గీత గోవింద - కందర్ప మూర్తి

Geeta govinda

హైదరాబాదు చార్మీనార్ పరిసర ప్రాంతం. సాయంకాలమైంది. రోడ్ల మీద

సందర్సకులతో చిరు వ్యాపారులు సందడిగా కనబడుతున్నారు.

పాతికేళ్ల గోవిందా ప్లాస్టిక్ సామాన్లు ఆడవారి జడపిన్నులు పిల్లల ఆటబొమ్మలు పూరీ జగన్నాథుని పటాలు ఒక పెద్ద పొడవైన కట్టెకు అట్టతో కట్టి , నెత్తి మీద పక్షి ఈకల టోపీ పెట్టుకుని నుదుటున ఎర్రని నిలువు తిలకం

పెద్ద పువ్వుల షర్టుతో జీరల పైజామా ధరించి జోకర్ లా వచ్చే పోయే వారిని ఆకర్షించడానికి నోట్లో ప్లాస్టిక్ బూరా ఉంచుకుని ఊదుతుంటే శబ్దంతో పాటు గొట్టం లోంచి ఒక రంగు రిబ్బన్ బయటకు వచ్చి లోపలికి పోతోంది.ముఖ్యంగా పిల్లలు వచ్చినప్పుడు ఇంకా సందడి చేస్తుంటే దాన్ని కొనమని పిల్లలు మారాం

చేసేవారు.

గోవిందా పాతికేళ్ల ఎతైన కండల శరీరంతో మాటలతో ఫన్నీగా కనబడతాడు. అతని తండ్రి జగత్ క్రిష్ణ మహాపాత్రో ఒరి‌స్సాలోని పూరీ జిల్లా

నుంచి భార్య మాయాదేవితో గోవిందా చిన్నగా ఉన్నప్పుడు బ్రతుకు తెరువు

కోసం హైదరాబాదు రావడం జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో

భర్త చనిపోవడంతో ఐదేళ్ల కొడుకు గోవిందాతో స్వస్థలానికి తిరిగి వెళ్లక

ఇక్కడే జీవనోపాధి వెతుక్కుంటూ భవానీ మందిరం దగ్గర పూజా వస్తువులు

అమ్ముకుంటూ గోవిందాను పెంచి పెద్ద చేసింది. వారి ఇంటి దైవం పూరీ

జగన్నాథుని పూజిస్తూ పూజా కార్యక్రమాలు చేస్తుంటుంది.

గోవిందా తెలుగు ప్రజల బస్తీలో పెరిగినందున హిందీతో పాటు తెలుగు

బాగానే మాట్లాడటం చదవడం నేర్చుకున్నాడు. చదువు కోవాలని శ్రద్ధ ఉన్నా

తల్లికి సహాయ పడటానికి చదువు మద్యలో ఆపేసి చిరువ్యాపారం మొదలెట్టి

ఆర్థికంగా సహాయ పడుతున్నాడు.

సాయంకాల మైనందున గోవిందా వ్యాపార సందడిలో ఉన్నాడు.

అటుగా వెల్తున్న ఒక విదేశీ అమ్మాయి గోవిందా చేసే హాస్యపు చేష్టలను తదేకంగా చూస్తూ నిలబడింది. ఆ అమ్మాయిని చూసి గోవిందా నోట్లో

బూరాను మరింత జోరుగా ఊదుతుంటే, ఎర్రగా ఎత్తుగా రాగిజుత్తు పోనీటైల్ తో ఉన్న విదేశీ అమ్మాయి నవ్వుతూ మరింత దగ్గర కొచ్చి అతడిని ధ్యానంగా చూస్తూ ఆ వస్తువు పేరు, అట్ట మీదున్న పూరీ జగన్నాథుని చిత్ర పటం చూపి ధరెంతని ఆంగ్లంలో అడిగింది. ఆ అమ్మాయి మాట్లాడే భాష తెలియక తెల్ల మొహం వేసాడు గోవిందా.

అటుగా వెల్తున్న ఒక యువకుడు విదేశీ అమ్మాయిని చూసి ఆగి వారి

సంభాషణ విని అమ్మాయి అడిగిన మాటను హిందీలో చెప్పడం, గోవిందా చెప్పిన మాటను ధరను ఇంగ్లీషులో చెప్పడం జరిగింది.

