వెలగచెట్టుపైన ఉన్న కోతి పండిన ఆరు వెలగపండ్లు పగులకొట్టుకుని ఉప్పు,కారం అద్దుకుతిని నిద్రకు ఉపక్రమించాడు. కొద్ది సేపటికే కడుపులో గడబిడకావడంతో చెట్టుదిగి పొదలమాటుకు వెళ్ళాడు అలా పలుమార్లు కడుపునొప్పితో బాధపడుతూ అక్కడే పొదలమాటునఉంది. తెల్లవారుఝూమున వెలగచెట్టుపైకి చేరినిద్రపోసాగాడు. ఇంతలో అదేచెట్టుపైనున్నకోడి తొలికూతా బిగ్గరగాకూసింది.అదిరిపడి నిద్రలేచిన కోతి చేతికి అందిన చిన్నవెలగకాయతుంచి,కొడిపైకి బలంగావిసిరి నిద్రపోసాగాడు .వెలగకాయ దెబ్బతిన్న కోడి గిలగిలలాడుతూ నేలపైపడి పరుగుతీసింది.
ఎక్కడినుండో కోడిని పట్టుకువచ్చిన నక్క వెలగ చెట్టుకింద తిని మిగిలిన భాగాలను వదలి వెళ్ళింది.తెల్లవారుతూనే చెట్టుకింద కనిపించిన కోడి ఈకలు అవశేషాలు చూసిన కోతి అమ్మో అది సింహరాజు పెంపుడుకొడి తను కొట్టిచంపాను అనుకుని భయంతో పరుగుతీయసాగాడు. అలాపరుగుతీస్తూ ఆయాసపడుతున్న కోతిని చూసిన ఎలుగు బంటి 'అల్లుడు ఎందుకు భయపడుతున్నావు?'అన్నాడు. ' అబ్బే ఊరికే పరిగెడుతున్నామామా 'అన్నాడు. ' సరేకాని పిల్లలు ఆకలి అని ఏడుస్తున్నారు,నేనువెళ్ళి ఆకొండగుహలో తేనెతుట్టెలు తుంచుకువస్తాను కాస్తమాపిల్లలను చూస్తుఉండు 'అన్నాడు ఎలుగుబంటి. ' ఈమాత్రాం పని నేను చేయలేనా ఏది ఆ పాత్ర ఇలాఇవ్వు' అని కొండ గుహకు బయలుదేరాడు కోతి. 'జాగ్రత్త అవిమాములు తేనెటీగలుకావు కొండతేనెటీగలు'అన్నాడు ఎలుగుబంటి. కొండగుహచేరిన కోతి అందుబాటులోని తేనెతుట్టెను నెమ్మదిగా తుంచింది. ఝూం అంటూ లేచిన తేనెటీగలు కొన్ని కోతిని కసితీరాకుట్టాయి.ఆబాధకు చేతిలోని పాత్ర తలపై బోర్లించుకుని కొండగుహ వెలుపలకు పరుగుతీసాడు కోతి. లక్షల తేనెటీగలు మూకఉమ్మడిగా దాడికి వచ్చాయి. వాటికి అందకుండా పరుగుతీస్తూ, నిద్రపోతున్న సింహరాజును తగిలి బోర్లపడ్డాడు కోతి.
తరుముతూ వచ్చి తేనెటీగలు కోతి తోపాటు సింహాన్ని కుట్టసాగాయి. ఆబాధ భరించలేని సింహరాజు పరుగుతీసి,జలపాతం ధారకింద నిలబడ్డాడు.సింహన్ని అనుసరించింది కోతి. తేనెటీగలు వెళ్ళిన తరువాత 'కోతి బుద్ధివచ్చిందా ఎవరిపనులు వారేచేయాలి.ఎలుగుబంటి పని నువ్వు చేయలేవు. కోకిలపాట కాకి పాడలేదుగా ! ఎవరు ఏవిధంగా జీవించాలో అలానే జీవించాలి. మనదికాని పనికిపోతే ఇలా నే ఉంటుంది. అయినా నాపిచ్చికాని నీకు ఎంతచెప్పినా ఎన్ని సామెతెలు వేసినా నువ్వు మారవు. కాచిన వెన్నల అడవి 'అన్నది పిల్లరామచిలుక.తోక ఎత్తిపట్టి కోపంతో లాగిపెట్టి ఓతన్నుతన్నాడు సింహం.అసలే ఎర్రగాఉండేప్రదేశం సింహంతన్నడంతో మరింత ఎర్రబారి ఎవరికి చెప్పాలో తెలియనికొతిబావగిజగిజలాడుతూ రామచిలుక అడవికాచిన వెన్నెల అన్నందుకు కోపగించుకుంది.