అప్పుడే D.S.Cద్వారా ఎంపికకాబడి సాయిమోహన్ ఈదరాడ హైస్కూల్ టీచర్ గా జాయిన్ అయ్యాడు "సంతోషం మాస్టారు dsc అంటే ఆంధ్రాసివిల్స్ అంటారు జాబ్ కొట్టడం మాటలుకాదు పైగా మంచి స్కూల్ లో మెదటిసారిగా జాయినింగ్ లక్కీ ఫెలో మీరు మా ఈదరాడ హైస్కూల్ కు చరిత్రవుందీ ! ఈ వూరంతా టీచర్లే ! ఇటువంటి స్కూల్ దొరకటం పూర్వజన్మసుకృతం, కష్టపడి మంచిపేరు తెచ్చుకోండీ " అన్నారు ప్రసాద్ మాస్టారు ఆయన అదే స్కూల్ లో పనిచేసే టీచర్ "తప్పనిసరిగానండీ మీలాంటి సీనియర్ టీచర్లసహకారం-సలహాలతో నడుస్తానండీ" అన్నాడు సాయిమోహన్ @@@@@@@ సరిగ్గా ఆరునెలలుగడిసాయి సాయిమోహన్ అదేగ్రామంలో నివాసం వుండీ పిల్లలకు ఉదయం-సాయంకాలం ట్యూషన్ చెబుతూ , సాయంకాలం పాఠశాల ఆవరణలో ఆటలు నేర్పుతూ గ్రామంలో మంచిపేరుసంపాదించాడు. ఒకరోజు "సాయిగారు స్కూల్ అయిపోయిందీ !ఇంటికివెళ్ళందీ ఇలా రేయింబవళ్ళు కష్టపడితే ఆరోగ్యం పాడవుతుందీ ! జాగ్రత్త " అన్నాడు ప్రసాద్ "లేదండీ ఓపికవున్నంతకాలం కష్టపడతా ! మనకంటే తెలివైనవాళ్ళు,టాలెంట్ వున్నవాళ్ళుకి రాని ఉద్యోగం మనకు భగవంతునిదయవల్ల వచ్చిదండీ! నావిద్యార్ధులు నాలా ఉద్యోగం సంపాదించి -జీవితంలో సెటిల్ అవ్వాలని కోరుకుంటూ ఇలాచెప్పుతున్నానండీ! ఇదే ఆనందం సర్ " అన్నాడు సాయి "అలాగా ! సంతోషం సర్ అందరికి ఉద్యోగాలు వచ్చేస్తే! ఇతరుపనులు ఎవరుచేస్తారు ? అందరూ పల్లకీ ఎక్కేస్తే ? ఎవరు మోస్తారండీ ! "వ్యంగ్యంగా అన్నాడు ప్రసాద్ . " ఆ పల్లకీ ఎక్కేది నా దగ్గర చదివిన విద్యార్ధులు అయ్యివుండాలని నేననుకుంటానండీ! అన్నాడు సాయిమోహన్ . ప్రసాద్ కు ఏం చెప్పాలో తెలియలేదు చిరునవ్వుతో ముందుకుసాగాడు అతనిని పల్లకీలో కూర్చోడానికి కారణం అయిన గురువులనుతలుచుకుంటూ...