ఆ విదేశీ అమ్మాయి కొత్త బూరాను, హైర్ క్లిప్సుతో పాటు జగన్నాథుని చిత్ర

పటం తీసుకుని ఇండియా డబ్బు ఇచ్చింది. గోవిందా హాస్యపు చేష్టలు చూస్తూ నవ్వుకుంది చాలా సేపు.

ఆ విదేశీ యువతి పేరు గొనొండా జాక్విన్. కెనడా దేశస్థురాలు.తల్లిదండ్రులు శ్రీమంతులు. ఫిలాసపీ విద్యార్థినిగా అక్కడి యూనివర్సిటీలో ఉన్నత

చదువులు చదువుతూ ప్రపంచ పర్యాటనలో ఇండియాలోని ఆధ్యాత్మిక

వాతావరణానికి ఆకర్షితురాలై పుణ్యక్షేత్రాలు పర్యాటక స్థలాలను

సందర్సిస్తోంది. ఆ అమ్మాయి ప్రపంచ హరేరామ -హరేక్రిష్ణ ఆధ్యాత్మిక సంస్థలో సబ్యురాలు. హైదరాబాదు వచ్చి అన్ని సందర్సన స్థలాలను

చూస్తూ చార్మీనార్ వైపు వచ్చి చారిత్రాత్మక కట్టడం చూస్తున్నప్పుడు గోవిందా కనబడటం జరిగింది.

గోవిందాలో ఏమి ప్రత్యేకత కనబడిందో వచ్చినప్పటి నుంచి అతని

చుట్టూ తిరుగుతోంది.

హైదరాబాదుకు వచ్చే విదేశీ టూరిస్టులు గైడ్ సహాయంతో చార్మినార్

సందర్సించి పెద్ద షాపుల్లో మార్కెటింగ్ చేసి వెళిపోతారు కాని చిరు వ్యాపారుల వద్దకు రారు.

కెనెడా యువతి వచ్చినప్పటి నుంచి గోవిందాలో మార్పు వచ్చింది.

ఆమె నవ్వు మొహం, భాష అర్థం కాకపోయినా మాట తీరు నచ్చాయి.

ఇప్పటి వరకు విదేశీ టూరిస్టులెవరూ తన దగ్గర వస్తువులు కొనలేదు అందువల్ల తను ఎలాగైనా ఆంగ్లం నేర్చుకుని వచ్చే విదేశీ సందర్సకులతో

మాట్లాడాలని నిర్ణయాని కొచ్చాడు. తను నివాసముండే తెలుగు బస్తీలో

క్రిష్ణమూర్తి అనే బాచిలర్ మెడికల్ రిప్రజెంటేటివ్ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవాలి

అనుకున్నాడు.

ఒక ఆదివారం ఆయన తీరికగా ఉన్నప్పుడు వెళ్లి తన మనసులోని మాట

చెప్పాడు గోవిందా. ఇదివరకు రెండు మూడు సార్లు ఎదురు పడినా వారు పరిచయం లేనందున పలకరించుకో లేదు. గోవిందా కలుపు గోలుతనం

మాటతీరు నచ్చి తనకి తీరిక చిక్కినప్పుడు వస్తే ఇంగ్లీష్ నేర్పుతానన్నాడు

క్రిష్ణమూర్తి.

ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకుని విదేశీ సందర్సకులతో మాట్లాడి తన మనోవాంఛ తీర్చుకోవాలన్న పట్టుదలతో కావల్సిన పుస్తకాలు సంపాదించి సమయం చిక్కినప్పుడు క్రిష్ణమూర్తి దగ్గరకు వెళ్లి ఇంగ్లీష్ లో మాట్లాడటం చదవడం నేర్చుకుంటున్నాడు. మద్యలో చదువు వదిలి నప్పటికీ ఇంతకు ముందు ఇంగ్లీష్ లో ప్రమేయమున్నందున తొందరలోనే భాష మీద పట్టు

సాధిస్తున్నాడు. గోవిందా లోని చురుకుదనం గ్రహణశక్తికి ఆశ్చర్య పోయి మరింత శ్రద్దగా మాట్లాడటం ప్రాక్టీసు చేయిస్తున్నాడు. తొందరలోనే తన కోరిక నెరవేరి ఇంగ్లీషులో మాట్లాడ గలుగుతున్నందుకు గర్వంగా

ఫీలవుతున్నాడు గోవిందా. ముసలితల్లి కూడా కొడుకులో వచ్చిన మార్పుకు

సంపాదనలో పెంపు చూసి ఆనంద పడింది. సరైన పిల్ల దొరికితే పెళ్లి

చేసి జీవితంలో స్థిర పరచాలను కుంటోంది.

