను ఎక్కడ కాలు పెడితే అక్కడ వర్షం ఆగిపోవడం లేదా తగ్గిపోవడం... సుయోధన్ కు అంతు చిక్కలేదు. ఇంటర్నెట్ ఆన్ చేసి సెల్లో ఇంకా ఎక్కడెక్కడ అధిక వర్షపాతం నమోదు అయిందో చూశాడు ఆ మరునాడు .... అదే జిల్లాలో గంపలగూడెం, నూజివీడు ఇంకా రెడ్డిగూడెం మండవల్లి ... ఆయా ప్రాంతాలలో 70, 80 సెంటిమీటర్ల గా నమోదవడం గుర్తిం చాడు. వెంటనే ఆయా ప్రదేశాలకు.. చేరిపోయాడు. కానీ అధికవర్షం కురుస్తున్న ఆయా ప్రదేశాలు.. వీడియో తీద్దాం అనేసరికి సడన్గా పూర్తి వర్షం తగ్గిపోయేది. ఇది.... కలయా.... నిజమా అన్నట్టు!!!! వర్షం రాకడ పోకడ విషయాలని అర్థం చేసుకో లేకపోయాడు. సుయోధన్.. తను సృష్టితోనే పోరాటం చేస్తున్నందుకు కొంచెం సిగ్గుపడ్డాడు కూడా... వర్షం పడాలని శతవి ధాల ఆకాశం వైపు చూస్తూ దండాలు పెట్టాడు.. అరిచాడు.. బొబ్బలు పెట్టాడు..పెడబొబ్బలు పెట్టాడు. మళ్లీ సెల్ రింగ్ అయింది.... ఈసారి మాట్లా డింది సుయోధన్ తండ్రి... ప్రహ్లాదరావు. " హలో... బాబు.. వర్షంలో చెప్పకుండా ప్రయాణం ఏమిట్రా... ఇక్కడ మీ తాతగారు పరిస్థితి అసలు బాగోలేదు.. డాక్టర్ గారు గంటల మీద వ్యవహారం అంటున్నారు. సడన్ గా ఆయన సీరియస్ అయ్యారు.. నాకు భయంగా ఉంది. నువ్వు ఎంత దూరం లో ఉన్నావో నాకు తెలియదు... ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడకు వచ్చేయ్. విషయం ఇంకా వివరంగా నీకు చెప్పాలంటే ఫోన్లో నాకు నోరు రావడం లేదు.... అర్థం చేసుకో." సెల్ ఆఫ్ చేశాడు తండ్రి. సుయోధన్ గుండెలో... బండ పడినట్లయింది. "తను చేసింది పిచ్చి పనా? ఈ ప్రపంచంలో ఎవరు "వర్షం" తో పోటీపడి ఉండరు. అలాం టిది నేను చదువుకొని కూడా మూర్ఖుడిలా ప్రవర్తించాను..అక్కడ తాత " ప్రాణం " ఇక్కడ " " వర్షం "...... రెండూ నామీద పగపట్టాయి.... నిజమే దేవుడి తో పోరాటం చేస్తున్నట్లు ఉంది నా పరిస్థితి... కండిషన్ చేజారి పోతేనే కానీ నాన్న అంతలా చెప్పరు". సుయోధన్ ఆలోచనా తరంగాలు 300మిల్లీ మీటర్లు వర్షపాతం లా.... పెరిగిపోతున్నాయి. ధైర్యంగా సెల్ ఆన్ చేసాడు. " నాన్న.. తాత గారికి ఏమీ కావడానికి వీల్లేదు. అవసరమైతే పెద్ద డాక్టర్ ని రప్పించమని మన ఫ్యామిలీ డాక్టర్ కు చెప్పండి.... తాత తో నేను చాలా విషయాలు మాట్లాడాలి... మా ఇద్దరి మధ్య సరదా పోటీ మీకు తెలిసే ఉంటుంది.. మీరు, అమ్మ అందుబాటులో లేరని చెప్పకుండా వచ్చాను... సరే ఏది ఏమైనా తాత గారు క్షేమంగా ఉండాలి.. నేను వచ్చి ఆయన కాళ్ళ మీదపడి.... ఒక అడవిమృగంలా పెద్ద వాళ్ళతో ప్రవర్తించినందుకు.. తాతగారికి క్షమా పణలు చెప్పుకోవాలి." అలా సుయోధన్ మాట్లాడుతూ ఉండగా అవతల నుండి ఒక కంఠం వినబడింది " బాబు... మాట్లాడేది మీ నాన్నను కాదు... ఆయన ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేరు.. మాట్లాడలేరు. నేను మీ పక్కింటి సత్యనారా యణ ఆచార్యులు గారి ని.... మీ తాతగారు మనకిక లేరు బాబు" "నో .. అలా జరగడానికి వీలు లేదు సెల్ నాన్నగారికి ఇవ్వండి...' "నువ్వు ఎంత దూరంలో ఉన్నావో నాకు తెలి యదు కానీ... వర్షం రాకడ ప్రాణం పోకడ ఎవరు చెప్పలేరుస్వామి...నిన్నటి వరకు మీ తాత గారు చాలా బాగున్నారు.మొన్న మేము ఇద్దరం కలిసి నడుచుకుంటూ దేవాలయంలో పురాణం విన డానికి కూడా వెళ్ళాము.... అక్కడ చింతామణి శాస్త్రి గారు చెప్పిన పురాణం లో జోకులు విని మీ తాతగారు పడీపడీ నవ్వడం నాకు ఇప్పటికీ గుర్తుంది... " పొట్టచెక్కలయ్యేలా అంతలా నవ్వకండి చాలా ప్రమాదం ఒక్కోసారి" ....అని నేను సరదాగా అన్నాను. దానికి ఆయన ఏమన్నారో తెలుసా " వర్షం రాకడ ప్రాణం పోకడ..."నవ్వు"..రాకడ కూడా మన చేతుల్లో లేవు ఆచార్యులు గారు"... అంటూ ఇంకా పడి పడి పడి నవ్వారు. అలాంటి మనిషి ఈరోజు ఇలా ప్రాణాలు కోల్పోతారని ఎవరూ ఊహించలేదు బాబు... మీ తాతగారి ప్రాణాలు పోయి......గంట అయ్యింది. బాధలో ఉన్న మీ నాన్నగారు నీతో వివరంగా ఏమీ చెప్పలేక సెల్ నాకిచ్చి చెప్ప మన్నారు. ఇక్కడ కార్యక్రమాలన్నీ మొదలు పెట్టారు. మనవడి గా నువ్వు ముఖ్యం గా ఉండాలి కనుక ఎంత కుండపోత వర్షం వస్తున్నా సరే... వీలైనంత తొందరగా రావడం మంచిది బాబు. ఇక్కడ కూడా వర్షం చాలా భయం కరంగా ఉంది అయినా కార్యక్రమాలు చేయడం తప్పదుగా" ఇక్కడ సత్యనారాయణ ఆచార్యులు ఫోన్ పెట్టేసాడు.... అక్కడ సుయోధన్ చేతి నుండి నోకియా సెల్ ఫోన్ జారీ క్రింద పడి వర్షపు ప్రవాహం లో కొట్టుకుపోయింది...!!! 💥💥💥