బతుకు పాఠం - వినాయకం ప్రకాష్

Batuku paatham

సమయం సాయంత్రం 6. 30 నిమిషాలు తన కోసం అందంగా అలంకరించిన టేబుల్ వద్ద కూర్చోగానే క్షణాల్లో ఇదివరకే ఆర్డర్ ఇచ్చిన వేడివేడి కాఫీ వచ్చి టేబుల్ పై వాలింది, చక్కటి స్లో మోషన్ సంగీతం ఆహ్లాదకరమైన పరిసరాలు, చుట్టూ ఖరీదైన మనుషులు ఎంతో హుందాగా ఉన్న ఆ ప్రాంతం కళ్యాణ్ ని కట్టిపడేస్తున్నది, హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ అందాలను ఆస్వాదిస్తూ కాలు మీద కాలు వేసుకొని ఒక్కో సిప్ కాఫీ ని ఎంజాయ్ చేస్తున్నాడు కళ్యాణ్. కళ్యాణ్ బంజారాహిల్స్ లో సాఫ్ట్వేర్ గా పని చేస్తాడు, విలాసవంతమైన జీవితం అంటే మోజు చాలా లక్జరీ గా ఉండాలని ఖరీదైన వస్తువులను తన స్థాయికి మించి కొంటాడు, ఇప్పుడు కూడా ఒక కప్పు కాఫీ తాగడానికి స్టార్ హోటల్ అయిన తాజ్ బంజారా హోటల్ లో ముందస్తుగా రూ.1000 కట్టి మరీ టేబుల్ బుక్ చేసుకున్నాడు, కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటే సడన్ గా ఫోన్ మోగింది ఎవరా అని చూస్తే అక్క ఇంటి నుంచి.. హలో.. కళ్యాణ్... నాన్న గారికి హార్ట్ ఎటాక్ వచ్చింది , నువ్వు ఎక్కడ ఉన్నావు ...తొందరగా రా.. నీకు చాలా సేపటినుంచి కాల్ చేస్తున్నా నీకు ఫోన్ కలవడం లేదు నాన్న గారిని సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో జాయిన్ చేశాము. డాక్టర్ సర్జరీ చేయాలి అంటున్నారు దానికి 5,00, 000/- కట్టాలంట ఆపరేషన్ చేస్తే గాని నాన్నగారు దక్కరు అంటూ ఏడుస్తుంది అక్క సుప్రియ. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు , ఐ...దు...ల...క్ష..లా.. ఐదులక్షల అంటే మాటలు కాదు తన దగ్గర ఉన్న డబ్బు కాస్త అయిపోయింది క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మొత్తం వెతికినా 20,000 కూడా లేవు చేతిలో ఉన్న రెండు వేలు ఇప్పుడు హోటల్ బిల్ కట్టడానికి సరిపోతుంది, ఉన్న డబ్బు క్రికెట్ బెట్టింగ్, హార్స్ రైడింగ్, వివిధ రకాల పందేల్లో పెట్టి లాస్ అయ్యాడు ,ఎవరో ఒక మిత్రుడు షేర్ మార్కెట్ లో డబ్బు పెట్టమంటే పెట్టి షేర్స్ అమ్ముడు పోక పూర్తిగా నష్టాల్లో ఉన్నాడు, కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా లగ్జరీ లైఫ్ కావాలని గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకునేవాడు. కళ్యాణ్ కి ఏం చేయాలో అర్థం కావడంలేదు కంగారుగా హోటల్ నుంచి బయటపడి కార్ తీశాడు కారు వేగంగా సోమాజీగూడ ఫ్లై ఓవర్ మీదుగా బేగంపేట్ వద్దకి వచ్చీ రాగానే కార్ ఆగిపోయింది చూస్తే కార్లో డిజిల్ అయిపోయింది వెనుక నుంచి ట్రాఫిక్ జామ్ ...కార్ పక్కకి తీయమని ఒకటే హారన్లు, "షట్ ....ఈ కారు కూడా ఇప్పుడే ఆగిపోవాలా " అంటూ చిరాకుగా స్టీరింగ్ పై బలంగా కొట్టాడు, కళ్యాణ్ కి కోపం వస్తోంది కానీ ఏం చేయలేని పరిస్థితి కార్ దిగి కారును రోడ్డు పక్కకి అతి కష్టంగా నెట్టాడు దీంతో వెనుక ఉన్న ట్రాఫిక్ కొద్దిగా క్లియర్ అయింది, కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. కానీ మనసులో కంగారు మొదలైంది ఎలాగైనా హాస్పిటల్ చేరుకోవాలని ఎవరిని లిఫ్ట్ అడిగినా ఇవ్వడం లేదు సమయం రాత్రి 8 . 