చిన్నతప్పెటపై దరువు వేస్తు అడవిఅంతాతిరుగుతున్న కుందేలు ' ఇందుమూలంగా తెలియజేయడమేమనగా మనఅడవిలో నివిసించే ప్రాణులు అన్ని,రేపటినుండి తాము సంపాదించుకున్న ఆహారంలో నాలుగోవంతు సింహరాజు గారికి సమర్పించవలసినదిగా కొత్తచట్టం చేయబడినది అనితెలియజేయడమైనది.ఎవరైనా తాము సంపాదించుకున్న ఆహారంలోని భాగం సింహరాజుగారికి ఇవ్వకుండా తింటే,నిరంతంమిమ్మల్నిగమనిస్తున్న అడవిలోని పక్షులు ఆవిషయం సింహరాజుకు తెలియజేస్తాయి. అప్పుడు సింహరాజు విథించే శిక్ష చాలాకఠినంగాఉంటుంది 'అని తప్పెటపై దరువు వేస్తు అడవి నలుమూలల తిరగసాగింది.
సింహరాజు లేని సమయంచూసి జంతువులన్ని సమావేశమైనవి ' ఇదెక్కడి అన్యాయం అసలే ఆహారం దొరకక మనం ఇబ్బంది పడుతుంటే ఇందోలో సింహరాజుకు భాగం ఇవ్వటం ఎలాకుదురుతుంది? 'అన్నాడు గాడిద . చెట్టుపైనున్న పక్షులను చూసిన కోతి వాటిపట్టుకోబోయాడు. ప్రాణభయంతో పక్షులు దూరంగా పారిపోయాయి. ' సమస్య ఏదైన చూడటానికి కొండలా భయంకలిగిస్తుంది. ధైర్యంగా ఢీకొడితే మేఘంలా విడిపోతుంది. భయమే మనకు తొలిశత్రువు. ఎప్పుడూ అపాయాన్ని ఉపాయంతో జయించాలి.ప్రతిసమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆసమస్యనుండి ఎలా తప్పుకోవాలో ఆలోచించుకోవాలి లేదంటే అనుభవజ్ఞులైన పెద్దల సలహపొందాలి. సింహరాజుకు గుణపాఠం నేను నేర్పుతాను, ఈసమస్యకు తగిన పరిష్కురం ఇదే ' అంటూ అందరికి ఏంచేయాలో వివరించాడు ఏనుగు.
తెల్లవారుతూనే చెట్లనుండి చిన్నకొమ్మలతోకూడిన ఆకులు తెచ్చి సింహరాజు గుహముందు పెట్టివెళ్ళాడు ఏనుగు. కొద్దిసేపటికి గుర్రము, గాడిద,కుందేలు కలసి కొంత పచ్చిగడ్డితెచ్చిపెట్టివెళ్ళాయి.అలా రెండు రోజులుగా,సమస్త అడవిలో ప్రాణులు అన్ని ఎండుగడ్డి,పచ్చిగడ్డి తెచ్చి సింహరాజు గుహముందు పెట్టివెళ్ళాయి. తనుగుహముందు ఉన్న పచ్చిగడ్డి ఎండుగడ్డిని చూసిన సింహరాజు మండిపడుతూ, 'ఏమిటి ఈఅడవికి రాజును నేను గడ్డితినడం ఏమిటి?' అన్నాడు. 'ప్రభూ ఆహారమే కాదు ఈఎండలకు గుక్కెడునీళ్ళకే మేమంతా ఇబ్బంది పడుతున్నాం' అన్నాడు వినయంగా ఎలుగుబంటి. 'ప్రభూ అడవి అంతా గాలించినా ఒక్కపండుకూడా లభించలేడు.చింతకాయలు తిని పొట్టనింపు కుంటున్నాను. కరువుతో అడవి అల్లాడిపోతుంది'అన్నాడు కోతి.
'అలాగా నక్క ఏమిటి అలాచెప్పాడు ? మీరంతా పలురకాలు కడుపు నిండా తింటున్నారు అనిచెప్పాడు. అయినా ఒకరు సంపాదించినది ఏదైనామనం కోరుకోవడం తప్పుఅనినేను అనుభవపూర్వకంగా
తెలుసుకున్నాను, నాతెలివితక్కువ చట్టానికి నేను సిగ్గుపడుతున్నాను. ఏదైనా చట్టం చేస్తే అది పదుగురికి ఉపయోగ పడాలి వ్యక్తిగత ప్రయోజనాలకు చట్టం చేస్తే ఇలానే ఉంటుంది ,కష్టపడకుండా ఆహరంకాని మరేదైనా ఉచితంగా ఒకరినుండి పొందాలి అనుకోవడం అవివేకం. నేటినుండి ఎవరూనాకు ఆహారం ఇవ్వనవసరంలేదు'అన్నాడు సింహారాజు.
ఈవిషయం కుందేలు అడవిఅంతటా వెంటనే చాటింపువేసింది. అదివిన్న అడవి జంతువులు అన్నిఆపదనుండి తమనుకాపాడి సింహారాజుకు గుణపాఠం నేర్పినందుకు ఏనుగును అభినందించాయి.