"ఓయ్ శ్రీమతి ! కాపీ" బిగ్గరగా అరిచాడు అతను. "నేనేమీ మీ పని మనిషిని కాదు, అలా రావటానికి" వచ్చి పెట్టుకుని తాగండి". బదులిచ్చింది ఆమె. "నువ్వు నేను తాళి కట్టిన భార్యవి. నేను చెప్పినట్లు , అనుగుణంగా నడచుకోవాల్సిందే" అన్నాడు అతను "అలా నడుచుకోవాలని, ఎక్కడా వ్రాసి లేదు కదా? బదులిచ్చింది ఆమె. "ఉందో లేదో! నాకు అనవసరం." "నా పాత్ర ప్రకారం నాకు దక్కిన హక్కు"అన్నాడు అతను "మీకు కొన్ని హక్కులు ఉన్నాయన్న సంగతి నాకు తెలిసేలా రాయలేదు ." నన్నేం చేయమంటారు "తిరిగి సమాధానం ఇచ్చింది ఆమె "ఇలా మాట్లాడితే! నీకు విడాకులు ఇచ్చేస్తాను" అన్నాడు అతను "విడాకుల చట్టం మనకు వర్తించదు. మర్చిపోయారా సర్" ఖండించింది ఆమె "ఎందుకు వర్తించదు. సమాజం దృష్టిలో నేను నీ భర్తను " అన్నాడు అతను. "మన కోసం ఒక సమాజం సృష్టించిన వ్యక్తికే, సమాజంలో గుర్తింపు లేదు. మనకు సమాజం కట్టుబాట్లు ఎలా వర్తిస్తాయి". ఎదురు ప్రశ్నించింది ఆమె "మాటకు మాట సమాధానం అయితే !నేను చేయ్యి చేసుకోవాల్సి వస్తుంది .భర్తగా నాకు హక్కు ఉంది "అన్నాడు అతను "మీ హక్కులను కాదనటం లేదు. వంట గదిలోని సామాన్లన్నీ ,నా ఆధీనంలో ఉన్నాయని,వాటిని ఏక్షణమైనా విసరగల హక్కు కూడా నాకు ఉంది" గుర్తు చేసింది ఆమె "ఇలా అయితే మనం కలిసి కాపురం చేయలేం" అన్నాడు అతను "మీ తోటి కలిసి కాపురం చేయాలని ఉందని నేను ఏ రోజు మీతో చెప్పలేదు కదా "అన్నది ఆమె "నాకు కోపం తెప్పించకు ,నాకు కోపం వస్తే నేను మనిషినే కాదు "అన్నాడు అతను "మీరు మనిషి కాదు అన్న విషయం ఇప్పటికైనా గుర్తించారు చాలా సంతోషం". "మనం ఒకరి చేత సృష్టించబడిన పాత్రలం మాత్రమే. మన మధ్యన ఉండవలసింది సాన్నిహిత్యం మాత్రమే. కోపతాపాలు కాదు! చెప్పింది ఆమె "పాత్ర అయినంత మాత్రాన స్వభావం ఎక్కడికి పోతుంది. భర్తని ఎదిరించే హక్కు నీకు లేదు" అన్నాడు పతనం "భార్యను నిందించే హక్కు కూడా! భర్తకు లేదు" అన్నది ఆమె "ఎన్నో కథల్లో! భర్త పాత్ర ఇలాగే ఉంటుంది అనేది నాకు తెలిసిన విషయం. నువ్వు కాదంటే సరిపోతుందా?" అన్నాడు అతను "మీకు తెలిసింది వాస్తవం కావాలని ఏమీ లేదు. వాస్తవాలు వెలుగు చూడాలని ఏమీ లేదు. భర్త అంటే అది ఒక పవిత్రమైన పదం .