30 నిమిషాలు కావస్తోంది, ఎలాగైనా హాస్పిటల్ కు చేరుకోవాలని వేగంగా పరిగెత్తాడు ఐదు కిలోమీటర్ల దూరం లోని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కి రాత్రి 9:30 కు చేరుకున్నాడు. ఒళ్ళంతా చెమటలు అలసిపోయిన దేహంతో ఆసుపత్రిలో కి వెళ్ళగానే వెయిటింగ్ చైర్లో అమ్మ, అక్క ఏడుస్తూ కూర్చుని ఉన్నారు, అమ్మ వద్దకు వెళ్లి అమ్మా.. నాన్నకు ఎలా ఉంది..? అని అడిగాడో లేదో తల్లి సుజాతమ్మకు ఏడుపు ఆగడంలేదు కళ్యాణ్ నాన్నగారిని ఎలా అయినా బ్రతికించు రా...! డబ్బులు తెచ్చావ్ కదా నాన్నా..? ఆపరేషన్ కి ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందట నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు నాన్నా... అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కళ్యాణ్ వాళ్ళ అమ్మ. చేతిలో డబ్బులేదు మరోవైపు నాన్నగారికి సీరియస్ గా ఉంది, కళ్యాణ్ కోపం, చిరాకు, బాధ కలగలిసి మనసు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నా మౌనంగా ఉన్నాడు. ఫ్రెండ్స్ ని అడుగుదాం తప్పకుండా సహాయం చేస్తారని ఆశించి ఫోన్ తీసి కాల్ చేయడం స్టార్ట్ చేశాడు రేయ్... శ్రీరామ్ నాన్న గారికి ఆరోగ్యం బాలేదు రా సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో జాయిన్ చేశారు ఇప్పటికిప్పుడు 5 లక్షలు కట్టాలంట లేకుంటే కష్టం అంటున్నారు ఎలాగైనా హెల్ప్ చేయరా ..ప్లీస్ రా అని ప్రాధేయపడ్డాడు కళ్యాణ్, సారీ.రా ప్రస్తుతం సిట్యుయేషన్ టైట్ గా ఉంది హెల్ప్ లేస్ రా సారీ... అంటూ ఫోన్ పెట్టేసాడు శ్రీరాం. తర్వాత మరో ఫ్రెండ్ కి.కాల్. చేసినా ఒకటే సమాధానం డబ్బు లేదని తెలిసిన అందరికీ కాల్స్ చేశాడు కిషోర్ ,వినోద్, సాయి, శ్రీకర్ ఇలా తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేశాడు కాని ఉపయోగం లేదు ఎవరూ సహాయం చేసేందుకు రావడం లేదు. మనసులో కంగారు భయం మొదలైందినాన్న గారిని బతికించుకోవడం ఎలా అంటూ భయంతో చిగురుటాకులా వణికిపోతూ..ఒక్కసారిగా కుప్పకూలి కుప్పకూలిపోయాడు కళ్యాణ్. కొడుకు పరిస్థితి గమనించిన తల్లి కంగారుగా ఏమైంది నాన్న ..ఎందుకు ఇలా అయిపోతున్నావు ఇన్నాళ్లు నీ సాలరీ ఏం చేసావు, ఇంటికి కూడా పంప లేదు కదా... అని అడుగుతుంటే మౌనమే సమాధానం. అక్క.సుప్రియ వచ్చి ఏం కళ్యాన్ ఏమిటి విషయం అనగానే చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు కళ్యాణ్. చూడు కళ్యాణ్ నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వేరా.. ఫ్రెండ్స్ పార్టీలు అంటూ కుటుంబాన్ని పూర్తిగా మర్చిపోయావు హైదరాబాద్ లో. ఉండి జాబ్ చేస్తావు అనుకుంటే నువ్వు చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితం నాశనం చేసుకుంటున్నావు చూశావా నీ తో ఎంజాయ్ చేసిన నీ ఫ్రెండ్స్ కానీ నీవు నీవాళ్ళు అనుకున్న నీ వాళ్ళు ఈ రోజు నీకు సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదు , గాలి పటం లా.