గోవిందా రోజూ వేసుకునే బట్టల్లో మార్పు వచ్చింది రెడీ మేడ్ పిల్లల బట్టల వ్యాపార మార్పుతో, ఆంగ్లంలో సందర్సకులతో మాట్లాడుతూ, ఆటలు పట్టించే తోటి చిరు

వ్యాపారుల్ని దూరం పెట్టేడు. వ్యాపారం బాగా పుంజుకుంది.

రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు అనుకోకుండా కెనడా యువతి

గొనొండా జాక్విన్ చార్మినార్ వద్ద గోవిందా కోసం వెతుకుతోంది. స్థలం

వ్యాపారం వేషభాషలు మార్చినందున తొందరగా గుర్తించ లేకపోయింది

గోవిందాని. తన మనసులో ఒక ముద్ర వేసి తనలో ఇంత మార్పు తెచ్చిన

ఆ విదేశీ అమ్మాయి మళ్లీ కనబడటం తన కళ్లను తనే నమ్మలేక పోతున్నాడు గోవిందా.

ఆమెని మళ్లీ చూసిన ఆనందంలో "హవార్యు యు, మేడం? " అని

ఇంగ్లీషులో అడిగాడు. మొదటిసారి చార్మీనార్ వద్ద తను చూసిన కామెడీ

గోవిందాకు ఇప్పుడు తన కళ్లెదుటు ఉన్న జంటిల్ మేన్ గోవిందాకు చాలా

వ్యత్యాసం కనబడుతోంది.

కెనడాలో తనెంతో ప్రేమించిన బోయ్ ఫ్రెండ్ రాబర్ట్ యాక్సిడెంట్లో

చనిపోవడం , ఆ బాధను తట్టుకోలేక మనశ్శాంతి కోసం హరే రామ

హరేకృష్ణ ఆధ్యాత్మిక సంస్థలో సబ్యురాలిగా చేరి ప్రపంచ యాత్రలో ఇండియా రావడం, హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో తన ప్రియుడు

రాబర్ట్ పోలికలున్న గోవిందాను చూడటం అతని మాటలతో ఆకర్షింప

బడటం జరిగింది.

హైదరాబాదు వదిలి వెళ్లినా అప్పడప్పుడు రాబర్ట్ జ్ఞాపకాలను మరిచి

పోలేక హైదరాబాదులో గోవిందాను మళ్లీ చూడాలని చార్మినార్ వద్దకు

వచ్చిన గొనొండా అతని లోని వేషభాషలకు ఆనందాశ్రువులు రాల్చింది.

హైదరాబాదు స్టార్ హొటల్లో బసచేసి గోవిందాకు నచ్చచెప్పి కెనడా

తీసుకుపోయి పెళ్లి చేసుకుని బిజినెస్ లో పెట్టాలనుకుంది.

ముసలి తల్లిని వదిలి తను కెనడా వెళ్లడానికి గోవిందా ససేమిరా

ఒప్పుకో లేదు. చివరకు గోవిందా మీద ప్రేమతో తన మాతృ దేశాన్ని ,

అమ్మానాన్నల్ని వదిలి తన పేరును హిందూ పేరు' గీత' గా మార్చుకుని

భారతదేశ పౌరసత్వం పొంది తల్లిదండ్రుల అంగీకరించడంతో గోవిందాను పెళ్లి చేసుకుని "గీత గోవింద " పేరుతో గార్మెంటు బిజినెస్ మొదలు పెట్టి

బ్రహ్మాండంగా పేరు తెచ్చుకుని భారత మహిళగా మారిపోయింది.

పెద్ద బంగళా కారు హోదాతో హిందీ భాష నేర్చుకుని ముసలి

అత్త గార్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటోంది గీత ఉరఫ్ గొనొండా. వారికి

కలిగిన కొడుకు పేరు పూరీ జగన్నాథ్ గా నామకరణం చేసారు.

* సమాప్తం*

మరిన్ని కథలు

Chalicheemalu kaadu
చలిచీమలు కాదు
- జి.ఆర్.భాస్కర బాబు
Enta chettuki anta gaali
ఎంతచెట్టుకు అంత గాలి
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.