దాన్ని మీ స్వార్థం కోసం దిగజార్చే ప్రయత్నం చేయకండి" అంది ఆమె "దిగజారుడు అనే పదం ఈ రోజు కొత్తగా నీ నోటి నుండి వినడం ఆశ్చర్యంగా ఉంది." "స్త్రీ జాతి ఎప్పుడో దిగజారిపోయింది అని ఎన్నో మీడియా సంస్థలు కోడై కూస్తున్నాయి , ఎలక్ట్రానిక్ మీడియాలో విలన్ లా చూపిస్తున్నారు. సినిమాల్లోకి అర్ధనగ్నంగా డాన్స్ చేయిస్తున్నారు. చివరకు కంపెనీలు యాడ్స్ కు కూడా , అర్ధనగ్నంగా నే చూపిస్తున్నారు. అవి ఖండించారు ఎందుకు.. "టీ. ఆర్ .పి రేట్లు కోసం చర్చావేదికలు పెట్టే మీడియాలను నేను ఫాలో అవ్వను . వాస్తవాలను నిగ్గదీసి రాసే సందర్భాలలో మాత్రమే నేను స్వాగతిస్తా." సమాధానమిచ్చింది ఆమె "నీ వితండవాదం నాకు కోపం తెప్పిస్తుంది" అన్నాడు అతను "వాస్తవాలను విని తట్టుకోలేని పురుషాహంకారం మిమ్మల్ని ఇలా మాట్లాడి ఇస్తుంది." "ఇప్పటికైనా పురుష అహంకార ప్రపంచం నుంచి బయటికి రండి. మనిషిలాగా జీవించండి". అంది ఆమె. "భర్త అనేక గౌరవం లేకుండా అంత మాట అంటావా?" అంటూ తనకు దగ్గరలో ఉన్న వస్తువు వేగంగా ఆమె వైపు విసిరాడు అతను. "మీరు కొట్టినా! తిట్టినా! భరించడానికి నేను మీరు సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న భార్యను కాదు నేను." "మనం ఒక వ్యక్తి సృష్టించిన పాత్రలం మాత్రమే" రచయిత మలిచే విధంగా నడుచుకోవడం మే మన మధ్యన ఉన్న రిలేషన్". అంటూ వంటగదిలోని కత్తిని వేగంగా అతనివైపు విసిరింది. అతను కూడా తనకు దొరికిన వస్తువు విసురుతూ నే ఉన్నాడు. ఆమే ప్రతిఘటిస్తూ,తను కూడా ఎదురుదాడికి దిగుతుంది ఆమె. స్త్రీ అబల కాదు అనే కవిమాటను గుర్తుచేసుకుంటూ... గది నిండా వస్తువులు చౄల్లా చెదురుగా పడుతున్నాయ్. ఎవ్వరూ తగ్గడం లేదు. ***** నిద్ర మేల్కొని చూసిన కవికి తన టేబుల్ పైన రెడ్ ఇంక్ పెన్ రక్తసిక్తం గా కనిపిస్తోంది. జారిపోతున్న కళ్ళద్దాలుసరిచేసుకుంటూ నిశితంగా పరిశీలించాడు. తను సృష్టించిన రెండు పాత్రలు భార్యాభర్తలు ... సహజసిద్ధమైన వాతావరణంలోకి ప్రవేశించాయో ఏమో ...? పాపం మనుషుల్లాగే కొట్లాడుకొని , తన వ్రాసిన కథ భాగంను చింపి చింపి వదిలేశాయి.. నిట్టూర్చాడు యువ కవి.. లోపం ఎవ్వరిది? కథ సృష్టించిన తనదా? ఒకరిని ఒకరు అర్దం చేసుకోలేని నేటి స్త్రీ పురుషులదా..? లేక! స్త్రీ అంటే ఇలాగే ఉండాలి అని ,ఇన్ని రోజులు వ్రాసుకుంటూ వచ్చిన .ముందుతరం రచయితలదా? జుట్టు పీక్కున్నాడు యువకవి.