రివ్వున ఎగిరావు ఇప్పుదేమో రెక్కలు తెగిన పక్షిలా కుప్పకూలావు, ఇది కాదురా జీవితం అంటే ఇలా కాదురా . మేము నిన్ను చూడాలి అనుకుంది అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది సుప్రియ. జరిగిన విషయానికి ఈ దుస్థితి ఎంతగానో బాధ పడుతున్నాడు కళ్యాణ్ ,తాను చేసిన తప్పును తెలుసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు ఇప్పుడు తన చేతిలో తనది అంటూ ఏమీ లేదు ఒక్క కారు తప్ప అందుకే కార్ ని అమ్మి కొద్దిగా అయినా సహాయపడాలని అనుకుని కారు అమ్మేందుకు బయలుదేరాడు. వెనక నుంచి ఎవరో భుజంపై చేయి వేశారు ఒక్కసారిగా జాలువారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ వెనక్కి తిరిగి చూస్తే ఎదురుగా సుదర్శన్ గారు సుదర్శన్ కళ్యాణ్ వాళ్ళ తండ్రి. నాన్నా...అంటూ ఒక్కసారిగా కౌగలించుకుని పశ్చాత్తాపంతో కన్నీరుమున్నీరయ్యారు కళ్యాణ్, ఇంతలో డాక్టర్ నిరంజన్ కలుగజేసుకుని చూడు కళ్యాణ్ మీ నాన్న ఆరోగ్యం బాగానే ఉంది నేను మీ నాన్న చిన్ననాటి స్నేహితులము చిన్నప్పుడు కలిసి చదువుకున్నాము నేనేమో.డాక్టరు అయ్యాను మీ నాన్న పల్లెటూర్లో రైతుగా మిగిలిపోయాడు కనీసం తన పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని తపించాడు . నీలో వస్తున్న మార్పు పసిగట్టి ఇటీవల హైదరాబాద్ వచ్చి నీ గురించి తెలుసుకున్నాడు, నీవు ఎలా చెడుఅలవాట్ల బారిన పడి.జీవితం నాశనం చేసుకుంటున్న తీరు చూసి బాధ పడ్డాడు, అందుకే ఈరోజు ఎలాగైనా నీకు జీవితం విలువ తెలిసి రావాలని మీ నాన్నగారు నేను మీ అక్క కలిసి బతుకు పాఠం నేర్పించాలని ఈ విధంగా చేసాము, ఇప్పటికైనా తెలిసిందా బాబు నీ వారు ఎవ్వరో పరాయివారు ఎవరో అని , నీ కుటుంబం నీకు ముఖ్యం కానీ నీవు సంపాదనంతా వృధా చేస్తున్నావు, నగరానికి వచ్చిన నాగరికత నేర్చుకొని బాగుపడతావు అనుకుంటే నానా దురలవాట్లు నేర్చుకుని లగ్జరీ జీవితము కావాలని తపించి భ్రమలో.ఉందిఅప్పుల తిప్పలు తెచ్చుకొని క్షణం క్షణంఆందోళనగా ఉన్నావు, గొప్పగా బ్రతకాలి అన్నది మంచిదేకానీ మన హద్దులు మన పరిమితి ఎప్పటికీ మరవకూడదు నిజంగానే ఇప్పుడు మీ నాన్నగారికి హార్ట్ఎటాక్ వచ్చి ఉంటే ఏంటి పరిస్థితి..? అంటూ దారి తప్పుతున్న కళ్యాణ్ ను.సరైన దారిలో పెట్టి చక్కని బతుకు పాఠం నేర్పించారు. అమ్మ ..నాన్న ..నన్ను క్షమించండి అంటూ జరిగిన తప్పులకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఇక నుంచి మీరు చెప్పినట్టే నడుచుకుంటానని అమ్మానాన్నలిద్దరినీ ఒకేసారి. హత్తుకొని సరికొత్త ఉషోదయం వైపు అడుగులు వేశాడు కళ్యాణ్.

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు