పనిష్ మెంట్లు - Dr.kandepi Raniprasad

Punishment lu

అశ్విన్ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు.ఆటో దిగగానే క్లాస్ రూమ్ లో కి వెళ్ళి కూర్చున్నాడు.అంతలోనే PET సర్ వచ్చి బయటకు తీసుకెళ్ళాడు.అక్కడ ఎండలో మోకాళ్ళ మీద నిలబెట్టాడు.గ్రౌండ్ లో నీ ఇసుక లో రాల్లుంటాయి.మోకాళ్ళకు గుచ్చుకుని బాగా నొప్పెడతాయి.అశ్విన్ నొప్పితో ఏడ్చాడు. పి ఈ టీ సర్ వచ్చి ఏమిటీ నొప్పిగా ఉందా? మరి మీ నాన్న ఫీస్ కట్టలేదురా.మాక్కూడా నొప్పిగా నే ఉంటుంది. ఈ పీరియడ్ అంతా బయటనే ఉండు.అప్పుడు తెలిసి వస్తుంది '' అని వెళ్ళిపోయాడు.అశ్విన్ కేమీ అర్థం కాలేదు.అర్థం చేసుకునే వయసు కాదు. ఆరోజు సాయంత్రం 7 వ తరగతి చదివే కిరణ్ అశ్విన్ వాళ్ల అమ్మకు ఈ విషయం చెప్పాడు.అశ్విన్ వాళ్ల అమ్మ అశ్విన్ ను అడిగింది"" మోకాళ్ళ మీద నిలబెట్టార కన్నా'' అని. అవును అంటూ తలూపాడు.నొప్పిగా ఉందా ? అడిగింది అమ్మ మళ్ళీ. అవునమ్మా! బాగా నొప్పి వచ్చింది.అన్నాడు అశ్విన్. సాయంత్రం అశ్విన్ వాళ్ల నాన్న అఫీస్ నుంచి ఇంటికి రాగానే అశ్విన్ వాళ్ల అమ్మ రమ అడిగింది""ఏమిటీ మీరు స్కూల్ ఫీస్ కట్టలేదా?అని. అయ్యో! మర్చిపోయాను రమా! అన్నాడు ఆనంద్ తల నొక్కుకుంటూ."మీరిలా మర్చిపోతే ఎలా అండి? స్కూల్లో పిల్లాడిని ఎండలో మోకాళ్ళ మీద రాళ్ళలో నించోబెట్టరు.పిల్లాడి మోకాళ్ళు చీ రుకుపోయాయి chudandi' అంటూ చూపించింది.ఆనంద్ చూసాడు.అశ్విన్ మోకాళ్ల మీద చర్మం దొక్కుపోయి రక్తం కనిపిస్తున్నది. ఆఫీస్ లో కొంచెం పని ఎక్కువగా ఉండి కట్టలేకపోయను రమా!ఇంతలోకే పిల్లాడిని ఇంత హింసించలా? ఈరోజు నీకు డబ్బులు ఇచ్చేస్తాను.నువ్వు వెళ్ళి కట్టెయ్'' అన్నాడు ఆనంద్.సరే అంది రమ. టింక్చర్ తో తుడిచి మందు రాసింది రమ.పిల్లాడు నొప్పి నొప్పి అంటూ ఏడుస్తూనే ఉన్నాడు. తెల్లారి రమ స్కూలుకు వెళ్లి ఫీస్ కట్టేసింది.ఆ తర్వాత ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్ళి ఇలా అన్నది."" చూడండి సర్,మేము ఫీస్ కట్టటం రెండు రోజులు లేట్ అయ్యింది.నిజమే ఇంతలోనే పిల్లాడిని అంతలా ఎండలో మోకాళ్ళ మీద నిలబెట్టా లా? డబ్బుల విషయం పిల్లలకు ఏమి తెలుసు.' అంటూ వుండగానే ప్రిన్సిపాల్ నాలుగు రోజుల నుంచీ ఎండలో నిలబెట్టిన మీరు వచ్చి ఫీస్ కట్టారా? ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు.'' అన్నాడు.రమ ఆశ్చర్య పోయింది.నాలుగు రోజుల నుంచీ ఎండలో నిలబెట్టిన అశ్విన్ కు ఇంట్లో చెప్పటం తెలియలేదు ఎందుకు నిలబెట్టారు అని వాడికి తెలిస్తే కదా! నొప్పి వచ్చినపుడు ఏడ్చి ఉంటాడు.మళ్ళీ మర్చిపోయి ఉంటాడు.పాపం అశ్విన్! మనసులో బాధ పడింది రమ. మీరు మాకు ఫోన్ చేయవచ్చు కదా.లేదంటే రెండు నెలలకు ముందుగానే కట్టించుకొంది.డబ్బులు లేనివాళ్ళు చదివే స్కూల్ కాదు కదా ఇది.ఇంత ఎక్కువ ఫీజులు కడుతున్నారు అంటే పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు.వాళ్ళకి అఫెసుల్లో బిజీగా ఉంటుంది.కొద్దిగా అటో ఇటో అవుతుంది.మీకు ఏది కావాలన్నా పెద్దవాళ్లకు అడగండి. ఇలా పిల్లలను శీక్షిస్తే వాళ్లకు ఏమి తెలుస్తుంది.స్కూలుకు చక్కగా వచ్చే పిల్లలు రానని ఏడుస్తారు తప్ప వాళ్లకు ఇంట్లో చెప్పడం కూడా రాదు.ఐదేళ్ల పిల్లకు ఏమి చెప్పడం వస్తుంది.చిన్న విషయానికి పెద్ద శిక్ష లు వేసి వాళ్ల మనసులు కఠినం గా మర్చకండి. ఇలా ఏడి పిస్తెనే పెద్దగా అయి కాలేజ్ లకి వచ్చాక లెక్చరర్ లను ఏడిపించి విసిగిస్తుంతరు.ఈ పిల్లలకు మర్యాద మన్నన లేదు.రౌడీ గళ్లు అని మీరు పిలిచే ఆ కాలేజ్ స్టూడెంట్స్ అలా కావడానికి మీరే కారణం.చిన్నప్పుడు యే కారణం లేకుండా ఇలా పునిష్మెంట్లు ఇవ్వకూడదు.అర్థం చేసుకోండి.లేదంటే నేను మా పిల్లాడిని వేరే స్కూల్లో చేరుస్తను.అన్నది రమ.ప్రిన్సిపాల్ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.రమ నమస్కారం పెట్టీ వెళ్ళిపోయింది.

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు